సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గగుర్పొడిచే దృశ్యాలను, బాధ కలిగించే చిత్రాలను టీవీ ఛానెళ్లు ప్రసారం చేయకుండా ఐ & బీ మంత్రిత్వ శాఖ హెచ్చరించింది


రక్తం, మృతదేహాలు,బాధాకరమైన భౌతిక దాడి ని చూపించే హింసాత్మక చిత్రాలు ప్రోగ్రామ్ కోడ్‌కు విరుద్ధం మైనవి

సోషల్ మీడియా నుండి తీసిన హింసాత్మక వీడియోలను ఛానెల్‌లు ఎడిటింగ్ చేయడం లేదు

టీ వీ కార్యక్రమాలు పిల్లలపై మానసిక ప్రభావాన్ని కలిగిస్తాయి, బాధితుల గోప్యతలోనికి ప్రవేశిస్తున్నాయి.

Posted On: 09 JAN 2023 2:38PM by PIB Hyderabad

మహిళలు, పిల్లలు మరియు వృద్ధులపై హింసతో సహా ప్రమాదాలు, మరణాలు మరియు హింస వంటి సంఘటనలను ప్రసారం లో "మంచి అభిరుచి మరియు మర్యాద" విషయంలో స్థూలంగా రాజీపడే పద్దతి కి వ్యతిరేకంగా సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఈరోజు అన్ని టెలివిజన్ ఛానెల్‌లకు సలహా జారీ చేసింది. అనేక సందర్భాల్లో టెలివిజన్ ఛానెల్‌ల విచక్షణ లోపాన్ని మంత్రిత్వ శాఖ గుర్తించి  ఈ సలహా జారీ చేయబడింది.

పలు టేలివిజన్ ఛానెల్‌లు వ్యక్తుల మృతదేహాలు మరియు గాయపడిన వ్యక్తుల చిత్రాలు/వీడియోలను చూపించాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. చిత్రాలను అస్పష్టం చేయడం లేదా లాంగ్ షాట్‌ల నుండి వాటిని చూపడం వంటి జాగ్రత్తలు తీసుకోకుండా, ఒక ఉపాధ్యాయుడు ఒక విద్యార్థిని కర్ర తో తీవ్రంగా కొట్టడం పిల్లవాడు బాధతో చేసిన అరుపులు విచక్షణ లేకుండా చాలా నిమిషాల పాటు పదే పదే చూపబడింది, తద్వారా చూడటానికి ఇది మరింత  భయంకరంగా ఉంటుంది. అటువంటి సంఘటనలను చూపించే విధానం ప్రేక్షకులకు అసహ్యంగా మరియు బాధ కలిగించేలా ఉందని తెలిపింది.

 

అటువంటి రిపోర్టింగ్ వివిధ ప్రేక్షకులపై చూపే ప్రభావాన్ని జారీ చేసిన సలహా లో స్పష్టం చేసింది. ఇలాంటి ప్రసారాలు పిల్లలపై మానసికంగా కూడా ప్రతికూల ప్రభావం చూపుతాయని పేర్కొంది. గోప్యతపై దాడికి సంబంధించిన కీలకమైన సమస్య కూడా ఉంది, ఈ ప్రసారాలు హాని కలిగించే మరియు పరువు నష్టం కలిగించే అవకాశం  ఉండవచ్చని సలహా లో నొక్కి చెప్పింది. వృద్ధులు, మధ్య వయస్కులు, చిన్న పిల్లలు మొదలైన అన్ని వర్గాలకు చెందిన వ్యక్తులు మరియు వివిధ సామాజిక-ఆర్థిక నేపథ్యాలకుటుంబాలకు చెందిన వీక్షకులు సాధారణంగా వీక్షించే ప్లాట్‌ఫారమ్‌గా టెలివిజన్  ప్రసారకర్తలు నిర్దిష్ట బాధ్యత మరియు క్రమశిక్షణ కలిగి ఉండాలని ప్రోగ్రామ్ కోడ్ మరియు అడ్వర్టైజింగ్ కోడ్‌లో పొందుపరచబడింది.

 

చాలా సందర్భాలలో వీడియోలు సోషల్ మీడియా నుండి తీసుకోబడుతున్నాయని మరియు ప్రోగ్రామ్ కోడ్‌కు అనుగుణంగా లేకుండా మరియు అనుగుణ్యతను నిర్ధారించే సంపాదక విచక్షణ మరియు మార్పులు లేకుండా ప్రసారం చేయబడుతున్నాయని మంత్రిత్వ శాఖ గమనించింది.

 

ఇటీవల ప్రసారమైన అటువంటి కంటెంట్ యొక్క ఉదాహరణల జాబితా క్రింది విధంగా ఉంది:

 

1.    30.12.2022 లో ప్రమాదంలో గాయపడిన క్రికెటర్ యొక్క బాధాకరమైన చిత్రాలు మరియు వీడియోలను అస్పష్టం చేయకుండా ప్రసారం చేశారు.

