ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బెంగళూరులో ఎయిరో ఇండియా 2023, 14వ ఎడిషన్‌ను ప్రారంభించిన ప్రధానమంత్రి


తపాలాబిళ్లను విడుదల చేసిన ప్రధానమంత్రి

‘‘ బెంగళూరు ఆకాశం నవభారత సామర్ధ్యానికి చిహ్నంగా నిలుస్తోంది. ఈ సమున్నతస్థాయి నవభారత వాస్తవం’’

‘‘దేశాన్ని బలోపేతం చేసేందుకు కర్ణాటక యువత తమ సాంకేతిక నైపుణ్యానికి రక్షణరంగంలో వినియోగించాలి’’

‘‘దేశం నూతన ఆలోచనలతో, నూతన మార్గంలో ముందుకు కదిలితే, నూతన ఆలోచనలకు అనుగుణంగా వ్యవస్థకూడా ముందుకు కదులుతుంది’’

‘‘ ఇవాళ, ఎయిరో ఇండియా అనేది కేవలం షోకాదు, ఇది దేశ రక్షణ పరిశ్రమ పరిధిని తెలియజెప్పడంతోపాటు ఇండియా ఆత్మవిశ్వాసాన్ని తెలియజేస్తోంది’’

‘‘ 21 వ శతాబ్దపు నవ భారతం, ఏ అవకాశాన్నీ జారవిడుచుకోదు. లేదా కృషిలో వెనుకపడదు’’

‘‘ ప్రపంచంలో అతిపెద్ద రక్షణ తయారీ దేశాల సరసన చేరేందుకు భారీ ముందడుగు వేస్తోంది. ఇందులో మన ప్రైవేటు రంగం, ఇన్వెస్టర్లు కీలక పాత్ర పోషించనున్నారు’’

‘‘నేటి ఇండియా వేగంగా ఆలోచిస్తుంది.దూరదృష్టితో ఆలోచిస్తుంది. సత్వర నిర్ణయాలు తీసుకుంటుంది.’’

‘‘ఎయిరో ఇండియా గర్జన భారతదేశపు సందేశమైన రిఫార్మ్‌, పెర్ఫార్మ్‌, ట్రాన్స్‌ఫార్మ్‌ను చెవులు చిల్లులు పడేలా వినిపిస్తోంది’’

Posted On: 13 FEB 2023 10:45AM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈరోజు బెంగళూరులోని యహలంకలోని ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో ఎయిరో ఇండియా 2023, 14 వ ఎడిషన్‌ ను ప్రారంభించారు. ఎయిరో ఇండియా 2023 థీమ్‌, ‘‘ ది రన్‌ వే టు ఎ బిలియన్‌ ఆపర్చునిటీస్‌’’. ఈ ఎయిరో ఇండియా ప్రదర్శనలో సుమారు 80 కి పైగా దేశాలు , 800 డిఫెన్స్‌ కంపెనీలు, ఇందులో 100 విదేశీ 700 స్వదేశీ కంపెనీలు పాల్గొంటున్నాయి. ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోదీ దార్శనికత అయిన మేక్‌ ఇన్‌ ఇండియా, మేక్‌ ఫర్‌ ది వరల్డ్‌ కు అనుగుణంగా, ఈ ఈవెంట్‌,దేశీయ సాంకేతిక పరికరాలు, సాంకేతికత, విదేశీ భాగస్వామ్యం, విదేవీ కంపెనీలపై దృష్టిపెడుతుంది.
ఈసందర్భంగా జరిగిన కార్యక్రమానికి విచ్చేసిన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రధానమంత్రి, నవ భారత దేశ సామర్ధ్యానికి బెంగళూరు ఆకాశం ఒక గుర్తుగా నిలుస్తోందని అన్నారు. ‘‘ ఆకాశం అంత ఎత్తుకు అందుకున్న ఈ విజయం నవభారత వాస్తవమని , ఇవాళ ఇండియా ఆకాశమంత  విజయాన్ని సాధిస్తోందని, ఇంకా పైపైకి దూసుకుపోతున్నదని చెప్పారు.

