ఆర్థిక మంత్రిత్వ శాఖ

కొత్తగా ఏర్పడనున్న 157 కొత్త నర్సింగ్‌ కాలేజీలు.


సికిల్‌సెల్‌ అనీమియా బాధిత గిరిజన ప్రాంతాలలో 7కోట్ల మందికి నిర్థారణ పరీక్షలు నిర్వహించడం ద్వారా,

సికిల్‌సెల్‌ అనీమియాని రూపుమాపే మిషన్‌ను ప్రారభించనున్న ప్రభుత్వం.

ప్రభుత్వ, ప్రైవేటు రంగం పరస్పర సమన్వయంతో పరిశోధన, ఆవిష్కరణలు ప్రోత్సహించేందుకు ఎంపికచేసిన ఐసిఎంఆర్‌ ప్రయోగశాలలలో సదుపాయాలను అందుబాటులో ఉంచేందుకు చర్యలు.

ఫార్మసూటికల్స్‌లో పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు కొత్త కార్యక్రమం ప్రకటన.
ప్రస్తుత సంస్థలలో వైద్యపరికరాలకు సంబంధించిన ప్రత్యేక మల్టిడిసిప్లినరీ కోర్సులకు మద్దతు

Posted On: 01 FEB 2023 1:31PM by PIB Hyderabad

సుసంపన్నమైన, సమ్హిలిత భారతదేశాన్ని తీర్చిదిద్దేందుకు వీలుగా , అలాగే అభివృద్ధి ఫలాలు అన్ని ప్రాంతాల వారికి, పౌరులకు ప్రత్యేకించి యువత, మహిళలు, రైతులు, ఒబిసిలు, షెడ్యూలు కులాలు, షెడ్యూలు తరగతుల వారికి అందే విధంగా కేంద్ర ఆర్థికమంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్‌ 2023`24 ఆర్థిక సంవత్సరానికి  కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటు ముందుంచారు.
 

కొత్త నర్సింగ్‌ కళాశాలలు:
ఇండియా `100 దార్శనికతకు అనుగుణంగా , అమృత్‌ కాల్‌లో దేశంలో 2014 నుంచి ఏర్పడిన 157 మెడికల్‌ కళాశాలల ప్రాంతాలలో 157 కొత్త కాలేజీలను ఏర్పాటు చేయనున్నారు.
సికిల్‌ సెల్‌ అనీమియా నిర్మూలన మిషన్‌ :

కేంద్ర ఆర్థికమంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్‌, తన బడ్జెట్‌ ప్రసంగంలో సికిల్‌సెల్‌ అనీమియా మిషన్‌ ను ప్రకటించారు. దీనిద్వారా దీనికి సంబంధించి ప్రజలలో అవగాహన కల్పిస్తారు. 0నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్కులలో ఈ వ్యాధి ప్రభావిత గిరిజన ప్రాంతాలలో స్క్రీనింగ్‌ పరీక్షలునిర్వహిస్తారు. వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖలు, రాష్ట్రప్రభుత్వాల సహకారంతో కౌన్సిలింగ్‌ ఏర్పాట్లు చేస్తారు.
పరిశోధనలకు అందుబాటులో ఐసిఎంఆర్‌ ప్రయోగశాలలు:
వైద్యరంగంలో పరిశోధనలను , ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఎంపికచేసిన ఐసిఎంఆర్‌ ప్రయోగశాలలను పబ్లిక్‌, ప్రైవేటు మెడికల్‌ కాలేజీల ఫాకల్టీలకు ,ప్రైవేటు రంగ పరిశోధన,అభివృద్ధి బృందాలకు అందుబాటులో ఉంచుతారు.

ఫార్మా రంగంలో పరిశోధన, ఆవిష్కరణలు
ఫార్మాసూటికల్‌ రంగంలో పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన కార్యక్రమాన్ని సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ లద్వారా చేపట్టడం జరుగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు. ‘‘మనం ప్రత్యేకించి ప్రాధాన్యతా రంగంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా మనం పరిశ్రమరంగాన్ని ప్రోత్సహించవలసిఉంది ’’అని ఆమె అన్నారు.

 

వైద్యపరికరాలకు సంబంధించి ప్రత్యేకించి మల్టీడిసిప్లినరీ కోర్సులు:
భవిష్యత్‌ దృష్టికలిగిన మెడికల్‌ టెక్నాలజీల అవసరాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ కేంద్ర ఆర్థికమంత్రి
శ్రీమతి నిర్మలా సీతారామన్‌, వైద్యరంగంలో అత్యధునాతన పరికరాల తయారీ అవసరమని అన్నారు.ఇందుకు  వైద్యపరికరాలకు సంబంధించి మల్టీడిసిప్లినరీ ప్రత్యేక కోర్సుల అవసరం ఎంతైనా ఉందని అన్నారు. నైపుణ్యం గల మానవ వనరులు భవిష్యత్‌ మెడికల్‌ టెక్నాలజీలకు అందుబాటులోకి తెచ్చేందుకు, తయారీ రంగానికి , పరిశోధనకు వీలుగా ప్రస్తుత సంస్థలలో వీటికి మద్దతు ఇవ్వనున్నట్టు తెలిపారు.

***

 



(Release ID: 1895589) Visitor Counter : 306