ప్రధాన మంత్రి కార్యాలయం
రాష్ట్రపతి ప్రసంగాని కి ధన్యవాదాలు తెలిపే తీర్మానాని కి ప్రధాన మంత్రి లోక్ సభ లో ఇచ్చిన సమాధానం
“రాష్ట్రపతిరెండు సభల ను ఉద్దేశించి ఇచ్చిన తన దూరదర్శియుక్త ప్రసంగం తో దేశ ప్రజల కు సరిఅయినటువంటి దిశ ను చూపారు”
“ప్రస్తుతంయావత్తు ప్రపంచం లో భారతదేశం పట్ల సకారాత్మకత మరియు ఆశ నెలకొన్నాయి’’
“ప్రస్తుతంయావత్తు ప్రపంచం లో భారతదేశం పట్ల సకారాత్మకత మరియు ఆశ నెలకొన్నాయి’’
“ప్రస్తుతంసంస్కరణల ను తప్పనిసరై అనే పద్ధతి లో కాకుండాదృఢ విశ్వాసం తోటి అమలుపరచడం జరుగుతున్నది”
"యుపిఎహయాం లో భారతదేశాన్ని “కోల్పోయినటువంటి దశాబ్దం” అని అనేవారు; కాగా ప్రస్తుతం ప్రజలు వర్తమాన దశాబ్దాన్ని ‘భారతదేశంయొక్క దశాబ్దం’ అని అంటున్నారు “
“భారతదేశం ప్రజాస్వామ్యాని కి తల్లి గాఉన్నది; బలమైన ప్రజాస్వామ్యం ఏర్పడాలంటే నిర్మాణాత్మక విమర్శ అవసరం; విమర్శించడంఅనేది ‘శుద్ధి యజ్ఞం’ వంటిది’’
“నిర్మాణాత్మకమైన విమర్శలను చేసేందుకుబదులు కొంత మంది తప్పనిసరి అయ్యి విమర్శిస్తున్నారు”
“140 కోట్ల మంది భారతీయుల ఆశీస్సులు నాకు ‘సురక్షకవచం’ గా ఉన్నాయి’’
“మా ప్రభుత్వం మధ్య తరగతి యొక్క ఆకాంక్షలను నెరవేర్చింది; మేం వారి నిజాయతీ కి గాను వారిని సత్కరించాం”
భారతీయ సమాజం లో నకారాత్మకత ను ఎదుర్కొనేటటువంటిసామర్థ్యం ఉన్నది; అయితే అది ఈ నకారాత్మకత ను ఎన్నటికీ స్వీకరించబోదు’’
Posted On:
08 FEB 2023 5:40PM by PIB Hyderabad
రాష్ట్రపతి గారి ప్రసంగాని కి ధన్యవాదాల ను వ్యక్తం చేసే తీర్మానాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ లోక్ సభ లో ఈ రోజు న సమాధానాన్ని ఇచ్చారు.
ఆదరణీయ రాష్ట్రపతి గారు రెండు సభల లోను తన దూరదర్శి యుక్తం అయినటువంటి ప్రసంగం తో దేశ ప్రజల కు సరి అయినటువంటి దిశ ను చూపారు అని ప్రధాన మంత్రి అన్నారు. గౌరవనీయురాలు అయిన రాష్ట్రపతి గారి యొక్క ప్రసంగం భారతదేశం లోని ‘నారీశక్తి’ కి ప్రేరణ ను అందించిందని, మరి భారతదేశం లోని ఆదివాసి సముదాయాలలో గర్వం వంటి భావన ను కలుగజేస్తూ వారి యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసిందన్నారు. ఆమె ‘సంకల్ప్ సే సిద్ధి’ తాలూకు విస్తృత మైనటువంటి నమూనా ను ఆవిష్కరించారు అని ప్రధాన మంత్రి అన్నారు.
విధ విధాలైనటువంటి సవాళ్ళు ఎదురు కావచ్చు, కాని 140 కోట్ల మంది భారతీయుల యొక్క దృఢసంకల్పం తో దేశం తన దారి లో వచ్చేటటువంటి అన్ని బాధల ను దాటుకొని ముందుకు సాగిపోగలుగుతుందని ప్రధాన మంత్రి అన్నారు. వందేళ్ల లో ఒకసారి వచ్చేటటువంటి ఆపద ను మరియు యుద్ధ కాలం లో దేశం సరి అయిన రీతి లో సంబాళించుకోగలిగినందున భారతదేశం లో ప్రతి ఒక్కరి లో ఆత్మవిశ్వాసం ఇనుమడించింది అని ఆయన అన్నారు. భారీ ఒడుదొడుకుల మయం అయిన ఈ కాలం లోనూ భారతదేశం ప్రపంచం లోని అయిదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ గా ఎదిగింది అని ఆయన అన్నారు.
ప్రస్తుతం యావత్తు ప్రపంచం లో భారతదేశం పట్ల సానుకూల భావన మరియు ఆశావహ దృక్పథం నెలకొన్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ విధమైనటువంటి సకారాత్మక ధోరణి తాలూకు ఖ్యాతి అనేది స్థిరత్వానికి, అంతర్జాతీయం గా భారతదేశాని కి ఉన్న స్థాయి కి, భారతదేశాని కి పెరుగుతూ ఉన్నటువంటి సామర్థ్యానికి మరియు భారతదేశాని కి కొత్త గా లభిస్తున్నటువంటి అవకాశాల కు దక్కుతుంది అని ప్రధాన మంత్రి అన్నారు. దేశం లో ఏర్పడ్డ బరోసా ను గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ భారతదేశం లో స్థిరమైనటువంటి ప్రభుత్వం మరియు నిర్ణాయక ప్రభుత్వం ఉంది అని ఆయన అన్నారు. ప్రస్తుతం సంస్కరణల ను తప్పనిసరై అన్న భావం తో కాకుండా దృఢవిశ్వాసం తో అమలుపరచడం జరుగుతోంది అన్నారు. ప్రస్తుతం యావత్తు ప్రపంచం భారతదేశం యొక్క సమృద్ధి లో తన సమృద్ధి ని చూసుకొంటోంది అని ప్రధాన మంత్రి అన్నారు.
ప్రధాన మంత్రి 2014 వ సంవత్సరం కంటే పూర్వపు దశాబ్ద కాలాన్ని గుర్తు చేస్తూ, 2004 నుండి 2014 వ సంవత్సరం మధ్య గల కాలం కుంభకోణాల తో నిండిపోయి ఉండిందని, అంతేకాక దేశం లోని మూలమూలన ఉగ్రవాద దాడులు జరిగాయన్నారు. ఆ దశాబ్ది కాలం లో భారతదేశం ఆర్థిక వ్యవస్థ లో క్షీణత నమోదైంది మరి అంతర్జాతీయ వేదికల లో భారతదేశం యొక్క స్వరం చాలా బలహీనమైపోయింది. ఆ కాలం ‘మౌకే మేఁ ముసీబత్’ (అందివచ్చిన అవకాశం లో ప్రతికూల స్థితి) వంటిది అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
దేశం ఇవాళ ఆత్మవిశ్వాసం తో నిండివుందని, తన కలల ను మరియు సంకల్పాల ను సాకారం చేసుకొంటోందని ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు. యావత్ ప్రపంచం ఇప్పుడు ఆశ నిండిన చూపుల తో భారతదేశం వైపు చూస్తోందని, దీని తాలూకు ఖ్యాతి అంతా కూడాను భారతదేశం యొక్క స్థిరత్వం మరియు అవకాశాల దే అని ఆయన అన్నారు. యుపిఎ హయాం లో భారతదేశాన్ని “కోల్పోయిన దశాబ్దం” అని అనే వారు, అదే ఇప్పుడు ప్రజలు వర్తమాన దశాబ్దాన్ని ‘భారతదేశం యొక్క దశాబ్దం’ అని అంటున్నారు అని ప్రధాన మంత్రి చెప్పారు.
భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి లాంటిది అని ప్రధాన మంత్రి అభివర్ణిస్తూ, ఒక బలమైనటువంటి ప్రజాస్వామ్యం ఏర్పడాలి అంటే నిర్మాణాత్మకమైన విమర్శ చాలా ముఖ్యం అని ప్రధాన మంత్రి అన్నారు. విమర్శ అనేది ఒక ‘శుద్ధి యజ్ఞం’ వంటిది అని ఆయన చెప్పారు. నిర్మాణాత్మకమైనటువంటి విమర్శలు చేయడానికి బదులు కొంత మంది తప్పనిసరై విమర్శల కు దిగడం విచారకరం అని ప్రధాన మంత్రి అన్నారు. గడచిన 9 సంవత్సరాల లో మనం అనివార్య విమర్శకుల ను చూశాం, వారు నిర్మాణాత్మకమైనటువంటి విమర్శలు చేసే కంటే నిరూపించజాలనటువంటి ఆరోపణలు చేశారని ఆయన అన్నారు. ఆ తరహా విమర్శలు మొట్టమొదటి సారి గా కనీస సౌకర్యాల ను అపేక్షిస్తున్న ప్రజల వద్ద సాగవు అని ప్రధాన మంత్రి అన్నారు. వంశం కంటే తాను 140 కోట్ల మంది భారతీయ కుటుంబం లో సభ్యుడి గా ఉన్నానని ఆయన చెప్పారు. 140 కోట్ల మంది భారతీయుల ఆశీర్వాదాలు నాకు సురక్ష కవచం గా ఉన్నాయి అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు.
వంచన కు గురైన వర్గాలు మరియు ఆదరణ కు నోచుకోకుండా మిగిలిపోయినటువంటి వర్గాల వారి విషయం లో వచనబద్ధత ను ప్రధాన మంత్రి పునరుద్ఘాటిస్తూ, ప్రభుత్వ పథకం యొక్క అతి పెద్ద ప్రయోజనం దళితులకు, ఆదివాసులు, మహిళలు మరియు బలహీనమైన వర్గాల కు దక్కింది అని స్పష్టం చేశారు. భారతదేశం యొక్క నారీ శక్తి ని గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, భారతదేశం లో నారీ శక్తి ని బలపరచడం కోసం సకల ప్రయాసలు జరుగుతున్నాయని తెలియ జేశారు. ప్రభుత్వం నారీ శక్తిని పెంపొందించటానికి కృషి చేస్తున్న దన్నారు. భారతదేశం లో మాతృమూర్తుల ను బలపరచడం జరిగిందా అంటే గనక ప్రజలు బలోపేతం అవుతారు, ఎప్పుడైతే ప్రజలు బలోపేతం అవుతారో అది సమాజాన్ని పటిష్టపరుస్తుంది, దీనితో మొత్తం దేశం పటిష్టం అవుతుంది అని ఆయన చెప్పారు. ప్రభుత్వం మధ్య తరగతి ఆకాంక్షల ను పట్టించుకొంది మరి వారి యొక్క నిజాయతీ ని సమ్మానించింది అని కూడా ఆయన అన్నారు. భారతదేశం లో సామాన్య పౌరులు సకారాత్మక భావన తో నిండివున్నారు అని ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రకటిస్తూ, భారతీయ సమాజం నకారాత్మకత ను భరించగలదు, దానిని స్వీకరించబోదని ప్రధాన మంత్రి స్పష్టంచేశారు.
***
DS/TS
(Release ID: 1897592)
Visitor Counter : 223
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam