ప్రధాన మంత్రి కార్యాలయం
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో సంభాషించిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
11 JAN 2023 6:22PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఇజ్రాయెల్ ప్రధాని గౌరవనీయ బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్ ద్వారా సంభాషించారు.
ఇజ్రాయెల్ ప్రధానిగా ఆరోసారి ఎన్నిక కావడంపై గౌరవనీయ నెతన్యాహుకు ప్రధానమంత్రి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. తన పదవీ బాధ్యతలలో ఆయన విజయవంతం కావాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
“ఇటీవలి కాలంలో భారత్-ఇజ్రాయెల్ వ్యూహాత్మక భాగస్వామ్యం వేగంగా పురోగమిస్తుండటంపై దేశాధినేతలిద్దరూ సంతృప్తి వ్యక్తం చేశారు. వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత విస్తృతం చేసుకునే మార్గాలపై వారిద్దరూ ఒక అంగీకారానికి వచ్చారు.
భారత్‌లో పర్యటించాలని ప్రధానమంత్రి ఆహ్వానం పలుకగా, త్వరలో సందర్శిస్తానని నెతన్యాహూ తెలిపారు.
(रिलीज़ आईडी: 1890590)
आगंतुक पटल : 178
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam