ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

త్రిపుర లోని అగర్తలాలో రూ. 4350 కోట్ల విలువైన వివిధ కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం, దేశ ప్రజలకు అంకితం చేసిన ప్రధాన మంత్రి


పిఎమ్ఎవై - పట్టణ , గ్రామీణ పథకాల కింద రెండులక్షల మందికి పైగా లబ్ధిదారులతో గృహ ప్రవేశం కార్యక్రమాన్ని ప్రారంభించిన  ప్రధాన మంత్రి



" మాతా త్రిపుర సుందరి ఆశీర్వాదంతో త్రిపుర అభివృద్ధి ప్రయాణం కొత్త శిఖరాలకు చేరుకుంది" : ప్రధానమంత్రి

"పేదలకు ఇళ్లు నిర్మించడంలో ముందున్న రాష్ట్రాలలోత్రిపుర ఒకటి" " పరిశుభ్రత, మౌలిక సదుపాయాల అభివృద్ధి?పేదలకు గృహ కల్పనలో ఈ రోజు త్రిపుర గురించి చర్చ జరుగుతోంది"

"త్రిపుర మీదుగా ఈశాన్య ప్రాంతం అంతర్జాతీయవాణిజ్యానికి ప్రవేశ ద్వారంగా మారుతోంది" “"ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఈశాన్య రాష్ట్రాల్లోనిగ్రామాల్లో 7 వేలకు పైగా ఆరోగ్య, వెల్ నెస్ సెంటర్ల ఏర్పాటుకు ఆమోదం  "ఇక్కడ స్థానికతను ప్రపంచవ్యాప్తం చేయడానికిప్రయత్నాలు జరుగుతున్నాయి"

Posted On: 18 DEC 2022 6:51PM by PIB Hyderabad

త్రిపుర లోని అగర్తలాలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రూ. 4350 కోట్ల విలువైన వివిధ కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం తో పాటు కొన్నింటిని దేశ ప్రజలకు అంకితం చేశారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన - పట్టణ గ్రామీణ లబ్ధిదారుల కోసం గృహ ప్రవేశ్

కార్యక్రమం , అగర్తలా బైపాస్ (ఖయేర్పూర్ - అమ్తాలి) ఎన్ హెచ్ -08 విస్తరణ కోసం కనెక్టివిటీ ప్రాజెక్టులు, పిఎంజిఎస్ వై - 3 కింద 230 కిలోమీటర్లకు పైగా పొడవైన 32 రహదారులకు శంకుస్థాపనలు, 540 కిలోమీటర్లకు మేర 112 రహదారుల అభివృద్ధి ప్రాజెక్టులు ఈ ప్రాజెక్టులలో ఉన్నాయి. ఆనంద్ నగర్ లో స్టేట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ను, అగర్త ల ప్రభుత్వ దంత వైద్య కళాశాలను ప్రధాన మంత్రి ప్రారంభించారు.

 

ఈ సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, కార్యక్రమం ప్రారంభం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నందుకు హాజరైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. మేఘాలయలో అనేక ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాల కారణంగా తాము రావడం స్వల్ప ఆలస్యం అయినందుకు క్షమాపణలు చెప్పారు.

 

గత ఐదు సంవత్స రాలుగా పరిశుభ్రత కార్యక్రమాలకు సంబంధించి రాష్ట్రంలో చేపట్టిన ప్రశంసనీయమైన కార్యక్రమాల ను ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, త్రిపుర

ప్రజలు పరిశుభ్రత ను ఒక ప్రజా ఉద్యమంగా మార్చారని కొనియాడారు.

ఫలితంగా, ప్రాంతాల వారీగా చిన్న రాష్ట్రాల విషయానికి వస్తే భారతదేశంలోనే అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రంగా త్రిపుర నిలిచిందని, త్రిపుర సుందరి మాతఆశీస్సులతో త్రిపుర అభివృద్ధి ప్రయాణం కొత్త శిఖరాలకు చేరుకుందని ఆయన అన్నారు.