ఇండియా సామర్ధ్యం పెరుగుదలకు ఎయిరో ఇండియా 2023 ఒక గొప్ప ఉదాహరణ అని ప్రధానమంత్రి అన్నారు. వంద దేశాలు ఈ ఈవెంట్‌లో పాల్గొంటున్నాయంటే, ప్రపంచదేశాలకు ఇండియాపై గల విశ్వాసానికి ఇది నిదర్శనమని ఆయన అన్నారు.  భారతదేశ ఎం.ఎస్‌.ఎం.ఇలు , స్టార్టప్‌ లతో పాటు 700 మంది ఎగ్జిబిటర్లు,ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలకు చెందిన వారు ఈ షోలో పాల్గొంటున్నారన్నారు. ఎయిరో ఇండియా థీమ్‌ అయిన , బిలియన్‌ అవకాశాలకు రన్‌ వే అంశంపై ప్రముఖంగా దృష్టిపెడుతూ, ప్రధానమంత్రి, రోజురోజుకూ ఆత్మనిర్భర్‌ భారత్‌ బలం పుంజుకుంటున్నదని అన్నారు.

రక్షణ మంత్రుల సదస్సు గురించి ప్రస్తావిస్తూ, సిఇఒ రౌండ్‌ టేబుల్‌ను ఈ సదస్సు సందర్భంగా ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ రంగంలో క్రియాశీలంగా పాల్గొనడం ద్వారా ఎయిరో ఇండియా సామర్ధ్యం పెరగుతుందని ప్రధానమంత్రి అన్నారు.
కర్ణాటకలో జరుగుతున్న ఎయిరో ఇండియా ప్రాధాన్యత గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, కర్ణాటక , బారతదేశపు సాంకేతిక పురోగతికి హబ్‌గా ఉందని అన్నారు. ఇది కర్ణాటక యువతకు ఏవియేషన్‌ రంగంలో నూతన అవకాశాలను అందిస్తుందని ఆయన అన్నారు. రక్షణ రంగంలో తమ సాంకేతిక నైపుణ్యాలను దేశ రక్షణ రంగం బలోపేతానికి వినియోగించాల్సిందిగా ప్రధానమంత్రి కర్ణాటక యువతకు పిలుపునిచ్చారు.

‘‘ దేశం నూతన ఆలోచనలతో ముందుకు కదులుతుంటే,నూతన దృక్పథంతో ముందుకు పోతుంటే, ఈ నూతన ఆలోచనలకు అనుగుణంగా వ్యవస్థకూడా మారడం ప్రారంభిస్తుందని ’’ ప్రధానమంత్రి అన్నారు. ఒకప్పుడు ఎయిరో ఇండియా ఒక షో మాత్రమేనని, ఇండియాకు అమ్మకాలకు సంబంధించినదిగా ఉండేదని , అయితే ఇప్పుడు ఈ ఆలోచనా ధోరణి మారిందని అన్నారు. ‘‘ఇవాళ ఎయిరో ఇండియా అంటే ఇండియా బలం, ఇది కేవలం ఒక షో ఎంతమాత్రం కాదు.’’ అని ప్రధానమంత్రి అన్నారు. ఇది రక్షణ రంగ అవకాశాలను ప్రదర్శించేదే కాకుండా, దేశ ఆత్మ విశ్వాసాన్ని తెలియజేస్తుందని ప్రధానమంత్రి చెప్పారు.

ఇండియా విజయాలు, దాని సామర్ధ్యాలకు నిదర్శనమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. తేజస్‌, ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌,ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌, సూరత్‌, తుముకూరు లోని అధునాతన తయారీ సదుపాయాలు, ఆత్మనిర్భర్‌ భారత్‌ సామర్ధ్యాలకు నిదర్శనమని ఆయన అన్నారు. వీటితో ప్రపంచ నూతన ప్రత్యామ్నాయాలు, అవకాశాలను అనుసంధానించడం జరిగిందన్నారు.
‘‘ 21 వ శతాబ్దపు నవభారతదేశం, ఏ అవకాశాన్నీ జార విడుచుకోదని, లేదా కృషిచేయకుండా ఉండదని’’ అన్నారు.ప్రతి రంగంలోనూ సంస్కరణల సాయంతో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చినట్టు చెప్పారు.దేశం ఇప్పుడు ప్రపంచంలోని 75 దేశాలకు రక్షణ పరికరాలను ఎగుమతి చేస్తున్నదని అన్నారు.గడచిన 8 `9 సంవత్సరాలలో రక్షణరంగంలో వచ్చిన పరివర్తన గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, రక్షణరంగ ఎగుమతులను 2024`25 నాటికి  1.5 బిలియన్‌ల నుంచి 5 బిలియన్లకు తీసుకుపోవాలన్నది తమ లక్ష్యమన్నారు.  ‘‘ ఇక్కడి  నుంచి ఇండియా అద్భుతంగా ముందుకు వెళుతున్నదని, ప్రపంచంలోని పెద్ద రక్షణ తయారీదారుల సరసన చేరుతున్నదని, మన ప్రైవేటు రంగం, ఇన్వెస్టర్లు ఇందులో కీలక పాత్ర పోషించనున్నారని ’’ అన్నారు. రక్షణ రంగంలో పెట్టుబడులు పెట్టవలసిందిగా ప్రధానమంత్రి ప్రైవేటు రంగానికి పిలుపునిచ్చారు.ఇది వారికి ఇండియాలో ఇతర దేశాలలో మంచి అవకాశాలను తెచ్చిపెడుతుందన్నారు. 

‘‘ ప్రస్తుత భారతదేశం వేగంగా ఆలోచిస్తుందని, దూరదృష్టితో ఆలోచిస్తుందని, సత్వర నిర్ణయాలు తీసుకుంటుందని’’ ప్రధానమంత్రి అన్నారు. అమృత్‌ కాల్‌ లో భారతదేశాన్ని ఫైటర్‌ జెట్‌ పైలట్‌తో ప్రధానమంత్రి పోల్చారు. ఇండియా దేనికీ భయపడదు. ఉన్నత స్థాయికి చేరుకునేందుకు ఉత్సాహంతో పైపైకి వెళుతుంది అని ప్రధానమంత్రి అన్నారు. అలాగే ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలు బలంగా ఉండే లక్షణం ఇండియా సొంతమని ప్రధానమంత్రి చెప్పారు.

ఎయిరో ఇండియా గర్జన, ఇండియా సందేశమైన రిఫార్మ్‌, పెర్ఫార్మ్‌ , ట్రాన్స్‌ఫార్మ్‌ను ప్రతిధ్వనింప చేస్తున్నదని ప్రధానమంత్రి అన్నారు. ఇండియాలో  సులభతర వ్యాపారానికి సంబంధించి చేపట్టిన సంస్కరణలను ప్రపంచం మొత్తం గమనిస్తున్నదని ప్రధానమంత్రి చెప్పారు. ఇది అంతర్జాతీయ పెట్టుబడులకు సానుకూల వాతావరణాన్ని ఏర్పరచిందని, భారతీయ ఆవిష్కరణలకు దోహదపడిరదని అన్నారు. రక్షణ, ఇతర రంగాలలో విదేశీ సంస్థాగత పెట్టుబడుల విషయంలో తీసుకువచ్చిన సంస్కరణలను ప్రధానమంత్రి ప్రస్తావించారు. పరిశ్రమలకు లైసెన్సులు మంజూరు చేసే ప్రక్రియలను సులభతరం చేయడం, వాటి వాలిడిటీపెంపు వంటి వాటి గురించి ప్రధానమంత్రి తెలిపారు. ఈ సంవత్సరం బడ్జెట్‌ లో తయారీ యూనిట్లకు పన్ను రాయితీలు పెంచినట్టు చెప్పారు.

 నైపుణ్యాలు, అనుభవం వంటివి డిమాండ్‌ఉన్న చోట పరిశ్రమ ప్రగతికి దోహదపడడం సహజమేనని ప్రధానమంత్రి అన్నారు.  ఈ రంగాన్ని మరింత బలోపేతంచేయడానికి చర్యలను మరింత ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుందని ప్రధానమంత్రి అన్నారు.
కర్ణాటక గవర్నర్‌ శ్రీ తవర్‌చంద్‌ గెహ్లోత్‌, కర్ణాటక ముఖ్యమంత్రి  శ్రీ బసవరాజ్‌ బొమ్మయ్‌, రక్షణమంత్రి శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీజ్యోతిరాదిత్య సింధియా, కేంద్ర రక్షణ శాఖ సహాయమంత్రి  శ్రీ అజయ్‌ భట్‌ తదితరులు ఈకార్యక్రమానికి హాజరయ్యారు.

నేపథ్యం:
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు అయిన, ‘ మేక్‌ ఇన్‌ ఇండియా, మేక్‌ ఫర్‌ ద వరల్డ్‌ ’ కు అనుగుణంగా, ఈ ఈవెంట్‌ దేశీయ పరికరాలు, సాంకేతికతను ప్రదర్శించడంతోపాటు విదేశీ కంపెనీలతో  భాగస్వామ్యాన్ని పొందేందుకు వీలుకల్పిస్తుంది. భారత రక్షణ రంగంలో ఆత్మనిర్భర్‌ భారత్‌ పై ప్రధానమంత్రి ప్రత్యేక దృష్టికి అనుగుణంగా ఈ ప్రదర్శన ఉంటుంది. ఈ ఈవెంట్‌లో డిజైన్‌ లీడర్‌షిప్‌, యుఎవి రంగంలో ప్రగతి, రక్షణ రంగానికి సంబంధించి గగనతల, భవిష్యత్‌ సాంకేతికతలు ప్రదర్శించడం జరుగుతుంది. ఈ ఈవెంట్‌ దేశీయ ఎయిర్‌ ప్లాట్‌ఫారంలు అయిన లైట్‌ కంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌, (ఎల్‌సిఎ), తేజన్‌, హెచ్‌టిటి`40,డార్నియర్‌ లైట్‌ యుటిలిటి హెలికాప్టర్‌ (ఎల్‌ ఎల్‌. హెచ్‌),లైట్‌ కంబాట్‌ హెలికాప్టర్‌ (ఎల్‌ సి  హెచ్‌), అడ్వాన్స్‌డ్‌ లైట్‌ హెలికాప్టర్‌ (ఎ.ఎల్‌.హెచ్‌) వంటి వాటిని ప్రమోట్‌ చేస్తుంది. ఈ ఈవెంట్‌ దేశీయ ఎం.ఎస్‌.ఎం.ఇలు , స్టార్టప్‌లను అంతర్జాతీయ సప్లయ్‌ చెయిన్‌తో సమ్మిళితం చేసేందుకు ఉపకరిస్తుంది. అలాగే విదేశీ పెట్టుబడులను పెద్దఎత్తున ఆకర్షించేందుకు, భాగస్వామ్యాలను స్వాగతించేందుకు, సహ అభివృద్ధి, సహ ఉత్పత్తి కి వీలుకలిగిస్తుంది.

ఎయిరో ఇండియా 2023 లో 80కి పైగా దేశాలు పాల్గొంటున్నాయి. 30 దేశాలకు చెందిన మంత్రులు,  65 దేశాలకు చెందిన అంతర్జాతీయ సిఇఒలు, భారతీయ ఒఇఎం లు 2023 ఎయిరో ఇండియాలో పాల్గొననున్నారు.
ఎయిరో ఇండియా 2023 ఎగ్జిబిషన్‌,లో 800కు పైగా డిఫెన్స్‌ కంపెనీలు పాల్గొంటున్నాయి. ఇందులో 100 విదేశీ కంపెనీలు కాగా, 700 దేశీయ కంపెనీలు. ఈ ఎగ్జిబిషన్‌ లో పాల్గొంటున్న భారతీయ కంపెనీలలో ఎం.ఎస్‌.ఎం.ఇలు, స్టార్టప్‌ లు ఉన్నాయి. ఇవి తమ అద్భుత సాంకేతిక పరిజ్ఞానాన్ని, దేశంలో ఎయిరోస్సేస్‌, డిఫెన్స్‌ రంగంలో అద్భుత పురోగగిని కళ్లకు కట్టేలా ప్రదర్శించనున్నాయి. ఎయిరో ఇండియా 2023 ప్రధాన ఎగ్జిబిటర్లలో  ఎయిర్‌బస్‌,బోయింగ్‌, దసౌల్ట్‌ ఏవియేషన్‌, లాక్‌హీడ్‌ మార్టిన్‌, ఇస్రాయిల్‌ ఎయిరోస్పేస్‌ ఇండస్ట్రీ, బ్రహ్మోస్‌ ఎయిరోస్పేస్‌, ఆర్మీ ఏవియేషన్‌, హెచ్‌.సి రోబోటిక్స్‌, ఎస్‌ ఎ ఎ బి, శాఫ్రాన్‌, రోల్స్‌ రాయిస్‌, లార్సన్‌ అండ్‌ టుబ్రో , భారత్‌ ఫోర్జ్‌ లిమిటెడ్‌, హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌( హెచ్‌ ఎ ఎల్‌).
భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బిఇఎల్‌), భారత డైనమిక్‌ లిమిటెడ్‌ (బిడిఎల్‌), బిఇఎంఎల్‌ లిమిటెడ్‌ లు ఉన్నాయి.

 


(Release ID: 1898950) Visitor Counter : 235