సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

హెచ్ డి కార్యక్రమాలు రూపొందించ గల సామర్థ్యం పొందనున్న 28 ప్రాంతీయ దూరదర్శన్ చానళ్ళు


బిండ్ (BIND) పథకం కింద జనాభాలో 80 శాతానికి పైగా ప్రజలకు అందుబాటులోకి రానున్న ఎఫ్ఎం కార్యక్రమాలు

జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో 76 శాతం, ఇండో-నేపాల్ సరిహద్దుల్లో 63 శాతం ప్రాంతాలకు ప్రసార కార్యక్రమాల విస్తరణ

మారుమూల, గిరిజన, ఎల్డబ్ల్యూఈ, సరిహద్దు ప్రాంతాల్లో 8 లక్షలకు పైగా డీడీ డీటీహెచ్ రిసీవర్ సెట్లను ఉచితంగా పంపిణీ చేయనున్న ప్రసార భారతి

Posted On: 06 JAN 2023 3:52PM by PIB Hyderabad

2025-26 తో ముగిసే  ఐదేళ్ల కాలానికి ఆకాశవాణి , దూరదర్శన్ సేవల ఆధునీకరణ, అప్ గ్రేడేషన్, విస్తరణ కోసం .2539.61 కోట్ల వ్యయంతో "బ్రాడ్ కాస్ట్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ నెట్ వర్క్ డెవలప్మెంట్ (బిఐఎన్ డి)" పథకానికి 2023 జనవరి 4న కేంద్ర  మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పథకంలో భాగంగా ఎఫ్ఎం రేడియో నెట్ వర్క్ విస్తరణ మరియు బలోపేతం, మొబైల్ టివి కార్యక్రమాల రూపకల్పన కోసం  సౌకర్యాలు కల్పించే అంశానికి ఆకాశవాణి, దూరదర్శన్ ప్రత్యేకంగా దృష్టి సారించి ప్రాధాన్యతా ప్రాజెక్టులుగా అమలు చేస్తాయి. 950 కోట్ల రూపాయల ఖర్చుతో కార్యక్రమాలను ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో పూర్తి చేయాల్సి ఉంది.

వామపక్ష తీవ్రవాదం, సరిహద్దు ప్రాంతాలు, వ్యూహాత్మక ప్రాంతాల్లో మెరుగైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసి  పబ్లిక్ బ్రాడ్ కాస్టర్ పరిధిని విస్తరించడానికి సౌకర్యాలు అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో పథకం అమలు జరుగుతుంది.  దేశీయ మరియు అంతర్జాతీయ ప్రేక్షకుల కోసం ప్రసార కార్యక్రమాల నాణ్యత  అభివృద్ధి చేయడం, విభిన్న వినూత్న కార్యక్రమాలు రూపొందించి ప్రసారం చేయడానికి మరిన్నిచానళ్లకు  అవకాశం కల్పించడానికి డిటిహెచ్ ప్లాట్ ఫామ్ సామర్థ్యాన్ని పెంపొందించడం జరుగుతుంది. దీనివల్ల   వైవిధ్యమైన కార్యక్రమాలను ప్రజలు చూడటానికి అవకాశం కలుగుతుంది. వామపక్ష తీవ్రవాద ప్రభావం ఉన్న ప్రాంతాలు  మరియు ఆకాంక్షిత  జిల్లాలపై దృష్టి సారించి ప్రధానంగా టైర్ 2 మరియు టైర్ -3 నగరాల్లో ఎఫ్ఎం వ్యవస్థను  ను విస్తరించాలని ఈ ప్రణాళిక లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రసార భారతి ఆకాశవాణి, దూరదర్శన్ ద్వారా ప్రసారాలు చేస్తోంది. ఆకాశవాణి  653 ఎయిర్ ట్రాన్స్ మీటర్లు   (122 మీడియం వేవ్, 7 షార్ట్ వేవ్ మరియు 524 ఎఫ్ఎమ్  ట్రాన్స్ మీటర్లు   ) 501 ఎయిర్ బ్రాడ్కాస్టింగ్ సెంటర్ల ద్వారా ప్రపంచ సేవలు, పొరుగు సేవలు, 43 వివిధ  భారతి కేంద్రాలు, , 25 రెయిన్బోకేంద్రాలు  మరియు 4 ఎఫ్ఎం గోల్డ్ కేంద్రాల  ద్వారా దేశంలోని తన శ్రోతలకు కార్యక్రమాలు ప్రసారం చేస్తోంది. 

దూరదర్శన్ 66 కేంద్రాల ద్వారా 36 డిడి ఛానళ్ల ద్వారా కేబుల్, డిటిహెచ్, ఐపి టీవీ "న్యూస్ ఆన్ ఎయిర్ " మొబైల్ యాప్, వివిధ యూట్యూబ్ చానళ్ళు  మరియు  అంతర్జాతీయ ఛానల్ డిడి ఇండియా వివిధ వేదికల ద్వారా  190 కి పైగా  దేశాలలో ప్రపంచవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు ప్రసారం చేస్తోంది.

బిండ్ (BIND)    పథకం కింద ఈ క్రింది ప్రధాన కార్యకలాపాలు అమలు చేయడానికి ప్రణాళిక రూపొందింది. 

ఆకాశవాణి 

*దేశంలో ఎఫ్ఎం కార్యక్రమాలను భౌగోళిక విస్తీర్ణం ప్రకారం 58.83% నుంచి  66.29 శాతానికి, జనాభా ప్రాతిపదికన  68% నుంచి  80.23 శాతానికి పెంచడం

* ఇండో నేపాల్ సరిహద్దులో ఆకాశవాణి ఎఫ్ఎం కార్యక్రమాల పరిధిని 48.27 శాతం నుంచి 63.02 శాతానికి పెంచడం.

* జమ్మూ కాశ్మీర్ సరిహద్దు వెంబడి ఆకాశవాణి  ఎఫ్ఎం  ప్రసారాలను  62% నుంచి 76 శాతానికి పెంచడం.

*   30,000 చదరపు కిలోమీటర్ల  విస్తీర్ణంలో సేవలు అందించడానికి రామేశ్వరం వద్ద 300 మీటర్ల టవర్  వద్ద  20 కిలోవాట్ల సామర్ధ్యంతో ఎఫ్ఎం ట్రాన్స్ మీటర్ నెలకొల్పడం 

దూరదర్శన్

* ప్రసార భారతి సౌకర్యాలలో ఆధునిక  ప్రసార మరియు స్టూడియో పరికరాలను ఏర్పాటు చేసి  డిడి మరియు ఆకాశవాణి కార్యక్రమాల నాణ్యత మరింత పెంచడం 

 * విజయవాడ మరియు లేహ్ దూరదర్శన్ కేంద్రాల ఎర్త్ స్టేషన్ల ద్వారా  24 గంటలు కార్యక్రమాలు ప్రసారం చేయడం 

* ప్రతిష్ఠాత్మక జాతీయ వేడుకలు/కార్యక్రమాలు, ప్రముఖుల కార్యక్రమాలు ప్రసారం చేయడానికి  ఫ్లై అవే యూనిట్లను ప్రారంభించడం.

* 28 ప్రాంతీయ దూరదర్శన్ ఛానళ్లను హై డెఫినిషన్ ప్రోగ్రామ్ ఉత్పత్తి సామర్థ్య కేంద్రాలుగా మార్చడం 

* మొత్తం దూరదర్శన్ నెట్ వర్క్ లోని 31 ప్రాంతీయ వార్తా యూనిట్లను సమర్థవంతమైన వార్తల సేకరణ కోసం అత్యాధునిక పరికరాలతో అప్ గ్రేడ్ చేసి ఆధునీకరించడం 

*  గౌహతి, షిల్లాంగ్, ఐజ్వాల్, ఇటానగర్, అగర్తలా, కోహిమా, ఇంఫాల్, గ్యాంగ్టక్ మరియు పోర్ట్ బ్లెయిర్ దూరదర్శన్ కేంద్రాల వద్ద ఎర్త్ స్టేషన్లను అప్ గ్రేడ్ చేయడం మరియు కోట వాటిని ఏర్పాటు చేయడం ద్వారా హెచ్ డి టీవీ ఛానళ్లను అప్ లింక్ చేయడానికి సౌకర్యాలు కల్పించడం 

ప్రణాళికలో ముఖ అంశాలు: 

1. దేశంలో ప్రధానంగా టైర్-2 మరియు టైర్-3 నగరాలు, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలు, మరియు సరిహద్దు ప్రాంతాలు మరియు దేశంలోని ఆకాంక్షిత  జిల్లాల్లో ఎఫ్ఎం కవరేజీని 6 లక్షల చదరపు మీటర్లకు పైగా పెంచడానికి 10 కిలో వాట్లు లేదా అంతకు మించి సామర్థ్యం గల 41 ఎఫ్ఎం ట్రాన్స్ మీటర్లు, 100  10 కిలో వాట్లు సామర్థ్యం గల 100  ట్రాన్స్ మీటర్లు  ఏర్పాటు చేయడం 

2. డీడీ ఫ్రీ డిష్ సామర్థ్యాన్ని ప్రస్తుతమున్న 116 చానళ్ల  నుంచి 250 చానళ్లకు పెంచడం ద్వారా  వైవిధ్యమైన ఛానళ్లను ఉచితంగా అందించడం.

