ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఐసీసీ అండర్‌-19 మహిళల టి20 ప్రపంచకప్‌ విజేత భారత జట్టుకు ప్రధాని అభినందన

Posted On: 29 JAN 2023 8:27PM by PIB Hyderabad

   సీసీ అండర్-19 మహిళల టి20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత జట్టుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందనలు తెలిపారు.

ఈ మేరకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి ట్వీట్‌ను ప్రస్తావిస్తూ ఇచ్చిన సందేశంలో:

   “ఐసీసీ అండర్-19 మహిళల టి20 ప్రపంచకప్‌లో విశిష్ట విజయం సాధించిన భారత జట్టుకు అభినందనలు. ఈ క్రికెట్‌ టోర్నమెంట్‌లో వారి అద్భుత క్రీడా ప్రదర్శన వర్ధమాన క్రికెటర్లకు ఎనలేని స్ఫూర్తినిస్తుంది. భవిష్యత్తులోనూ వారు మరిన్ని విజయాలు సాధించాలని శుభాశీస్సులు అందజేస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.


*****

DS/TS


(Release ID: 1894659) Visitor Counter : 171