ఆర్థిక మంత్రిత్వ శాఖ

బ్యాంక్ ఖాతాదారుల భద్రత మెరుగుపరిచేలా చట్టాలలో సవరణలు


- బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, బ్యాంకింగ్ కంపెనీల చట్టం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం బ్యాంకు పాలనను మెరుగుపరచడానికి ఆయా చట్టాలకు సవరణల ప్రతిపాదనలు

- క్లెయిమ్ చేయని షేర్లు మరియు చెల్లించని డివిడెండ్‌లను సులభంగా రిక్లెయిమ్ చేయడానికి పెట్టుబడిదారుల కోసం ఒక సమీకృత ఐటీ పోర్టల్ స్థాపించబడాలని ప్రతిపాదించబడింది

- 2023-24లో కొనసాగించడానికి డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం ఆర్థిక మద్దతు

- మహిళలు లేదా బాలికల పేరు మీద రూ. 2 లక్షల వరకు డిపాజిట్ సౌకర్యంతో

మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకం ప్రకటన

- సీనియర్ సిటిజన్ సేవింగ్స్ పథకం కోసం గరిష్ట డిపాజిట్ పరిమితి రూ. 15 లక్షల నుండి రూ. 30 లక్షలకు పెంపు

- నెలవారీ ఆదాయ ఖాతా పథకం గరిష్ట డిపాజిట్ పరిమితి పెంపు

Posted On: 01 FEB 2023 1:09PM by PIB Hyderabad

ఆర్థిక రంగంలో స్థిరమైన సంస్కరణలు మరియు సాంకేతికతను వినూత్నంగా ఉపయోగించడం మూలంగా భారతదేశంలో ఆర్థిక మార్కెట్లు బలపడ్డాయి. కేంద్ర బడ్జెట్ 2023-24 ఆర్థిక రంగాన్ని మరింతగా పటిష్టం చేయాలని ప్రతిపాదించింది. ఈ రోజు పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్, 2023-24 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ  సందర్భంగా  మంత్రి మాట్లాడుతూ “అమృత్ కాలంలో మా ప్రభుత్వ దృష్టి సాంకేతికతతో నడిచే మరియు విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థ,  బలమైన ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థలు మరియు బలమైన ఆర్థిక రంగం ఉన్నాయి."

బ్యాంకింగ్ రంగంలో పాలన మరియు ఖాతాదారుల భద్రతను మెరుగుపరచడం

బ్యాంకింగ్ వ్యవస్థలో పాలన మెరుగుపరచడానికి మరియు ఖాతాదారులకు రక్షణను పెంపొందించడానికి, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, బ్యాంకింగ్ కంపెనీల చట్టం మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టంలో కొన్ని సవరణలు ప్రతిపాదించబడ్డాయని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.

 

సెంట్రల్ డేటా ప్రాసెసింగ్ సెంటర్..

"కంపెనీల చట్టం కింద క్షేత్ర స్థాయి కార్యాలయాలలో దాఖలు చేసిన వివిధ ఫారమ్‌లను కేంద్రీకృతంగా నిర్వహించడం ద్వారా కంపెనీలకు వేగవంతమైన ప్రతిస్పందన అందించడానికి వీలుగా సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించబడింది" అని ఆర్థిక మంత్రి  వెల్లడించారు.

షేర్లు మరియు డివిడెండ్లను తిరిగి పొందడం

పెట్టుబడిదారులు ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ నుండి క్లెయిమ్ చేయని షేర్లు మరియు చెల్లించని డివిడెండ్‌లను సులభంగా తిరిగి పొందేందుకు, ఇంటిగ్రేటెడ్ ఐటి పోర్టల్‌ను స్థాపించాలని ప్రతిపాదించామని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.

 

డిజిటల్ చెల్లింపులు

డిజిటల్ చెల్లింపులు ఆర్థిక వ్యవస్థలోని రంగాలు, అలాగే సమాజంలోని విభాగాల్లో విస్తృత ఆమోదాన్ని పొందుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి ఆర్థిక మంత్రి గత సంవత్సరానికి సంబంధించిన డేటాను పంచుకుంటూ, “2022 లో వారు లావాదేవీలలో 76 శాతం మరియు విలువలో 91 శాతం పెరుగుదలను కనబరిచారు అని అన్నారు. ఈ డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు ఆర్థిక మద్దతు 2023-24లోనూ కొనసాగుతుంది అని అన్నారు.

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ మహిళా సమ్మాన్ బచత్ పత్ర

మహిళల ఆర్థిక సాధికారత అనేది బడ్జెట్‌లో ఒక ముఖ్యమైన అంశం. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను పురస్కరించుకుని, ఈ ఏడాది కొత్తగా చిన్న మొత్తాల పొదుపు పథకం ‘మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్’ రెండేండ్ల  కాలానికి అందుబాటులో ఉంచబడుతుందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. మార్చి 2025 వరకు ఇది పాక్షిక ఉపసంహరణ ఎంపికతో 7.5 శాతం స్థిర వడ్డీ రేటుతో 2 సంవత్సరాల కాల వ్యవధిలో మహిళలు లేదా బాలికల పేరిట రూ.2 లక్షల వరకు డిపాజిట్ సదుపాయాన్ని అందిస్తుంది అని తెలిపారు.

వయో వృద్ధులు

సీనియర్ సిటిజన్ల (వయో వృద్ధుల) సాధికారత విషయమై కేంద్ర ఆర్థిక మంత్రి మాట్లాడుతూ, “సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ గరిష్ట డిపాజిట్ పరిమితిని రూ. 15 లక్షల నుంచి రూ. 30 లక్షలకు. దీనికి తోడు నెలవారీ ఆదాయ ఖాతా పథకం కింద వ్యక్తిగత ఖాతా గరిష్ట డిపాజిట్ పరిమితిని రూ.4.5  లక్షల నుంచి రూ.9లక్షలు పెంచబడుతుంది. ఇదే సమయంలో జాయింట్ అకౌంట్ గరిష్ట డిపాజిట్ పరిమితిరూ. 9 లక్షల నుంచి రూ.15 లక్షలు పెంచబడుతుంది.’’  

డేటా రాయబార కార్యాలయం

డిజిటల్ కంటిన్యూటీ సొల్యూషన్స్ కోసం వెతుకుతున్న దేశాల కోసం, GIFT IFSCలో వారి డేటా ఎంబసీలను ఏర్పాటు చేయడం సులభతరం చేయబడుతుంది.

సెక్యూరిటీస్ మార్కెట్‌లో కెపాసిటీ బిల్డింగ్

సెక్యూరిటీస్ మార్కెట్‌లో కార్యనిర్వాహకులు మరియు నిపుణుల సామర్థ్యాన్ని మరింత పెంపొందించడానికి, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్స్‌లో విద్యకు సంబంధించిన నిబంధనలు మరియు ప్రమాణాలను అభివృద్ధి చేయడానికి, నియంత్రించడానికి, నిర్వహించడానికి మరియు అమలు చేయడానికి సెబీకి అధికారం ఉండేలా బడ్జెట్ ప్రతిపాదిస్తోంది. ఇది డిగ్రీలు, డిప్లొమాలు మరియు సర్టిఫికేట్‌ల అవార్డును గుర్తించడానికి మరింత అధికారం కలిగి ఉంటుంది.

***(Release ID: 1895593) Visitor Counter : 277