 

2.    28.08.2022 తేదీన ఒక వ్యక్తి బాధితురాలి మృతదేహాన్ని లాగడం మరియు చుట్టూ రక్తం చిమ్ముతూ ఉన్న బాధితురాలి ముఖంపై దృశ్యం కేంద్రీకరించడం వంటి అవాంతర దృశ్యాలను చూపింది.

 

3.    06-07-2022న బీహార్‌లోని పాట్నాలో కోచింగ్ క్లాస్‌రూమ్‌లో స్పృహ కోల్పోయేంత వరకు 5 ఏళ్ల బాలుడిని ఉపాధ్యాయుడు క్రూరంగా కొట్టడం  బాధాకరమైన సంఘటన ను చిత్రీకరించడం. ఈ దృశ్యాన్ని నిశబ్దం చేయకుండా చూపబడింది, దీనిలో దయ తో వేడుకుంటున్న చిన్నారి బాధాకరమైన ఏడుపులు వినబడతాయి ఈ ప్రసారం 9 నిమిషాలకు పైగా చూపబడింది.

 

4.    04-06-2022 లో అస్పష్టత లేకుండా పంజాబీ గాయకుడి మృతదేహం యొక్క బాధాకరమైన భయంకరమైన చిత్రాలను చూపింది.

 

5.    25-05-2022 న అస్సాంలోని చిరాంగ్ జిల్లాలో ఒక వ్యక్తి ఇద్దరు మైనర్ బాలురను కర్రతో దారుణంగా కొట్టిన సంఘటనను చూపుతోంది. వీడియోలో, ఆ వ్యక్తి కనికరం లేకుండా అబ్బాయిలను కర్రలతో కొట్టడం చూడవచ్చు. ఈదృశ్యాన్ని  అస్పష్టంగా లేదా నిశబ్దం చేయకుండా ప్రసారం లో చూపబడింది, ఇందులో అబ్బాయిల బాధాకరమైన ఏడుపులు స్పష్టంగా వినిపిస్తాయి.

 

6.    16-05-2022 న కర్నాటకలోని బాగల్‌కోట్ జిల్లాలో ఒక మహిళా న్యాయవాది పై ఆమె పొరుగువారు క్రూరంగా దాడి చేశారు, ఎడిట్‌లు లేకుండా నిరంతరం ఈదృశ్యాన్ని ప్రసారం లో చూపుతున్నారు.

 

7.    04-05-2022 తేదీన తమిళనాడులోని విరుదునగర్ జిల్లా రాజపాళయంలో ఒక వ్యక్తి తన సొంత చెల్లెలిని హతమార్చి చంపడాన్ని చూపుతోంది.

 

8.    01-05-2022 ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలో ఐదుగురు వ్యక్తులు ఒక వ్యక్తిని చెట్టుకు తలకిందులుగా వేలాడదీసి కర్రలతో దారుణంగా కొట్టారు.

 

9.    12-04-2022 న ఒక ప్రమాదంలో ఐదు మృతదేహాల బాధాకరమైన దృశ్యాన్ని నిరంతరం చూపారు.

 

10.    11-04-2022 న కేరళలోని కొల్లంలో ఒక వ్యక్తి తన 84 ఏళ్ల తల్లిపై క్రూరంగా దాడి చేయడం, తన తల్లిని పెరట్లో నుండి ఈడ్చుకెళ్లడం మరియు కనికరం లేకుండా సుమారు 12 నిమిషాల పాటు చూపడం వంటి సంఘటనను చూడవచ్చు.

 

11.    07-04-2022న బెంగుళూరులో ఒక వృద్ధుడు తన కుమారుడిని తగులబెట్టిన అత్యంత ఆందోళనకరమైన వీడియో లో వృద్ధుడు అగ్గిపుల్లని వెలిగించి, తన కుమారుడిపై విసిరి మంటల్లో చిక్కుకున్న ఎడిట్ చేయని దృశ్యాలను  పదేపదే ప్రసారం చేశారు.

 

12.    22-03-2022 లో అస్సాంలోని మోరిగావ్ జిల్లాలో 14 ఏళ్ల మైనర్ బాలుడిని కొట్టడం, మసకబారడం లేదా మ్యూట్ చేయడం లేకుండా తీసుకువెళ్లిన వీడియోలో బాలుడు కనికరం లేకుండా కొట్టినప్పుడు ఏడుపు మరియు వేడుకోవడం వినబడుతుంది.

 

అటువంటి ప్రసారాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ,  ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, వృద్ధులు, మహిళలు మరియు పిల్లలతో సహా టెలివిజన్ ఛానెల్‌లు ప్రేక్షకులపై పెద్ద ఎత్తున చూపే ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని, మంత్రిత్వ శాఖ అన్ని ప్రైవేట్ టెలివిజన్ ఛానెల్‌లను వారి వ్యవస్థలు హింస సంఘటనలను మరణంతో సహా నేరం, ప్రమాదాలు సంఘటనల ప్రసారం చేసే కార్యక్రమాలను ప్రోగ్రామ్ కోడ్‌కు అనుగుణంగా ఉండాలని గట్టిగా సూచించింది. 


(Release ID: 1889893) Visitor Counter : 229