ప్రధాన మంత్రి కార్యాలయం

అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ ఆర్ బైడెన్ తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ టెలిఫోన్ సంభాషణ


అన్ని రంగాల్లోనూ అద్భుత వృద్ధికి దోహదపడిన భారత, అమెరికా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం పట్ల ప్రధానమంత్రి సంతృప్తి

ఉభయ దేశాల్లోనూ కొత్త ఉపాధి అవకాశాలు సృష్టించనున్న ఎయిరిండియా, బోయింగ్ మధ్య చారిత్రక ఒప్పందాన్ని ఆహ్వానించిన నేతలు; పరస్పర లాభదాయకమైన భాగస్వామ్యానికి ఇది ఉదాహరణ అని ప్రశంస

భారత పౌర విమానయాన రంగంలో పెరిగిన అవకాశాలు ఉపయోగించుకునేందుకు ముందుకు రావాలని బోయింగ్, ఇతర అమెరికా కంపెనీలకు ప్రధానమంత్రి ఆహ్వానం

వాషింగ్టన్ డిసిలో ఇటీవల జరిగిన ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ (ఐసెట్) తొలి సమావేశాన్ని ఆహ్వానించిన నేతలు; అంతరిక్షం, రక్షణ, ఇతర రంగాల్లో ద్వైపాక్షిక సహకారం పటిష్టత పట్ల ఆసక్తి వ్యక్తీకరణ

ఉభయ దేశాల ప్రజల మధ్య పరస్పర లాభదాయకం, చైతన్యవంతమైన బంధాన్ని బలోపేతం చేసేందుకు నేతల అంగీకారం

భారత జి-20 అధ్యక్షతను విజయవంతం చేయడానికి ఉభయ దేశాల మధ్య సంప్రదింపులు కొనసాగించాలని అంగీకారం

Posted On: 14 FEB 2023 9:50PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ ఆర్ బైడెన్ తో ఫోన్ లో సుహృద్భావఉత్పాదక సంభాషణ జరిపారు

భారతఅమెరికా మధ్య నెలకొన్న సమగ్ర ప్రపంచ స్థాయి వ్యూహాత్మక భాగస్వామ్యం కారణంగా విభిన్న రంగాల్లో మంచి వృద్ధి ఏర్పడడం  పట్ల ప్రధానమంత్రి శ్రీ మోదీఅధ్యక్షుడు బైడెన్ సంతృప్తి ప్రకటించారు.  ఎయిరిండియాబోయింగ్ మధ్య కుదిరిన చారిత్రక ఒప్పందాన్ని వారు ఆహ్వానించారుపరస్పర లాభదాయకమైన భాగస్వామ్యానికి ఇది చక్కని ఉదాహరణ అని వారు ప్రశంసించారుదీని వల్ల ఉభయ దేశాల్లోనూ ఉపాధి అవకాశాలు మెరుగు పడనున్నాయి.  భారత పౌర విమానయాన రంగంలో పెరుగుతున్న అవకాశాలు ఉపయోగించుకునేందుకు ముందుకు రావాలని బోయింగ్ఇతర అమెరికా కంపెనీలను ప్రధానమంత్రి ఆహ్వానించారు.

ఇటీవల వాషింగ్టన్ డిసిలో జరిగిన ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ (ఐసెట్తొలి సమావేశాన్ని ఉభయ నేతలు  ఆహ్వానించారుఅంతరిక్షంసెమీ-కండక్టర్లురక్షణసరఫరా వ్యవస్థలురక్షణ ఉత్పత్తుల ఉమ్మడి ఉత్పత్తిఅభివృద్ధిమేథో రంగంఇన్నోవేషన్ఇతర రంగాల్లో ద్వైపాక్షిక సహకారం శక్తివంతం చేసుకోవాలన్న ఆకాంక్ష వారు ప్రకటించారుఉభయ దేశాల మధ్య పరస్పర లాభదాయకమైన ప్రజా సంబంధాలను  మరింత ఉత్తేజితం చేయాలని వారు అంగీకారానికి వచ్చారు.  

 

భారత జి-20 అధ్యక్షతను విజయవంతం చేయడానికి ఉభయ దేశాల మధ్య సంప్రదింపులు కొనసాగించాలని ఇద్దరూ అంగీకరించారు       
***


(Release ID: 1899706) Visitor Counter : 117