మంత్రిమండలి

పూర్వం రక్షణ శాఖమంత్రి గా మరియు గోవా కు నాలుగు సార్లు ముఖ్యమంత్రి గా ఉన్న కీర్తి శేషుడు శ్రీమనోహర్ పర్రికర్ కు శ్రద్ధాంజలి గా గ్రీన్ ఫీల్డ్ ఇంటర్ నేశనల్ ఎయర్ పోర్ట్ మోపా, గోవా కు ‘మనోహర్ ఇంటర్నేశనల్ ఎయర్ పోర్ట్ – మోపా, గోవా’ అనే పేరు  ను పెట్టేందుకు ఎక్స్-పోస్ట్ ఫ్యాక్టో ఆమోదాన్ని ఇచ్చిన మంత్రిమండలి 

Posted On: 04 JAN 2023 4:10PM by PIB Hyderabad

పూర్వం రక్షణ శాఖ మంత్రి గాను, గోవా కు నాలుగు సార్లు ముఖ్యమంత్రి గాను సేవలను అందించినటువంటి కీర్తి శేషుడు శ్రీ మనోహర్ పర్రికర్ కు శ్రద్ధాంజలి గా గ్రీన్ ఫీల్డ్ ఇంటర్ నేశనల్ ఎయర్ పోర్ట్ మోపా, గోవా కు ‘మనోహర్ ఇంటర్ నేశనల్ ఎయర్ పోర్ట్ - మోపా, గోవా’ అనే పేరు ను పెట్టేటందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఎక్స్-పోస్ట్ ఫ్యాక్టో ఆమోదాన్ని తెలిపింది.

 

గోవా రాష్ట్ర ప్రజల ఆకాంక్షల ను నెరవేర్చడానికి గ్రీన్ ఫీల్డ్ ఇంటర్ నేశనల్ ఎయర్ పోర్ట్, మోపా, గోవా కు ‘మనోహర్ ఇంటర్ నేశనల్ ఎయర్ పోర్ట్ -మోపా, గోవా’ అనే పేరు ను పెట్టాలని గోవా రాష్ట్ర ప్రభుత్వం యొక్క మంత్రిమండలి సర్వసమ్మతి తో నిర్ణయాన్ని తీసుకొన్నట్లు గోవా ముఖ్యమంత్రి తెలియజేశారు.

 

గోవా లోని మోపా లో ఏర్పాటైన గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని గౌరవనీయులైన ప్రధాన మంత్రి 2022వ సంవత్సరం డిసెంబర్ లో ప్రారంభించారు. ఆధునిక గోవా యొక్క నిర్మాణం లో పూర్వ ముఖ్యమంత్రి మరియు భారత ప్రభుత్వం లో ఇదివరకు రక్షణ మంత్రి గా ఉన్న దివంగత డాక్టర్ మనోహర్ పర్రికర్ అందించినటువంటి సేవల కు సమ్మానం గా ఈ విమానాశ్రయాని కి ఆయన పేరు ను పెట్టడం జరిగింది.

 

 

***

 



(Release ID: 1888595) Visitor Counter : 152