సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
డిసెంబర్ 19-25 మధ్య జరిగే రెండవ సుశాసన్ వారోత్సవాల సందర్భంగా ప్రధాని శుభాకాంక్షలు
“వచ్చే 25 ఏళ్ల అమృత కాలంలో స్వయం సమృద్ధ భారత్ నిర్మాణానికి ప్రజలు ప్రతిన బూనారు”
పాలన ప్రభావాన్ని పెంచుదాం, కానీ, ప్రతి పౌరుని జీవితంలో ప్రభుత్వ జోక్యాన్ని తగ్గిద్దాం”
అనవసరమైన వేలాది నిబంధనలు రద్దు చేయటం, కాలం చెల్లిన వేలాది చట్టాలను తొలగించటం, చిన్న చిన్న ఉల్లంఘనలను నేరాల పరిధినుంచి తప్పించటం లాంటి కీలక చర్యలు తీసుకున్నాం
పౌరుల డిజిటల్ సాధికారత దిశగా. సంస్థల డిజిటల్ పరివర్తనలో మనం బలంగా ముందడుగు వేస్తున్నాం
సుపరిపాలానా వారోత్సవం “సుశాసన్ వారోత్సవం – ప్రశాసనం గ్రామాల దిశగా -2022 పేరిట ప్రచారోద్యమం 2022 డిసెంబర్ 19 న కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రారంభిస్తారు.
ప్రజల సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారం ద్వారా మెరుగైన సేవలకోసం డిసెంబర్ 19-25 మధ్య ఈ జాతీయ స్థాయి ప్రచారోద్యమం జరుగుతుంది
Posted On:
17 DEC 2022 12:22PM by PIB Hyderabad
వచ్చే 25 ఏళ్ల అమృత కాలంలో సుసంపన్నమైన అద్భుత భారతదేశాన్ని నిర్మించటానికి ప్రజలు అంకిత భావంతో ఉన్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రజల అంకిత భావాన్ని అభినందించటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అవకాశాలు పెంచుతూ అవరోధాలు తొలగించటమే ప్రభుత్వ బాధ్యత అని అన్నారు.
2022 డిసెంబర్ 19-25 మధ్య జరిగే రెండవ సుపరిపాలన వారోత్సవం విజయవంతం కావాలంటూ ప్రధాని శుభాకాంక్షలు తెలియజేశారు. “పౌరుడే ప్రథమం అనే సూత్రానికి కట్టుబడి నిబంధనలు, చట్టాలను సరళతరం చేసి మా ప్రభుత్వం పారదర్శకతకు, వేగానికి ఆవిశ్రాంతంగా కృషి చేస్తోంద”ని ఈ సందర్భంగా ఇచ్చిన సందేశంలో పేర్కొన్నారు. పౌరులే కేంద్రంగా ప్రజల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుతవం కృషి చేస్తోందన్నారు. ఆన్ లైన్ సేవలు, దరఖాస్తుల పరిష్కారం వేగవంతం చేయటం, సుపరిపాలనకు కట్టుబడ్డామన్నారు. అందరికీ సేవలందించాలన్న దార్శనికత వలన ఆ సేవల అందుబాటు సమర్థవంతంగా ఉంటోందన్నారు.
పరిపాలన ప్రభావం ఎక్కువగా ఉండేలా చూడటం తమ లక్ష్యమని ప్రధాని స్పష్టం చేశారు. అదే సమయంలో జోక్యాన్ని సాధ్యమైనంతగా తగ్గిస్తామన్నారు. వేలాది అనవసరపు నిబంధనలు, కాలం చెల్లిన చట్టాలు తొలగించి, చిన్న చిన్న తప్పిదాలను నేరాల జాబితా నుంచి తొలగించామన్నారు.
ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేయటంలో టెక్నాలజీ పాత్ర చాలా గొప్పదని, పౌరులను సాధికారం చేయటంలో టెక్నాలజీ శక్తిమంతమైన పనిముట్టుగా మారిందని ఈ సందర్భంగా ప్రధాని వ్యాఖ్యానించారు. పారదర్శకతకు, జవాబుదారీతనానికి రోజువారీ పనిలో ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తు చేశారు. విధాన పరమైన నిర్ణయాల ద్వారా మనం శక్తిమంతంగా డిజిటల్ సాధికార దిశగా వెళుతున్నామన్నారు. గ్రామాల దిశగా ప్రశాసనం పేరిట ఈ ఏడాది కూడా సుపరిపాలనలో భాగం కావటం సంతోషకరమన్నారు. ఈ వారోత్సవాల సందర్భంగా ప్రధాని తన శుభాకాంక్షలు తెలియజేశారు.
సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి ( స్వతంత్ర ప్రతిపత్తి), ప్రధాని కార్యాలయంలో సహాయ మంత్రి, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి, అణుశక్తి శాఖామంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ 19 న ఢిల్లీ విజ్ఞాన భవన్ లో జరిగే ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. పాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం, సిబ్బంది, పెన్షన్ల మంత్రిత్వశాఖ 2022 డిసెంబర్ 19 నుంచి 25 దాకా సుపరిపాలనావారోత్సవాలు జరుగుతాయి. దేశవ్యాప్తంగా అన్నీ తాలూకాలు, జిల్లాలలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. అందులో పురోగతిని www.pgportal.gov.in/GGW22 పోర్టల్ లో జిల్లా కలెక్టర్లు నివేదిస్తారు.
ఈ ప్రచారోద్యమం ఈ దిగువ అంశాల మీద దృష్టి సారిస్తుంది:
సిపిగ్రామ్స్ లో వచ్చిన పెండింగ్ ప్రజా ఫిర్యాదుల పరిష్కారం
రాష్టఱయల పోరటల్స్ లో ఉన్న ప్రజా ఫిర్యాదుల పరిష్కారం
ఆన్ లైన్ సేవలలో జోడించిన అదనపు సేవలు
సర్వీస్ డెలివరీ దరఖాస్తుల పరిష్కారం
సుపరిపాలనా విధానాలను వినియోగించుకోవటం
ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో ఒక్కో జిల్లాకు కనీసం ఒక్కో విజయగాథను పంచుకోవటం
సుశాసన వారోత్సవాలలో భాగంగా 2022 డిసెంబర్ 23 న సుపరిపాలనా విధానాలమీద న్యూ ఢిల్లీ విజ్ఞాన భవన్ లో వర్క్ షాప్ జరుగుతుంది. కాబినెట్ కార్యదర్శి ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ వర్క్ షాప్ లోనే ప్రత్యేక ప్రచారోద్యమం 2.0 అంచనా నివేదిక ను విడుదల చేస్తారు. .
***
(Release ID: 1884651)
Visitor Counter : 175