ప్రధాన మంత్రి కార్యాలయం

గోరఖ్ పుర్ సాంసద్ ఖేల్ మహాకుంభ్ ను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యంద్వారా ప్రసంగించిన ప్రధాన మంత్రి


‘‘క్రీడా స్ఫూర్తి అనేది రాబోయే కాలం లో క్రీడాకారులు అందరి సాఫల్యానికి తలుపుల ను తెరుస్తుంది’’

‘‘ప్రాంతీయ స్థాయి లో జరిగే పోటీ లు స్థానిక ప్రతిభ ను వృద్ధి చెందింప చేడయంఒక్కటే కాకుండా యావత్తు ప్రాంతం లో క్రీడాకారుల లో ధైర్యాన్నిపెంచుతాయి కూడాను’’

‘‘సాంసద్ ఖేల్ మహాకుంభ్ అనేది ఒక కొత్త దారి, అది ఒక కొత్త వ్యవస్థ అని చెప్పాలి’’

‘‘క్రీడల జగతి లో దేశం యొక్క శక్తియుక్తుల ను ప్రముఖం గా చాటడం లో సాంసద్ఖేల్ మహాకుంభ్ కు ఒక ప్రముఖమైన పాత్రంటూ ఉంది’’

‘‘క్రీడా రంగ భవిష్యత్తు తాలూకు భవ్యమైన మౌలిక సదుపాయాల కల్పన కు సాంసద్ ఖేల్ మహాకుంభ్ ఒక బలమైన పునాది ని వేస్తుంది’’


‘‘క్రీడల మంత్రిత్వ శాఖ కు బడ్జెట్ కేటాయింపు 2014 వ సంవత్సరం తో పోలిస్తే దాదాపు గా 3 రెట్లు అధికం గా ఉంది’’

Posted On: 16 FEB 2023 3:37PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గోరఖ్ పుర్ సాంసద్ ఖేల్ మహాకుంభ్ ను ఉద్దేశిం ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యం ద్వారా చి ప్రసంగిచారు.

శ్రోతల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, క్రీడాకారిణులు, క్రీడాకారులు ఈ స్థాయి కి చేరుకోవడం కోసం బాగా శ్రమించారన్నారు. గెలుపు, ఓటమి అనేవి క్రీడా రంగం లోను, మరి అలాగే జీవనం లోను ఒక భాగం అని ఆయన స్పష్టం చేస్తూ, క్రీడాకారులు అందరూ గెలుపు తాలూకు పాఠాన్ని నేర్చుకొన్నారు అని వ్యాఖ్యానించారు. క్రీడాస్ఫూర్తి అనేది ఆటగాళ్ళు అందరికీ భవిష్యత్తు లో విజయం తాలూకు ద్వారాల ను తెరుస్తుంది అని ప్రధాన మంత్రి అన్నారు.

ప్రశంసనీయమైనటువంటి మరియు ప్రేరణ ను ఇచ్చేటటువంటి కార్యక్రమం అయిన ఖేల్ మహాకుంభ్ ను గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఈ పోటీ లో కుస్తీ, కబడ్డీ మరియు హాకీ వంటి క్రీడల తో పాటు చిత్రలేఖనం, జానపద గేయాలు, లోక నృత్యం, ఇంకా తబలా, వేణువు వగైరా కళల కు చెందిన కళాకారులు సైతం పాల్గొన్నారని తెలిపారు. ‘‘అది క్రీడా సంబంధి ప్రతిభ కావచ్చు లేదా కళా సంబంధి ప్రతిభ కావచ్చు లేదా సంగీతానికి సంబంధించినటువంటి ప్రతిభ కావచ్చు.. ఆ ప్రతిభ యొక్క స్ఫూర్తి మరియు ఆ ప్రతిభ యొక్క శక్తి అంతా ఒకటే’’ అని ప్రధాన మంత్రి అన్నారు. మన భారతదేశాని కి చెందినటువంటి సంప్రదాయాలను మరియు జానపద కళా రూపాల ను ముందుకు తీసుకుపోయే నైతిక బాధ్యత ను గురించి కూడా ఆయన నొక్కిచెప్పారు. గోరఖ్ పుర్ కు పార్లమెంటు లో ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ రవి కిషన్ శుక్లా స్వతహా గా ఒక కళాకారుడు అంటూ ఆయన అందించిన సేవల ను ప్రధాన మంత్రి ఉదాహరించారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు శ్రీ శుక్లా ను ప్రధాన మంత్రి అభినందించారు.