 

అనుసంధానం, నైపుణ్యాల అభివృద్ధి, పేదల ఇంటికి సంబంధించి నేడు ప్రారంభమైన పథకాలకు గానూ త్రిపుర

ప్రజలను ప్రధాన మంత్రి అభినందించారు. త్రిపురలో తొలి దంత వైద్య కళాశాల అందుబాటులోకి వ స్తోంది" అని ప్రధాన మంత్రి అన్నారు. త్రిపుర యువతకు రాష్ట్రం విడిచి వెళ్లాల్సిన అవసరం లేకుండా డాక్టర్లు కావడానికి అవకాశం లభించ గలదని

ప్రధాన మంత్రి అన్నారు. నేడు రాష్ట్రానికి చెందిన రెండు లక్షల మందికి పైగా పేదలు తమ కొత్త పక్కా ఇళ్లలో గృహ ప్రవేశం చేస్తున్నారని, ఈ ఇళ్ల యజమానులు మన తల్లులు, సోదరీమణులు అని ఆయన తెలిపారు.

మొట్ట మొదటిసారిగా గృహ యజమానులు కాబోతున్న మహిళలకు

ప్రధాన మంత్రి అభినందనలు తెలిపారు. "పేదలకు ఇళ్ళు నిర్మించడంలో త్రిపుర

ప్రముఖ రాష్ట్రంగా ఉంది" అని అంటూ శ్రీ మాణిక్ సాహా ఆయన బృందం చేసిన కృషిని ప్రధానమంత్రి ప్రశంసించారు.

వేదిక వద్దకు వెళ్లే సమయంలో వేలాది మంది మద్దతుదారుల నుంచి తనకు లభించిన ఆత్మీయ స్వాగతం గురించి కూడా ఆయన ప్రస్తావించారు.

 

త్రిపురతో సహా అన్ని ఈశాన్య రాష్ట్రాల భవిష్యత్తు అభివృద్ధికి సంబంధించిన రోడ్ మ్యాప్ పై జరిగిన చర్చలపై ప్రధాని ఈ రోజు ఉదయం తాము షిల్లాంగ్ లో హాజరైన నార్త్ ఈస్ట్రన్ కౌన్సిల్ సమావేశం గురించి ప్రస్తావించారు. ' అస్ట్ లక్ష్మి' లేదా ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి 'అష్ట్ ఆధార్' లేదా ఎనిమిది కీలక అంశాలను గురించి ఆయన వివరించారు. త్రిపుర లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం గురించి ప్రధాన మంత్రి

ప్రస్తావిస్తూ, రాష్ట్రంలో అభివృద్ధి

కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు నిరంతరం ప్రయత్నాలు

జరుగుతున్నాయని చెప్పారు.

 

డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రాక ముందు ఈశాన్య రాష్ట్రాల గురించి ఎన్నికల సమయంలోనూ, హింసాత్మక ఘటనలు జరిగిన సమయంలో మాత్రమే మాట్లాడుకునేవారని ప్రధాన మంత్రి గుర్తు చేశారు. త్రిపురలో ఈ నాడు పరిశుభ్రత, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పేదలకు ఇళ్ల నిర్మాణంపై చర్చ జరుగుతోందని ఆయన అన్నారు.

మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని, క్షేత్రస్థాయిలో ఫలితాలను చూపించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దీనిని సాధ్యం చేస్తోందని ఆయన అన్నారు. ‘’గత ఐదేళ్లలో త్రిపురలోని అనేక గ్రామాలకు రహదారి కనెక్టివిటీ లభించిందని, త్రిపురలోని అన్ని గ్రామాలను రహదారుల ద్వారా అనుసంధానించడానికి ఇప్పటికే వేగవంతమైన పనులు జరుగుతున్నాయని’’ ఆయన చెప్పారు.

ఈ రోజు పునాది రాయి వేసిన పథకాల ద్వారా రాష్ట్ర రహదారుల నెట్ వర్క్ ను మరింత బలోపేతం కాగలదని, రాజ ధానిలో ట్రాఫిక్ ను సులభతరం

చేయగలదని, జీవితాలను సులభతరం చేస్తుందని ప్రధాన మంత్రి అన్నారు.

 

అగర్తలా-అఖౌరా రైలు మార్గం, ఇండియా-థాయ్ లాండ్-మయన్మార్ హైవే మౌలిక సదుపాయాలతో తెరుచుకోబోయే కొత్త మార్గాల గురించి తెలియజేస్తూ, త్రిపుర మీదుగా ఈశాన్య ప్రాంతం అంతర్జాతీయ వాణిజ్యానికి ఒక ప్రవేశ ద్వారంగా మారుతోంది" అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. అగర్తలాలోని మహారాజా బీర్ బిక్రమ్ విమానాశ్రయంలో అంతర్జాతీయ టెర్మినల్ నిర్మాణంతో కనెక్టివిటీ ఊపందుకుందని ఆయన అన్నారు. తత్ఫలితంగా, త్రిపుర ఈశాన్యంలో ఒక ముఖ్యమైన లాజిస్టిక్స్ హబ్ గా అభివృద్ధి చెందుతోంది. త్రిపుర లో నేటి యువతకు ఇంటర్నెట్ అనుసంధానాన్ని అందుబాటులోకి తేవడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రధాన మంత్రి వివరించారు. త్రిపురలోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వ కృషి వల్లే ఇప్పుడు అనేక పంచాయతీలు ఆప్టికల్ ఫైబర్ తో అనుసంధానమయ్యాయని ఆయన అన్నారు.

 

సామాజిక మౌలిక సదుపాయాలను

బలోపేతం చేయడానికి రెండు ఇంజిన్

ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ఆయుష్మాన్ భారత్

పథకం కింద ఈశాన్య రాష్ట్రాల గ్రామాల లో ఏడు వేలకు పైగా ఆరోగ్య , స్వస్థత కేంద్రాలకు ఆమోదం లభించిందని

ప్రధాన మంత్రి చెప్పారు."త్రిపురలో ఇలాంటి వెయ్యి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా ఆయుష్మాన్ భారత్-పీఎం జయ్ పథకం కింద త్రిపురలోని వేలాది మంది పేద ప్రజలకు రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స సౌకర్యం లభించిందని’’ తెలిపారు.''మరుగుదొడ్లు, విద్యుత్ లేదా గ్యాస్ కనెక్షన్లు ఇలా అన్ని రకాల పనులు చేయడం ఇదే తొలిసారి'' అని శ్రీ మోదీ చెప్పారు. చౌక ధరలకు పైప్ గ్యాస్ ను తీసుకురావడానికి, ప్రతి ఇంటికి పైపుల ద్వారా నీటిని అందించడానికి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వేగంగా పనిచేస్తోందని ఆయన అన్నారు. త్రిపుర లోని నాలుగు లక్షల కొత్త కుటుంబాలు

కేవలం మూడు సంవత్సరాలలో కుళాయిల ద్వారా నీటి సదుపాయాలను పొందాయని ప్రధాన మంత్రి

వివరించారు.

 

త్రిపుర లో లక్ష మందికి పైగా గర్భిణులకు లబ్ధి చేకూర్చిన ప్రధాన మంత్రి మాతృ వందన యోజన కింద పౌష్టికాహారం కోసం ప్రతి తల్లి బ్యాంకు ఖాతాలోకి నేరుగా వేలాది రూపాయలు జమ అయ్యాయని ప్రధాన మంత్రి వివరించారు. తత్ఫలితంగా, ఈ రోజు ఆసుపత్రులలో ఎక్కువ ప్రసవాలు జరుగుతున్నాయని, తల్లీబిడ్డల ప్రాణాలను కాపాడుతున్నారని ఆయన అన్నారు.

 

మన తల్లులు,సోదరీమణులకు

ఆత్మనిర్భ ర భారత్ (స్వావలంబన ) గురించి ప్రధాన మంత్రి ప్ర స్తావిస్తూ,

మహిళల ఉపాధి కోసం ప్రభుత్వం వందల కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని విడుదల చేసిందని తెలిపారు. త్రిపురలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వచ్చాక మహిళా స్వయం సహాయక సంఘాల సంఖ్య తొమ్మిది రెట్లు పెరిగిందని ఆయన ప్రశంసించారు.

 

"దశాబ్దాలుగా త్రిపురను భావజాలం ప్రాముఖ్యతను కోల్పోయి అవకాశవాద రాజకీయాలు చేసే పార్టీలు పాలించాయి. ఫలితంగా త్రిపుర అభివృద్ధికి దూరమైంది’’అని ప్రధాన మంత్రి అన్నారు. పేదలు, యువత, రైతులు, మహిళలు ఎక్కువగా దీని బారిన పడ్డారని ఆయన అన్నారు. ఈ రకమైన భావజాలం, ఈ రకమైన మనస్తత్వం ప్రజలకు ప్రయోజనం చేకూర్చదని

పేర్కొన్నారు. ‘’వారికి ప్రతికూలతను ఎలా వ్యాప్తి చేయాలో మాత్రమే తెలుసు వారికి ఎటువంటి సానుకూల ఎజెండా లేదు " అని ఆయన అన్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం సంకల్పాన్ని కలిగి ఉందని, అలాగే సాధించడానికి సానుకూల మార్గాన్ని కలిగి ఉందని ఆయన అన్నారు.

 

అధికార రాజకీయాల వల్ల మన గిరిజన సమాజాలకు కలిగే గొప్ప నష్టాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, గిరిజన సమాజం ,గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి లేకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు.

"బిజెపి ఈ రాజకీయాలను మార్చింది, అందుకే అది గిరిజన సమాజం మొదటి ఎంపికగా మారింది" అని అన్నారు. ఇటీవల గుజరాత్ ఎన్నికలను గుర్తు చేసుకున్న ప్రధాన మంత్రి, 27 సంవత్సరాల తరువాత కూడా బిజెపి భారీ విజయానికి గిరిజన సమాజం అందించిన సహకారాన్ని ప్రశంసించారు.

గిరిజనులకు రిజర్వ్ చేసిన 27

సీట్లలో 24 స్థానాలను బిజెపి గెలుచుకుందని ఆయన చెప్పారు.

 

ఆదివాసి సముదాయాల అభ్యున్నతి కోసం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ఆదివాసుల కు ప్రత్యేక మంత్రిత్వ శాఖను, ప్రత్యేక

బడ్జెట్ ను ఏర్పాటు చేసినది అటల్ జీ

ప్రభుత్వం అని గుర్తు చేశారు. గిరిజనుల కోసం రూ.21 వేల కోట్లుగా ఉన్న బడ్జెట్ నేడు రూ.88 వేల కోట్లకు చేరుకుందని చెప్పారు. గిరిజన విద్యార్థుల ఉపకార వేతనాలు కూడా రెట్టింపు అయ్యాయని ప్రధాన మంత్రి తెలియజేశారు.’’2014కు ముందు గిరిజన ప్రాంతాల్లో 100 కంటే తక్కువ ఏకలవ్య మోడల్ స్కూళ్లు ఉండేవి. ఈ నాడు ఆ సంఖ్య 500 కి పైగా ఉంది. త్రిపుర లో కూడా ఇలాంటి 20 కి పైగా స్కూళ్ల కు ఆమోదం లభించింది" అని ప్రధాన మంత్రి వివరించారు.

గత ప్రభుత్వాలు 8-10 అటవీ ఉత్పత్తులకు మాత్రమే ఎం ఎస్ పి ఎంఎస్పి ఇచ్చేవని, బిజెపి ప్రభుత్వం 90 అటవీ ఉత్పత్తులకు ఎం ఎస్ పి ఇస్తోందని ఆయన చెప్పారు. ప్రస్తుతం గిరిజన ప్రాంతాల్లో 50,000కు పైగా వాన్ ధన్ కేంద్రాలు ఉన్నాయని, ఇవి సుమారు తొమ్మిది లక్షల మంది గిరిజనులకు ఉపాధి కల్పిస్తున్నాయని, వారిలో ఎక్కువ మంది మహిళలు ఉన్నారని ఆయన అన్నారు.

 

గిరిజనుల ఆత్మ గౌరవాన్నిబిజెపి ప్రభుత్వం అర్థం చేసుకుందని, అందుకే బిర్సా ముండా జన్మదినాన్ని నవంబర్ 15 న దేశవ్యాప్తంగా జన్ జాతీయ గౌరవ్ దివస్ గా జరుపుకోవడం ప్రారంభించిందని ప్రధాన మంత్రి అన్నారు. దేశ వ్యాప్తంగా 10 గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల మ్యూజియాలు ఏర్పాటు అవుతున్నాయని, త్రిపురలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల మహారాజా బీరేంద్ర కిశోర్ మాణిక్య మ్యూజియం , కల్చరల్ సెంటర్ కు పునాదిరాయి వేశారని చెప్పారు. త్రిపుర ప్రభుత్వం కూడా గిరిజన సహకారం ,సంస్కృతిని ప్రోత్సహించడానికి నిరంతర ప్రయత్నాలు చేస్తోందని, త్రిపుర గిరిజన కళ, సంస్కృతిని ముందుకు తీసుకువెళ్ళిన వ్యక్తులకు పద్మ సమ్మాన్ ఇస్తుందని చెప్పారు.