3. డిడి ఫ్రీ డిష్ ప్రసార భారతి యొక్క ఫ్రీ-టు-ఎయిర్ డైరెక్ట్ టు హోమ్ (డిటిహెచ్) వేదిక. దేశంలో  4.30 కోట్ల కనెక్షన్లు కలిగి ఉంది (ఫిక్కీ మరియు ఇ అండ్ వై రిపోర్ట్ 2022 ప్రకారం). ఇది భారతదేశంలో అతిపెద్ద డిటిహెచ్ వేదికగా గుర్తింపు పొందింది. . డిడి ఫ్రీ డిష్  వీక్షకులు ఈ వేదిక అందిస్తున్న చానళ్ళు చూడటానికి నెలవారీ లేదా వార్షిక ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ ప్లాట్ ఫామ్ లో 49 దూరదర్శన్, సంసద్ చానళ్ళు, 77 ప్రముఖ ప్రసార సంస్థలకు చెందిన ప్రైవేట్ టివి చానళ్ళు  (11 జిఇసి, 14 మూవీ, 21 న్యూస్, 7 మ్యూజిక్, 9 ప్రాంతీయ, 7 భోజ్ పురి, 1 స్పోర్ట్స్, 5 భక్తి ఛానల్, 3 విదేశీ ఛానల్), 51 ఎడ్యుకేషనల్ చానళ్ళు  మరియు 48 రేడియో చానళ్ళు ఉన్నాయి.

4. విపత్తులు లేదా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అంతరాయం లేకుండా డిటిహెచ్ సేవలు అందించడం కోసం  డిడి ఫ్రీ డిష్ డిజాస్టర్ రికవరీ సౌకర్యం  ఏర్పాటు చేయడం.

5. అంతరాయం లేని మరియు సమర్థవంతమైన కార్యక్రమాల రూపకల్పన  మరియు ప్రసారం కోసం ఫీల్డ్ స్టేషన్ల ప్రసార సౌకర్యాల ఆటోమేషన్ మరియు ఆధునీకరణ.  ఆటోమేటెడ్ ప్లే అవుట్ సౌకర్యాలు, తాజా వార్తలు ప్రసారం చేయడానికి న్యూస్ రూమ్ కంప్యూటర్ సిస్టమ్స్, రియల్ టైమ్ ప్రొడక్షన్ ఎడిటింగ్ మరియు ప్రసారానికి అవసరమైన ఫైల్ ఆధారిత వర్క్ ఫ్లో, అత్యాధునిక స్టూడియో కెమెరాలు, లెన్సులు, స్విచ్చర్లు, రౌటర్ మొదలైన సౌకర్యాలు కల్పించడం,  దేశవ్యాప్తంగా ఉన్న డిడి కేంద్రాలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించడం జరుగుతుంది.  సామర్థ్య నిర్మాణం పెరగడంతో కాలంతో  పోటీ పడుతూ  ఆధునిక టీవీ స్టూడియో ప్రొడక్షన్ యొక్క సమయం, సాంకేతికత మరియు సాంకేతికతతో సరిపోలడానికి దూరదర్శన్ కు వీలు కల్పిస్తుంది.

6. వినోదం, ఆరోగ్యం, విద్య, యువత, క్రీడలు మరియు ఇతర ప్రజా సేవా అంశాలపై  దృష్టి సారించి ప్రాంతీయ భాషల్లో కార్యక్రమాలు అందించడానికి వీలు కల్పిస్తుంది.

7. తక్షణం స్పందించి వార్తలు సేకరించడానికి ఆధునిక సౌకర్యాలు కల్పించి గ్రామీణ, పాక్షిక గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడం ద్వారా   స్థానిక మరియు హైపర్ లోకల్ న్యూస్ కవరేజ్ పెంపొందించడం  .

8. మరింత ఆకర్షణీయంగా అందరిని ఆకట్టుకొనే విధంగా కార్యక్రమాలు రూపొందించడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడం 

9. శాటిలైట్ ట్రాన్స్ పాండర్ లను సమర్థవంతంగా ఉపయోగించుకోవడం కోసం సమర్థవంతమైన స్పెక్ట్రం  టెక్నాలజీతో ప్రస్తుతం ఉన్న అప్ లింక్ స్టేషన్ లను అప్ గ్రేడ్ చేయడం.

10. ఆకాశవాణి, దూరదర్శన్ నెట్ వర్క్ లో సమాచార వ్యాప్తిని  సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా పరిపాలనలో సమర్థత మరియు పారదర్శకత సాధించడం.

11. దేశీయ మరియు ప్రపంచ ప్రేక్షకులకు డిజిటల్ రీచ్ గణనీయంగా పెంచడం 

12. మారుమూల, గిరిజన, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలు, మరియు సరిహద్దు ప్రాంతాలలోని ప్రేక్షకులకు టెలివిజన్ మరియు రేడియో సేవలను మరింత ఎక్కువగా అందించడానికి  8 లక్షలకు పైగా డిడి డిటిహెచ్ రిసీవర్ సెట్ లను ఉచితంగా పంపిణీ చేసే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. 

ప్రసార పరికరాల సరఫరా మరియు వ్యవస్థాపనకు సంబంధించిన తయారీ మరియు సేవల ద్వారా పరోక్ష ఉపాధిని కూడా ఈ పథకం కల్పిస్తుంది. కార్యక్రమాల రూపకల్పన, అభివృద్ధిరంగంలో వివిధ మీడియా రంగాలలో ప్రత్యక్ష మరియు పరోక్ష ఉపాధిని పథకం అందిస్తుంది.

***


(Release ID: 1889209) Visitor Counter : 208