మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఆరు కేటగిరీలలో అసాధారణ విజయాలు సాధించిన 11 మంది పిల్లలకు రేపు ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2023ని ప్రదానం చేయనున్న భారత రాష్ట్రపతి
జనవరి 24న అవార్డు గ్రహీతలతో ప్రధాన మంత్రి సంభాషించనున్నారు
సహాయ మంత్రి డాక్టర్ ముంజ్‌పరా మహేంద్రభాయ్ సమక్షంలో మహిళా శిశు అభివృద్ధి మంత్రి శ్రీమతి. స్మృతి జుబిన్ ఇరానీ పిల్లలను అభినందిస్తూ వారితో సంభాషించనున్నారు.
11 రాష్ట్రాలు మరియు యుటిలకు చెందిన అవార్డు గ్రహీతలలో 6 మంది అబ్బాయిలు మరియు 5 మంది బాలికలు ఉన్నారు
ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ యొక్క ప్రతి అవార్డు గ్రహీతకు పతకం, రూ. 1 లక్ష నగదు బహుమతి మరియు సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది.
प्रविष्टि तिथि:
22 JAN 2023 10:48AM by PIB Hyderabad
భారత రాష్ట్రపతి శ్రీమతి. ద్రౌపది ముర్ము రేపు అంటే 23 జనవరి 2023న విజ్ఞాన్ భవన్‌లో జరిగే అవార్డు వేడుకలో 11 మంది అసాధారణమైన పిల్లలకు ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం, 2023ని ప్రదానం చేస్తారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 24 జనవరి 2023న ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార గ్రహీతలతో సంభాషించనున్నారు.
మహిళా శిశు అభివృద్ధి మంత్రి శ్రీమతి. స్మృతి జుబిన్ ఇరానీ జనవరి 24,2023 న సహాయ మంత్రి డాక్టర్ ముంజ్‌పరా మహేంద్రభాయ్ సమక్షంలో వారి వారి కేటగిరీలలో వారి శ్రేష్టమైన ప్రతిభా పాటవాలు ప్రదర్శించిన పిల్లలతో సంభాషిస్తారు వారిని అభినందిస్తారు.
భారత ప్రభుత్వం వారి అసాధారణ విజయాలకు శ్రేష్టమైన ప్రతిభా పాటవాలు ప్రదర్శించిన పిల్లలకు ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ అవార్డును అందజేస్తుంది. 5 నుండి 18 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు వారు కళ, సంస్కృతి, శౌర్యం, నూతన ఆవిష్కరణ, పాండిత్యం, సామాజిక సేవ మరియు క్రీడలు వంటి ఆరు విభాగాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఈ అవార్డులు అందజేయబడతాయి. ఇవి జాతీయ గుర్తింపుకు అర్హమైనవి. పీ ఎం ఆర్ బీ పీ అవార్డు పొందిన ప్రతి ఒక్కరికి పతకం, రూ. 1 లక్ష నగదు బహుమతి మరియు సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది.
ఈ సంవత్సరం దేశంలోని అన్ని ప్రాంతాల నుండి కళ మరియు సంస్కృతి (4), శౌర్యం (1), నూతన ఆవిష్కరణ (2), సామాజిక సేవ (1), మరియు క్రీడలు (3) వంటి అంశాల నుంచి ఎంపిక చేయబడిన 11 మంది పిల్లలకు ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం ప్రదానం చేస్తారు.
***
(रिलीज़ आईडी: 1892811)
आगंतुक पटल : 278