ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ స్కాన్ మరియు షేర్ సేవ ద్వారా ఆసుపత్రులలో వేగంగా ఓపీడీ నమోదు


1,00,000 కంటే ఎక్కువ మంది రోగులు ఈ సేవను ఉపయోగించి వేగవంతమైన ఓపీడీ నమోదుల ప్రయోజనాన్ని పొందారు

Posted On: 21 DEC 2022 12:04PM by PIB Hyderabad

ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ స్కాన్ మరియు షేర్ సేవ ద్వారా ఆసుపత్రులలో వేగంగా ఓపీడీ  నమోదు చేసుకునే సౌకర్యాన్ని జాతీయ ఆరోగ్య సంస్థ అందుబాటులోకి తెచ్చింది. 2022 అక్టోబర్ నెలలో ఢిల్లీలో ఒక ఆసుపత్రిలో ప్రయోగాత్మకంగా ప్రారంభమైన ఈ సౌకర్యం ప్రస్తుతం దేశంలో 18 రాష్ట్రాల్లో అమలు జరుగుతోంది. ఈ సౌకర్యం కింద 200 కి పైగా ఆరోగ్య సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రారంభమైన 75 రోజులు పూర్తి అయ్యే సమయానికి ఈ సౌకర్యం ద్వారా లక్ష మందికి  పైగా రోగులు ప్రయోజనం పొందారు.  ఓపీడీ  సేవలు పొందేందుకు  రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎక్కువ శ్రమ లేకుండా వేగంగా పూర్తి కావడంతో రోగుల సమయం ఆదా అవుతోంది. సౌకర్యం ఉపయోగించి రోగులకు మెరుగైన సేవలు అందించే అంశంలో కర్ణాటక, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. 

 రోగులు తమకు నచ్చిన ఏదైనా ఆరోగ్య అప్లికేషన్‌ను (ABHA యాప్, ఆరోగ్య సేతు యాప్, EkaCare, DRiefcase, Bajaj Health, PayTM వంటివి) ఉపయోగించి సౌకర్యం అందుబాటులో ఉన్న  ఆసుపత్రి/ఆరోగ్య సేవా కేంద్రానికి చెందిన క్యూఆర్  కోడ్‌ను స్కాన్ చేసి    ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ లో పొందుపరిచిన తమ వివరాలు అందించడానికి వీలవుతుంది.  పేరు, సంరక్షకుని పేరు, వయస్సు, లింగం, చిరునామా, మొబైల్ నెంబర్ మొదలైన  వివరాలు ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్  నుంచి  నేరుగా హాస్పిటల్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (HMIS)తో పంచుకోవడం ద్వారా డిజిటల్ నమోదు అవుతుంది. రోగి తన ఔట్ పేషెంట్ స్లిప్‌ని సేకరించడానికి మరియు వైద్యుడిని సందర్శించడానికి కౌంటర్‌ను సందర్శించవచ్చు.

సౌకర్యం వివరాలను జాతీయ ఆరోగ్య సంస్థ సీఈ డాక్టర్. ఆర్ ఎస్  శర్మ వివరించారు.  “ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్   కింద ప్రభుత్వం  ఇంటర్-ఆపరేబిలిటీని వ్యవస్థను అభివృద్ధి చేసి ఆరోగ్య సంరక్షణ సేవలు రోగులకు సులభంగా వేగంగా అందేలా చర్యలు అమలు చేస్తోంది.  స్కాన్ & షేర్ సౌకర్యం వల్ల  దేశంలో వేలాది మంది రోగులకు రోజూ సహాయం చేసే సౌకర్యం . ఈ తక్షణ రిజిస్ట్రేషన్ సేవలు అమలు చేయడానికి  జాతీయ ఆరోగ్య సంస్థ   దేశవ్యాప్తంగా వివిధ ఆసుపత్రులతో కలిసి పని చేస్తోంది. భాగస్వామ్య ఆరోగ్య సౌకర్యాలు వినియోగదారు ఎంచుకున్న అప్లికేషన్ మరియు HMIS మధ్య సాధారణ ఇంటర్-ఆపరేబిలిటీ ద్వారా, ఆసుపత్రులు మరియు రోగులు ఇద్దరూ ప్రయోజనం పొందుతారు' అని డాక్టర్ శర్మ తెలిపారు.

జాతీయ ఆరోగ్య సంస్థ అందుబాటులోకి తెచ్చిన  ద్వారా ఓపీడీ  రిజిస్ట్రేషన్ సులువుగా, ఎలాంటి సమస్యలు లేకుండా,  ఖచ్చితంగా పనిచేస్తుంది. . ఈ ప్రక్రియ రోగికి తనంతట తానుగా రిజిస్టర్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. రిజిస్ట్రేషన్ కోసం  ఎక్కువ సమయం క్యూలలో నిలబడకుండా చేస్తుంది.  ఇది రోగులకు తక్షణ మరియు నిజమైన ప్రయోజనాన్ని అందించడమే కాకుండా వారి ఆరోగ్య అవసరాలకు డిజిటల్ పరిష్కారాలను ఆమోదించేలా  ప్రోత్సహిస్తుంది.
స్కాన్ & షేర్ సేవ ద్వారా ఓపీడీ  టోకెన్ ఉత్పత్తికి సంబంధించిన అప్‌డేట్‌లు ABDM పబ్లిక్ డ్యాష్‌బోర్డ్‌  - https://dashboard.abdm.gov.in/abdm/  లో  'హెల్త్ ఫెసిలిటీ టోకెన్ జనరేటెడ్' ట్యాబ్ క్రింద అందుబాటులో ఉన్నాయి. 

***



(Release ID: 1885461) Visitor Counter : 113