ప్రధాన మంత్రి గత కొన్ని వారాల లో పాలుపంచుకొన్న సాంసద్ ఖేల్ మహాకుంభ్ పరంపర లో ఇది మూడో కార్యక్రమం గా ఉంది. భారతదేశం ప్రపంచం లో ఒక క్రీడా శక్తి గా మారాలి అంటే కొత్త కొత్త పద్ధతుల ను, నూతన వ్యవస్థల ను నిర్మించాలని ఆయన పునరుద్ఘాటించారు. ప్రతిభ ను ప్రోత్సహించడానికని స్థానిక స్థాయి లో క్రీడల పోటీల కు ప్రాముఖ్యాన్ని ఇవ్వాలి అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ప్రాంతీయ స్థాయి లో నిర్వహించే పోటీ లు స్థానిక ప్రతిభ ను వృద్ధి చెందింప చేయడం ఒక్కటే కాకుండా యావత్తు ప్రాంతం లో క్రీడాకారుల ధైర్యాన్ని పెంచుతుంది కూడాను అని పేర్కొన్నారు. ‘‘సాంసద్ ఖేల్ మహాకుంభ్ అనేది ఆ కోవ కు చెందినటువంటి ఒక కొత్త మార్గం, ఒక కొత్త వ్యవస్థ’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

గోరఖ్ పుర్ ఖేల్ మహాకుంభ్ లో ఒకటో సంచిక లో 20,000 మంది క్రీడాకారులు పాలుపంచుకొన్న విషయాన్ని ప్రధాన మంత్రి చెప్తూ, ఆ సంఖ్య ప్రస్తుతం 24,000 కు పెరిగింది, అందులో 9,000 మంది క్రీడాకారులు మహిళలే అని వెల్లడించారు. ఖేల్ మహాకుంభ్ లో పాల్గొంటున్న వేల కొద్దీ యువత చిన్న పట్టణాలు లేదా గ్రామాల నుండి వచ్చిన వారే అని ప్రధాన మంత్రి పేర్కంటూ, యువ ఆటగాళ్ళ కు అవకాశాల ను అందించే ఒక కొత్త వేదిక గా సాంసద్ ఖేల్ మహాకుంభ్ రూపొందింది అన్నారు.

‘‘వయస్సు ఎంతనే దానితో సంబంధం లేకుండా, ప్రతి ఒక్కరి కి శారీరికం గా దృఢత్వం తో ఉండాలి అనేటటువంటి అభిలాష అంతరంగం లో ఉంటుంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. పల్లెల లో జరిగే సంతల లో ఆటలు ఒక భాగం గా ఉండేవి. అఖాడా లలో రకరకాల ఆటల ను నిర్వహించే వారు అని ఆయన గుర్తు కు తీసుకువచ్చారు. ఇటీవల కొంత కాలం గా చోటు చేసుకొన్న ఒక మార్పు విచారకరమైంది అని ఆయన చెప్తూ, పాత వ్యవస్థ లు అన్నీ వెనుక పట్టు పట్టాయి అన్నారు. పాఠశాల లో పిటి పీరియడ్స్ ను గురించి కూడా ఆయన ప్రస్తావించి, వాటిని ప్రస్తుతం కాలక్షేపం సంబంధి పీరియడ్స్ గా భావించడం జరుగుతోంది అంటూ, ఈ వైఖరి దేశం మూడు నాలుగు తరాల క్రీడా సహాయకుల ను కోల్పోవడాని కి దారి తీసింది అన్నారు. టివి లో నిర్వహిస్తున్న ప్రతిభాన్వేషణ కార్యక్రమాల ను గురించి ప్రధాన మంత్రి ఒక పోలిక ను చెప్తూ, ఆ కార్యక్రమాల లో చిన్న పట్టణాల కు చెందిన అనేక మంది బాలలు పాలుపంచుకొంటున్నారన్నారు. భారతదేశం లో నివురు గప్పిన ప్రతిభ ఎంతో ఉంది అని ప్రధాన మంత్రి చెప్తూ, క్రీడా జగతి లో దేశం యొక్క సామర్థ్యాన్ని వెలికితీయడం లో సాంసద్ ఖేల్ మహాకుంభ్ ఒక ప్రముఖ పాత్ర ను పోషించవలసిన అవసరం ఎంతయినా ఉంది అన్నారు.

