యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

అథ్లెట్లకు విదేశీ శిక్షణ, పోటీల కోసం ఆర్థిక సహాయాన్ని క్లియర్ చేసిన ఎంఓసీ

Posted On: 19 FEB 2023 2:46PM by PIB Hyderabad

యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ (ఎవైఏఎస్) మిషన్ ఒలింపిక్ సెల్ (మిషన్ ఒలింపిక్స్ సెల్) ఫిబ్రవరి 15 & 16వ తేదీల్లో 10 జూడోకాస్, 2 బ్యాడ్మింటన్ క్రీడాకారులు మరియు 3 ఫెన్సర్ల కోసం శిక్షణ మరియు పోటీల (గ్రాండ్ స్లామ్స్) కోసం ఆర్థిక సహాయాన్ని ఆమోదించింది. ఉజ్బెకిస్థాన్, జార్జియాలో 21 రోజుల పాటు 3 టాప్స్ డెవలప్‌మెంట్ మరియు 7 ఎన్.సి.ఒ.ఈ అథ్లెట్‌లతో కూడిన 10 జూడోకాలు శిక్షణ పొందుతుండగా, వీరు ఉజ్బెకిస్థాన్, జార్జియా మరియు టర్కీలలో జరిగే 3 గ్రాండ్ స్లామ్ ఈవెంట్‌లలో కూడా పోటీపడతారు. క్రీడాకారుల భాగస్వామ్య రుసుము, విమాన ఛార్జీలు, బస/ బోర్డింగ్, వైద్య బీమా ఖర్చు, స్థానిక ప్రయాణం, ఆహార ఖర్చులు ఇతర ఖర్చులను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (శాయ్) భరిస్తుంది. జర్మన్ ఓపెన్, ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్‌షిప్, స్విస్ ఓపెన్, ఓర్లీన్స్ మాస్టర్స్, స్పెయిన్ మాస్టర్స్, ఓర్లీన్స్ మాస్టర్స్‌లో పోటీ పడేందుకు ఇద్దరు బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఖర్చులకు కూడా ఎంఓసీ ఆమోదించింది.  జర్మన్ ఓపెన్, ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్‌షిప్, స్విస్ ఓపెన్, ఓర్లీన్స్ మాస్టర్స్, స్పెయిన్ మాస్టర్స్ మరియు ఓర్లీన్స్ మాస్టర్స్‌లో పోటీ పడేందుకు ఇద్దరు బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఖర్చులకు కూడా ఎంఓసీ ఆమోదించింది. ఫెన్సింగ్‌లో, మార్చిలో తస్ఖెంట్‌లోని క్యాడెట్ & జూనియర్ ఆసియా ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు ఫెన్సర్లు లైష్రామ్ మొరంబా, శ్రేయ గుప్తా మరియు ఓయినమ్ జుబ్రాజ్ సింగ్‌లకు ఆర్థిక సహాయం ఆమోదించబడింది, స్విమ్మర్ శ్రీహరి నటరాజ్‌కి సింగపూర్ జాతీయ ఛాంపియన్‌షిప్‌లలో పాల్గొనడానికి ఆర్థిక సహాయం అందించబడింది. ఈ ఈవెంట్ కోసం అతని వ్యక్తిగత కోచ్ నిహార్ అమీన్ & ఫిజియోథెరపిస్ట్ కార్తికేయ బాలవెంకటేశన్ సేవలు అందించారు. ఈ ఖర్చులను కూడా సర్కారు భరించనుంది.  రెండు రోజుల సమావేశంలో, ఎంఓసీ సభ్యులు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (శాయ్) మరియు వివిధ జాతీయ సమాఖ్యల ప్రతినిధులతో పాటు రాబోయే ఆసియా క్రీడలు మరియు పారిస్ ఒలింపిక్స్‌కు దారితీసే సంవత్సరానికి సంబంధించిన తమ రోడ్‌మ్యాప్‌పై కూడా చర్చించారు.

*****



(Release ID: 1900612) Visitor Counter : 164