సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
2022 సంవత్సరానికి సి.పి.జి.ఆర్.ఏ.ఎం.ఎస్. వార్షిక నివేదికను విడుదల చేసిన - కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
2022 సంవత్సరంలో అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాల ద్వారా 18,19,104 ఫిర్యాదులు అందాయి, వీటిలో 15,68,097 పి.జి. కేసులు పరిష్కరించబడ్డాయి
వీటిలో 11,29,642 కేసులను కేంద్ర మంత్రిత్వ శాఖలు పరిష్కరించగా, 4,38,455 కేసులను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పరిష్కరించాయి
కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాల సగటు పరిష్కార సమయం 2021లో 32 రోజులు ఉండగా, 2022 లో 27 రోజులకు మెరుగుపడింది
Posted On:
20 DEC 2022 1:03PM by PIB Hyderabad
2022 సంవత్సరానికి సి.పి.జి.ఆర్.ఏ.ఎం.ఎస్. వార్షిక నివేదికను కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ (స్వతంత్ర బాధ్యత) సహాయ మంత్రి, భూ విజ్ఞాన శాఖ (స్వతంత్ర బాధ్యత) సహాయ మంత్రి, ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు, అణు విద్యుత్తు, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ విడుదల చేశారు.
ఈ నివేదిక లోని ముఖ్యాంశాలు:
2022 సంవత్సరంలో, అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలకు 18,19,104 ఫిర్యాదులు అందగా, వాటిలో 15,68,097 పి.జి. కేసులు పరిష్కరించబడ్డాయి. వీటిలో 11,29,642 కేసులను కేంద్ర మంత్రిత్వ శాఖలు పరిష్కరించగా, 4,38,455 కేసులను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పరిష్కరించాయి.
కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాల సగటు పరిష్కార సమయం 2021 లో 32 రోజుల ఉండగా, 2022 లో 27 రోజులకు మెరుగుపడింది. 1,71,509 విజ్ఞప్తులు రాగా వాటిలో 80 శాతం పైగా పరిష్కరించబడ్డాయి. 2022 జూలై - నవంబర్ మధ్య కాలంలో బి.ఎస్.ఎం.ఎల్. కాల్ సెంటర్ నిర్వహించిన అభిప్రాయ సేకరణలో 57,000 ఫిర్యాదులకు ప్రజల నుండి అద్భుతమైన, చాలా మంచి స్పందన లభించింది.
పరిష్కార నాణ్యతను మెరుగు పరిచి, పరిష్కార సమయాన్ని తగ్గించడం కోసం పది దశల సి.పి.జి.ఆర్.ఏ.ఎం.ఎస్. సంస్కరణల ప్రక్రియను అమలు చేయడం జరిగింది.
10-దశల సంస్కరణలు:
(i) సి.పి.జి.ఆర్.ఏ.ఎం.ఎస్. 7.0 సార్వత్రీకరణ - చివరి వరకు ఫిర్యాదుల స్వయంచాలక రూటింగ్
(ii) సాంకేతిక మెరుగుదల - ఏ.ఐ/ఎం.ఎల్. ని ప్రభావితం చేసే అత్యవసర ఫిర్యాదులకు స్వయంచాలకంగా ప్రాధాన్యత ఇవ్వడం