 

త్రిపుర లోని చిన్న రైతులు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు మెరుగైన

అవకాశాలను కల్పించడం కోసం డబుల్ ఇంజిన్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని

ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు. "ఇక్కడ స్థానికతను ప్రపంచవ్యాప్తం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి" అన్నారు. త్రిపుర నుండి పైనాపిల్ విదేశాలక

చేరుకోవడాన్ని శ్రీ మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘’అంతే కాదు, ఇక్కడ నుండి వందలాది మెట్రిక్ టన్నుల ఇతర పండ్లు, కూరగాయలు బంగ్లాదేశ్, జర్మనీ, దుబాయ్లకు ఎగుమతి చేయబడ్డాయి, ఫలితంగా రైతులు తమ ఉత్పత్తులకు అధిక ధరలను పొందుతున్నారు’’ అని చెప్పారు. త్రిపురకు చెందిన లక్షలాది మంది రైతులు ఇప్పటివరకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి నుండి రూ .500 కోట్లకు పైగా పొందారని ఆయన అన్నారు. త్రిపుర లోని అగర్-కలప పరిశ్రమను కూడా ఆయన ప్రస్తావించారు. ఇది త్రిపుర యువతకు కొత్త అవకాశాలు , ఆదాయ వనరుగా మారుతుందని అన్నారు.

 

ప్రసంగాన్ని ముగిస్తూ ప్రధాన మంత్రి, త్రిపుర ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధి ద్వంద్వ చోదక శక్తి ఆవిర్భవించడంతో శాంతి, అభివృద్ధి పథంలో

పయనిస్తోందని పేర్కొన్నారు. 'త్రిపుర ప్రజల సామర్థ్యంపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ విశ్వాసంతో మేము అభివృద్ధి ప్రక్రియ ను మరింత వేగవంతం చేస్తాము, మీ అందరికీ అనేక అభినందనలు" అని అన్నారు.

 

త్రిపుర ముఖ్యమంత్రి ప్రొఫెసర్ (డాక్టర్) మాణిక్ సాహా, త్రిపుర గవర్నర్ శ్రీ సత్యదేవ్ నారాయణ్ ఆర్య, త్రిపుర ఉపముఖ్యమంత్రి శ్రీ జిష్ణు దేవ్ వర్మ ,కేంద్ర సహాయ మంత్రి ప్రతిమా భూమిక్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

నేపథ్యం

 

ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు ఉండేలా

చూడడంపై ప్రధాన మంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ప్రాంతంలో దీనిని నిర్ధారించడానికి ఒక కీలకమైన చర్యగా, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన - పట్టణ, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన - గ్రామీణ లబ్ధిదారుల కోసం గృహ ప్రవేశ్ కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి ప్రారంభించారు. 3400 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేసిన ఈ గృహాల ను రెండు లక్షల మందికి పైగా లబ్ధిదారులకు కేటాయించారు.

 

రహదారి అనుసంధానాన్ని మెరుగు

పరచడంపై దృష్టి సారించిన ప్రధాన మంత్రి అగర్తలా నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు తోడ్పడే అగర్తలా బైపాస్ (ఖైర్ పూర్ - అమ్తాలి) ఎన్ హెచ్-08 ను వెడల్పు చేసే ప్రాజెక్టును ప్రారంభించారు.

ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన (పిఎమ్ జిఎస్ వై 3) కింద 230 కిలోమీటర్లకు పైగా పొడవున 32 రహదారులకు, 540 కిలోమీటర్లకు పైగా ఉన్న 112 రోడ్ల అభివృద్ధికి ఆయన శంకుస్థాపన చేశారు. ఆనంద్ నగర్ లో స్టేట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్ మెంట్ ను, అగర్తల ప్రభుత్వ దంత వైద్య కళాశాలను ప్ర ధాన మంత్రి ప్రారంభించారు.


*****

DS/TS

 

 

***

 


(Release ID: 1884717) Visitor Counter : 194