వందల కొద్దీ పార్లమెంటు సభ్యులు ఈ తరహా క్రీడా సంబంధి కార్యక్రమాల ను దేశం లో ఏర్పాటు చేస్తున్న సంగతి ని ప్రధాన మంత్రి వెల్లడిస్తూ, అటువంటి కార్యక్రమాల లో పెద్ద సంఖ్య లో యువ క్రీడాకారులు ముందడుగు వేసే అవకాశాన్ని చేజిక్కించుకొంటున్నారని పేర్కొన్నారు. చాలా మంది క్రీడాకారులు రాష్ట్ర స్థాయి లో మరియు జాతీయ స్థాయి లో ఆడతారని, అంతేకాక ఒలింపిక్స్ వంటి అంతర్జాతీయ కార్యక్రమాల లో దేశం కోసం పతకాల ను కూడా గెలుస్తారని ఆయన స్పష్టం చేశారు. ‘‘సాంసద్ ఖేల్ మహాకుంభ్ క్రీడల కు సంబంధించినంతవరకు భవిష్యత్తు లో ఒక వైభవోపేతమైనటువంటి మౌలిక సదుపాయాల కల్పన కు ఒక బలమైన పునాది ని వేస్తుంది’’ అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు.

గోరఖ్ పుర్ లో ప్రాంతీయ క్రీడా మైదానం గురించి న ఉదాహరణ ను ప్రధాన మంత్రి ప్రస్తావించి, చిన్న చిన్న పట్టణాల లో స్థానికం గా క్రీడా సదుపాయాల ను అభివృద్ధి పరచడం లో ప్రభుత్వం యొక్క ప్రయాసల ను గురించి నొక్కిచెప్పారు. గోరఖ్ పుర్ లోని గ్రామీణ ప్రాంతాల లో యువత కై 100 కు పైగా ఆట మైదానాల ను ఏర్పాటు చేయడమైందని, చౌరీ చౌరా లో ఒక మినీ స్టేడియమ్ ను కూడా నిర్మించడం జరుగుతోందని ఆయన తెలియ జేశారు. ‘‘ప్రస్తుతం దేశం ఒక సంపూర్ణమైనటువంటి దార్శనికత తో ముందుకు సాగిపోతోంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ఇతర క్రీడా సంబంధి సదుపాయాల కు అదనం గా ఆటగాళ్ళ కు ఖేలో ఇండియా మూవ్ మెంట్ లో భాగం గా శిక్షణ ను ఇవ్వడం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతోంది అని ఆయన చెప్పారు.

ఈ సంవత్సరం బడ్జెటు ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించి, క్రీడల మంత్రిత్వ శాఖ కు బడ్జెటు కేటాయింపు 2014 వ సంవత్సరం తో పోలిస్తే దాదాపు గా 3 రెట్లు అధికం గా ఉంది అని వెల్లడించారు. దేశం లో అనేక ఆధునిక స్టేడియమ్ లను నిర్మించడం జరుగుతోంది అని ఆయన చెప్పారు. టార్గెట్ ఒలింపిక్ పోడియమ్ స్కీమ్ (టిఒపిఎస్) లో భాగం గా క్రీడాకారుల కు శిక్షణ నిమిత్తం లక్షల కొద్దీ రూపాయల విలువైన సహాయాన్ని అందించడం జరుగుతోంది అని ఆయన ప్రముఖం గా ప్రకటించారు. ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా మరియు యోగ వంటి ప్రచార ఉద్యమాల ను గురించి కూడా ఆయన తన ప్రసంగం లో ప్రస్తావించారు. చిరుధాన్యాల కు శ్రీ అన్నఅనే గుర్తింపు ను దేశం కట్టబెట్టింది అని ప్రధాన మంత్రి వివరిస్తూ, జొన్న, సజ్జ వంటి ముతక ధాన్యాలు సూపర్ ఫూడ్స్ శ్రేణి కి చెందుతాయి అన్నారు. ఈ ప్రచార ఉద్యమాల లో యువతీయువకులు భాగం పంచుకొని, దేశం యొక్క ఈ మిశన్ కు నాయకత్వం వహించాలి అంటూ ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు.

ప్రధాన మంత్రి తన ప్రసంగం ముగింపు లో, ‘‘ఈ రోజు న, ఒలింపిక్స్ మొదలుకొని ఇతర పెద్ద ఆట ల పోటీల లో మీ వంటి యువ ఆటగాళ్ళు మాత్రమే పతకాల ను గెలుచుకొనే వారసత్వాన్ని ముందుకు తీసుకు పోతారు.’’ అని పేర్కొన్నారు. యువత ఉజ్వలం గా ప్రకాశిస్తూ, వారి సాఫల్యాల తాలూకు ప్రభ తో దేశాని కి కీర్తి ప్రతిష్టల ను సాధించి పెడుతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమం లో పాల్గొన్న వారి లో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ మరియు గోరఖ్ పుర్ పార్లమెంట్ సభ్యుడు శ్రీ రవి కిశన్ శుక్లా తదితరులు ఉన్నారు.

***

DS/TS

 

 



(Release ID: 1899921) Visitor Counter : 179