ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భూకంపంకారణం గా తుర్కీ లో ప్రాణనష్టం వాటిల్లినందుకు సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధానమంత్రి 

प्रविष्टि तिथि: 06 FEB 2023 12:00PM by PIB Hyderabad

భూకంపం కారణం గా తుర్కీ లో మనుషుల ప్రాణాలకు మరియు సంపత్తి కి నష్టం వాటిల్లినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు.

తుర్కీ అధ్యక్షుడు చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానమిస్తూ,

‘‘భూకంపం వల్ల తుర్కీ లో ప్రాణనష్టం మరియు సంపత్తి నష్టం జరిగిందని తెలిసి బాధ పడ్డాను. ప్రియతముల ను కోల్పోయిన కుటుంబాల కు ఇదే సంతాపం. ఈ ఘటన లో గాయపడ్డ వ్యక్తులు త్వరలో పునఃస్వస్థులు అవ్వాలని కోరుకొంటున్నాను. తుర్కీ ప్రజల వెన్నంటి భారతదేశం నిలబడుతున్నది అంతేకాక ఈ విషాదానికి ఎదురొడ్డడం కోసం సాధ్యమైనైన అన్ని విధాలు గాను సహాయాన్ని అందించడానికి సిద్ధం గా ఉంది.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

***

DS/SH


(रिलीज़ आईडी: 1896552) आगंतुक पटल : 240
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam