ప్రధాన మంత్రి కార్యాలయం

భారత 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన వివిధ దేశాల అధినేతలకు ప్రధానమంత్రి ధన్యవాదాలు

Posted On: 26 JAN 2023 9:02PM by PIB Hyderabad

   భారత 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన వివిధ దేశాల అధినేతలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు….

 

   ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ట్వీట్‌పై స్పందిస్తూ... ప్రధానమంత్రి@AlboMP గారూ.. మీకు ధన్యవాదాలు. అలాగే ఆస్ట్రేలియా దినోత్సవం సందర్భంగా మీతోపాటు స్నేహశీలురైన ఆస్ట్రేలియా ప్రజలందరికీ నా శుభాకాంక్షలు" అని పేర్కొన్నారు.

 

   నేపాల్‌ ప్రధానమంత్రి ప్రచండ ట్వీట్‌పై స్పందిస్తూ... ప్రధానమంత్రి @cmprachanda గారూ.. మీకు కృతజ్ఞతలు. మీ హృదయపూర్వక శుభాకాంక్షలకు ధన్యావాదాలు!” అని పేర్కొన్నారు.

 

   భూటాన్‌ ప్రధానమంత్రి ట్వీట్‌పై స్పందిస్తూ... ప్రధానమంత్రి @PMBhutan డాక్టర్‌ లోతే షేరింగ్‌ గారూ.. మీ హృదయపూర్వక శుభాకాంక్షలకు ధన్యావాదాలు! మన రెండుదేశాల అభివృద్ధి, శ్రేయస్సు దిశగా మన విశిష్ట భాగస్వామ్యానికి భారత్‌ సదా నిబద్ధతతో ఉంటుంది” అని పేర్కొన్నారు.

 

   మాల్దీవ్స్‌ అ        ధ్యక్షుడు సొలీహ్‌ ట్వీట్‌పై స్పందిస్తూ... “అధ్యక్షులు @ibusolih గారూ.. మీ హృదయపూర్వక శుభాకాంక్షలకు ధన్యావాదాలు!” ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలతో కూడిన భారత-మాల్దీవ్స్‌ భాగస్వామ్యం సుస్థిర పురోగమనం ఎంతో ఆనందదాయకం” అని పేర్కొన్నారు.

 

   ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి నెతన్యాహు ట్వీట్‌పై స్పందిస్తూ... ప్రధానమంత్రి @netanyahu గారూ.. మా గణతంత్ర దినోత్సవం సందర్భంగా మీ హృదయపూర్వక శుభాకాంక్షలకు ధన్యావాదాలు! మన వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం కాగలదని ఆశిస్తున్నాను” అని పేర్కొన్నారు.

 

   ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్యాన్యుయెల్‌ మాక్రాన్‌ ట్వీట్‌పై స్పందిస్తూ... “నా ప్రియమిత్రులైన అధ్యక్షులు @EmmanuelMacron గారూ.. మా గణతంత్ర దినోత్సవం సందర్భంగా మీ హృదయపూర్వక శుభాకాంక్షలకు కృతజ్ఞతలు. భారత జి-20 అధ్యక్షత, భారత-ఫ్రాన్స్‌ వ్యూహాత్మక భాగస్వామ్య 25వ వార్షికోత్సవం విజయవంతమయ్యే దిశగా మన ఉమ్మడి నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాను. భారత-ఫ్రాన్స్‌ స్నేహబంధం ప్రపంచానికి శ్రేయస్కరం” అని పేర్కొన్నారు.

 

   మారిషస్‌ ప్రధానమంత్రి కుమార్‌ జుగనాథ్‌ ట్వీట్‌పై స్పందిస్తూ... ప్రధానమంత్రి PM @KumarJugnauth గారూ.. ధన్యావాదాలు! ఆధునిక గణతంత్రాలుగా మన రెండు దేశాల ప్రగతి భాగస్వామ్యం ప్రజా కేంద్రకంగా ముందుకు సాగుతోంది. మారిషస్‌తో మా ప్రతిష్టాత్మక భాగస్వామ్యం మరింత బలపడాలని ఆకాంక్షిస్తున్నాను” అని పేర్కొన్నారు.

 

******



(Release ID: 1894034) Visitor Counter : 185