(iii) భాషా అనువాదం - ఆంగ్ల భాషతో పాటు 22 అధికారిక భాషల్లో సి.పి.జి.ఆర్.ఏ.ఎం.ఎస్. పోర్టల్
(iv) ఫిర్యాదుల పరిష్కార సూచిక - వారి పనితీరుపై మంత్రిత్వ శాఖలు / విభాగాల ర్యాంకింగ్
(v) ఫీడ్‌బ్యాక్ కాల్ సెంటర్ - ఫిర్యాదును పరిష్కరించిన ప్రతి పౌరుడి నుండి నేరుగా అభిప్రాయాన్ని సేకరించడానికి 50-మందితో కాల్ సెంటర్
(vi) వన్ నేషన్ వన్ పోర్టల్ - సి.పి.జి.ఆర్.ఏ.ఎం.ఎస్. తో స్టేట్ పోర్టల్ మరియు ఇతర భారత ప్రభుత్వ పోర్టల్ అనుసంధానం
(vii) చేరిక, విస్తరణ - సి.ఎస్.సి. ల ద్వారా ఫిర్యాదులను దాఖలు చేయడానికి మారుమూల ప్రదేశాల్లోని ప్రజలకు అవకాశం కల్పించడం
(viii) శిక్షణ, సామర్థ్య నిర్మాణం - సమర్థవంతమైన ఫిర్యాదుల పరిష్కారాన్ని అందుబాటులోకి తీసుకు రావడం కోసం, సేవోత్తం పథకం కింద ఐ.ఎస్.టి.ఎం. తో పాటు రాష్ట్ర ఏ.టి.ఐ. ల ద్వారా నిర్వహణ
(ix) పర్యవేక్షణ ప్రక్రియ -కేంద్ర మంత్రిత్వ శాఖలు / విభాగాలతో పాటు, రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు రెండింటికీ నెలవారీ నివేదికలు
(x) డేటా స్ట్రాటజీ యూనిట్ - ఇన్‌సైట్‌ఫుల్ డేటా అనలిటిక్స్ కోసం డి.ఏ.ఆర్.పి.జి. లో స్థాపించబడింది
2022 సంవత్సరంలో, మంత్రిత్వ శాఖలు / విభాగాలు ఆగస్టు లో 1.14 లక్షల పీజీ కేసులు, సెప్టెంబర్ లో 1.17 లక్షల పీజీ కేసులు, అక్టోబర్ లో 1.19 లక్షల పీజీ కేసులు, నవంబర్ లో 1.08 లక్షల పీజీ కేసులు పరిష్కరించాయి. సి.పి.జి.ఆర్.ఏ.ఎం.ఎస్. ప్రారంభించిన తర్వాత పి.జి. కేసుల పరిష్కారం నెలకు ఒక లక్ష కేసులు దాటడం ఇదే మొదటిసారి. 2022 సెప్టెంబర్ నుండి సి.పి.జి.ఆర్.ఏ.ఎం.ఎస్. పోర్టల్ ద్వారా రాష్ట్ర పి.జి. కేసుల పరిష్కారం నెలకు 50,000 కేసులు దాటింది. కేంద్ర మంత్రిత్వ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న మొత్తం కేసుల కనిష్ట స్థాయి 0.72 లక్షల కేసులకు తగ్గగా, రాష్ట్రాల్లో 1.75 లక్షల కేసులకు తగ్గింది.
సిబ్బంది, పి.జి., పింఛన్ల మంత్రిత్వ శాఖకు చెందిన పార్లమెంటరీ స్థాయీ సంఘం 2022 డిసెంబరు లో పార్లమెంట్ కు సమర్పించిన 121వ నివేదికలో ప్రజా ఫిర్యాదులు, అప్పీల్ సౌకర్యం, తీసుకున్న తప్పనిసరి చర్యల నివేదిక, ఫీడ్‌బ్యాక్ కాల్ సెంటర్లలో జవాబుదారీతనం తీసుకురావడానికి శాఖాపరంగా తీసుకున్న 10-దశల సంస్కరణ చర్యలను ప్రశంసించింది. దీంతో పాటు, అన్ని అధికారిక భాషల్లో సి.పి.జి.ఆర్.ఏ.ఎం.ఎస్. పోర్టల్ లభ్యతను నిర్ధారించడానికి డి.ఏ.ఆర్.పి.జి. చేస్తున్న కృషిని కూడా పార్లమెంటరీ స్థాయీ సంఘం ప్రశంసించింది.
<><><>
(Release ID: 1885249)
Visitor Counter : 184