మంత్రిమండలి

భారతదేశాని కి మరియు గుయాన కు మధ్య వాయు సేవల ఒప్పందాని కి ఆమోదం తెలిపినమంత్రిమండలి

Posted On: 22 FEB 2023 12:46PM by PIB Hyderabad

భారతదేశ ప్రభుత్వాని కి మరియు గుయాన సహకార గణతంత్ర ప్రభుత్వాని కి మధ్య వాయు సేవల ఒప్పందం పై సంతకాలు చేసేందుకు గౌరవనీయులు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదాన్ని తెలియ జేసింది. ఈ ఒప్పందం లో చేరేందుకు గాను అవసరమైన ఆంతరంగిక ప్రక్రియ ను పూర్తి చేసినట్లు గా ప్రతి ఒక్క పక్షం రూఢి చేస్తూ తత్సంబంధి దౌత్య పత్రాల ను ఇచ్చిపుచ్చుకొన్న అనంతర కాలం లో వాయు సేవల ఒప్పందం అమలు లోకి వస్తుంది.

 

గుయాన లో భారతదేశాని కి చెందిన వారు చెప్పుకోదగిన సంఖ్యల లో ఉన్నారు. మరి 2012 వ సంవత్సర జన గణన ప్రకారం జనాభా లో దాదాపు గా 40 శాతం లెక్క కు వచ్చేటటువంటి అతి పెద్ద నిర్దిష్ట జాతీయ సమూహం గా కూడాను వారు ఉన్నారు. గుయాన తో వాయు సేవ ల ఒప్పందం పై సంతకాలు చేయడం వల్ల రెండు దేశాల మధ్య వాయు మార్గ సేవల ఏర్పాటు కు ఒక రూపు రేఖ సిద్ధం కాగలదు. విమాన యానం బజారు అంతకంత కు పెరుగుతూ ఉండడం, భారతదేశం లో విమాన యాన రంగం లో సంస్కరణల ను చేపట్టిన తరువాత, అంతర్జాతీయ వాయు సంధానం కోసం మార్గాన్ని సుగమం చేయడానికని అనేక దేశాల తో వాయు సేవ ల సంబంధి ఒప్పందం పై సంతకాలు చేయడం జరిగింది. ఎయర్ సర్వీసెస్ అగ్రీమెంట్ (ఎఎస్ఎ) ఇరు దేశాల మధ్య వాయు మార్గ కార్యకలాపాల కోసం ఒక చట్టపరమైన నియమావళి రంగాన్ని సిద్ధం చేస్తుంది. ఇది దేశాల సార్వభౌమత్వం, విమాన యాన సంస్థ ల జాతీయత మరియు ప్రతి ఒక్క పక్షాని కి చెందిన నిర్దిష్ట ఎయర్ లైన్స్ కు వాణిజ్య అవకాశాల ఆదాన ప్రదానం సంబంధి సిద్ధాంతాల పైన ఆధారపడుతుంది. వర్తమానం లో భారతదేశ ప్రభుత్వాని కి మరియు గుయాన సహకార గణతంత్ర ప్రభుత్వాని కి మధ్య ఎటువంటి ఎయర్ సర్వీసెస్ అగ్రిమెంట్ (ఎఎస్ఎ) అనేది లేదు.

 

భారతదేశం, గుయాన లు కన్ వెన్శన్ ఆన్ ఇంటర్ నేశనల్ సివిల్ ఏవియేశన్ (చికాగో కన్ వెన్శన్) యొక్క సంతకం దారు దేశాలు గా ఉన్నాయి. భారతదేశ గణతంత్ర ప్రభుత్వం మరియు గుయాన సహకార గణతంత్ర ప్రభుత్వం ల ప్రతినిధి వర్గాలు ఐసిఎఒ ఎయర్ సర్వీసెస్ సంప్రదింపుల కార్యక్రమం జరిగిన కాలం లో అంటే 2016 వ సంవత్సరం లో డిసెంబర్ 6 వ తేదీ నాడు బహామాస్ లోని నసావు లో కలుసుకొన్నాయి ఆ సందర్భం లో భారతదేశాని కి, గుయానా కి మధ్య 06 2016 వ సంవత్సరం డిసెంబర్ 06 న జరిగిన అవగాహన పూర్వక ఒప్పందం ప్రకారం రెండు దేశాల మధ్య నిర్ధారిత వాయు సేవల కై ఎఎస్ఎ యొక్క ప్రచురిత దస్తావేజు లను దాఖలు చేశాయి.

 

భారతదేశాని కి మరియు గుయాన సహకార గణతంత్రాని కి మధ్య క్రొత్త వాయు సేవల ఒప్పందం ఇరు పక్షాల విమాన రవాణాదారు సంస్థల కు వాణిజ్య పరమైన అవకాశాల ను అందిస్తూనే, అంతరాయాని కి తావు ఉండనటువంటి సంధానాని కి అనువైన వాతావరణాన్ని కల్పించగలదు.

 

 

***



(Release ID: 1901460) Visitor Counter : 176