ప్రధాన మంత్రి కార్యాలయం

‘వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌథ్ సమిట్ 2023’ లోభాగం గా ప్రారంభిక నేత ల సమావేశం లో ప్రధాన మంత్రి ముగింపు ప్రసంగం తాలూకు పాఠం

Posted On: 12 JAN 2023 11:46AM by PIB Hyderabad

శ్రేష్ఠులారా,

మీరు సూక్ష్మ దృష్టి తో వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాల కు గాను నేను ధన్యవాదాల ను తెలియ జేస్తున్నాను. మొట్టమొదటి సారిగా ఏర్పాటైన వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమిట్లోని తదుపరి ఎనిమిది సమావేశాల కు మీ ఆలోచన లు మార్గదర్శనం చేస్తాయి. మీరు చెప్పిన దానిని బట్టి చూస్తే, మనిషి ని కేంద్ర స్థానం లో నిలబెట్టేటటువంటి అభివృద్ధి అనేది అభివృద్ధి చెందుతున్న దేశాల కు ఒక ముఖ్యమైన ప్రాధమ్యం అని స్పష్టం అయింది. వర్తమానం లోని జోక్యాలు మన అందరి మనసుల లో అతి ప్రధానం గా ఉన్నటువంటి సర్వసాధారణ సమస్యల ను కూడా వెలికి తీసుకు వచ్చాయి. ఇది ప్రధానం గా మన అభివృద్ధి అవసరాల కు తగినటువంటి వనరులు లోపించడం, ప్రాకృతిక శీతోష్ణస్థితి లోను, భౌగోళిక రాజకీయ వాతావరణం లోను అస్థిరత్వం పెరగడం వంటి వాటికి సంబంధించినవి. ఇంత జరుగుతూ ఉన్నప్పటికి కూడాను అభివృద్ధి చెందుతున్న దేశాలు పూర్తి విశ్వాసం తో, సంపూర్ణమైన సకారాత్మక శక్తి తో నిండి ఉన్నాయి అనేది కూడా స్పష్టం అవుతోంది.

20వ శతాబ్దం లో, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కు అభివృద్ధి చెందిన దేశాలు చోదక శక్తులు గా నిలచాయి. ప్రస్తుతం, ఈ పురోగామి ఆర్థిక వ్యవస్థల లో చాలా వరకు ఆర్థిక వ్యవస్థ లు నెమ్మదిస్తున్నాయి. 21 వ శతాబ్దం లో ప్రపంచ వృద్ధి అభివృద్ధి చెందుతున్న దేశాల నుండి రానుందనేది స్పష్టం. మనం గనుక కలసి కృషి చేసినట్లయితే గ్లోబల్ అజెండా ను మనం నిర్దేశించగలుగుతాం అని నేను అనుకొంటున్నాను. నేడు మరియు రేపు జరిగే సదస్సుల లో మనం మరింత లోతు గా చర్చించి, ఈ రోజు న మన చర్చల లో వ్యక్తం అయిన టువంటి విలువైన ఆలోచనల ను ముందుకు తీసుకు పోదాం. మన కృషి గ్లోబల్ సౌథ్ కు నిర్దిష్ట కార్యాచరణ సంబంధి అంశాల ను ఇచ్చే మరియు గ్లోబల్ అజెండా పరం గా అవసరమైన అంశాల ను ప్రతిపాదించే దిశల లో సాగాలి. వాయిస్ ఆఫ్ ది గ్లోబల్ సౌథ్తన సొంత గళాన్ని వినిపించాలి. మన పరిధి లో ఉండని పరిస్థితులపైన మరియు మన పరిధి లో ఉండని వ్యవస్థల పైన ఆధారపడేటటువంటి స్థితి ని నుండి మనం బయటపడవలసిన అవసరం ఉన్నది.

మీరు మీ యొక్క కాలాన్ని ఇవ్వడం తో పాటు, ఈ కార్యక్రమం లో పాల్గొని విలువైన మాటల ను చెప్పినందుకు గాను మీకు మరో సారి ధన్యవాదాల ను తెలియ జేస్తున్నాను.


మీకు ఇవే ధన్యవాదాలు.

ధన్యవాద్ జీ.

 

***



(Release ID: 1890651) Visitor Counter : 197