ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు

प्रविष्टि तिथि: 25 JAN 2023 11:49AM by PIB Hyderabad

జాతీయ ఓటర్ల దినోత్సవం నేపథ్యంలో ఇవాళ ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మీకందరికీ శుభాకాంక్షలు. ‘ఓటింగ్‌ మన కర్తవ్యం-నేను తప్పక ఓటు వేస్తాను’ అన్నది ఈ ఏడాది ఇతివృత్తం. ఆ మేరకు మనమంతా సమష్టిగా ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములమై ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం. ఈ విషయంలో ఎన్నికల సంఘం కృషని కూడా మనసారా అభినందిస్తున్నాను” అని ప్రధాని పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 1893610) आगंतुक पटल : 243
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Urdu , English , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam