ప్రధాన మంత్రి కార్యాలయం
9వ ప్రపంచ ఆయుర్వేద కాంగ్రెస్ ముగింపు సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీనరేంద్రమోదీ
మూడు జాతీయ ఆయుష్ సంస్థలను ప్రారంభించిన ప్రధానమంత్రి
ప్రపంచం మొత్తంచే అంతర్జాతీయ ఆరోగ్య , వెల్‌నెస్ ఉత్సవంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం.
జాతీయ ఆయుష్ రిసెర్చ్ కన్సార్టియం ఏర్పాటు దిశగా ముందుకు వెళుతున్న మనం. 8 సంవత్సరాల క్రితం ఆయుష్ పరిశ్రమ 20 వేల కోట్ల రూపాయలు ఉండగా, ప్రస్తుతం 1.5 లక్షల కోట్లరూపాయలకు చేరింది.
సంప్రదాయవైద్య రంగం నిరంతరాయంగా విస్తృత మవుతోంది.ఈ అవకాశాన్ని మనం పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి.
ఒకే భూమి, ఒకే ఆరోగ్యం అంటే ఆరోగ్యానికి సంబంధించి విశ్వదార్శనికత ప్రధానమంత్రి శ్రీనరేంద్రమోదీ , 9వ ప్రపంచ ఆయుర్వేద కాంగ్రెస్ ముగింపుసమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మూడు నేషనల్ ఆయుష్ సంస్థలను ప్రారంభించారు.
Posted On:
11 DEC 2022 5:58PM by PIB Hyderabad
ఆ మూడు జాతీయ సంస్థల పుర్లఉ ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆప్ ఆయుర్వేద (ఎఐఐఎ), గోవా, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యునాని మెడిసిన్ ((ఎన్ ఐయుఎం), ఘజియాబాద్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోమియో పతి ((ఎన్ ఐహెచ్ ) ఢల్లీి. ఇవి పరిశోధనను మరింత బలోపేతం చేయడంతో పాటు, అంతర్జాతీయ కొలాబరేషన్లకు వీలుకల్పిస్తాయి. ఇవి ప్రజలకు అందుబాటు ధరలో ఆయుష్ సేవలను అందించనున్నాయి.సుమారు 970 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ సంస్థల ద్వారా అదనంగా 400 మంది విద్యార్థులను చేర్చుకోవడానికి వీలు కలగడం తోపాటు, 500 పడకలు అదనంగా సమకూరనున్నాయి.
9 వప్రపంచ ఆయుర్వేద కాంగ్రెస్‌కు , ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలనుంచి హాజరైన వారినుద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి, సుందరప్రదేశమైన గోవాలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి హాజరైన వారికి స్వాగతం పలికారు. ప్రపంచ ఆయుర్వేద కాంగ్రెస్ విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరినీ ప్రధానమంత్రి అభినందించారు.
ఆజాది కా అమృత్ కాల్ సమయంలో ప్రపంచ ఆయుర్వేద కాంగ్రెస్ జరుగుతున్న విషయాన్ని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు.
భారతీయ శాస్త్ర విజ్ఞానం, సాంస్కృతిక అనుభవం ద్వారా ప్రపంచ సంక్షేమాన్ని కాంక్షించడం ఆజాదీ కా అమృత్ కాల్ కీలక తీర్మానాలలో ఒకటని,
ఇందుకు ఆయుర్వేదం ఒక బలమైన మాధ్యమమని ప్రధానమంత్రి అన్నారు. ఇండియా జి–20 అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడం గురించి ప్రస్తావిస్తూ,
జి–20 థీమ్ ఒకే ధరిత్రి ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు గురించి ప్రస్తావించారు.
ఆయుర్వేదానికి సంప్రదాయ వైద్య విధానంగా 30 దేశాలు గుర్తింపునివ్వడం పట్ల ప్రధానమంత్రి సంతోషం వ్యక్తం చేశారు.ఆయుర్వేదానికి మరింత విస్తృత గుర్తింపు తెచ్చేందుకు నిరంతర పరిశోధన అవసరమన్నారు. ఇవాళ ప్రారంభమైన మూడు జాతీయ సంస్థలు ఆయుష్ ఆరోగ్య వ్యవస్థకు మరింత ఊపునిస్తాయని ఆయన అన్నారు.
ఆయుర్వేదానికి సంబంధించిన తాత్విక చింతనను ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, ఆయుర్వేదం చికిత్సకు మించి, స్వస్థతను పెంపొందిస్తుందని అన్నారు.
ప్రపంచం వివిధ మార్పుల అనంతరం ఈ ప్రాచీన జీవన విధానం వైపు మళ్లుతున్నదని అన్నారు.ఆయుర్వేదానికి సంబంధించి ఎంతో కృషి ఇండియాలో జరుగుతున్నదని ఆయన అన్నారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలాన్ని గుర్తుచేసుకుంటూ ప్రధానమంత్రి, ఆయుర్వేదానికి సంబంధించిన సంస్థలను తాను ప్రోత్సహించినట్టు , గుజరాత్ ఆయుర్వేద విశ్వవిద్యాలయం పురోభివృద్ధికి కృషి చేసినట్టు తెలిపారు.ఫలితంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ సంప్రదాయ వైద్యవిధానానికి సంబంధించి ప్రపంచంలోనే తొట్టతొలి అంతర్జాతీయ కేంద్రాన్ని జామ్నగర్ లో నెలకొల్పిందని తెలిపారు. ప్రస్తుత తమ ప్రభుత్వం ఆయుష్కు ప్రత్యేకంగా మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసిందని, దీనితో ఆయుర్వేదం పట్ల ఆసక్తి, నమ్మకం పెరిగాయన్నారు. ఎయిమ్స్ తరహాలో ఆలిండియా ఇన్స్టిట్టూట్ ఆఫ్ ఆయుర్వేదను కూడా నెలకొల్పనున్నట్టు తెలిపారు.
అంతర్జాతీయ ఆయుష్ ఆవిష్కరణలు, పెట్టుబడుల సమ్మేళనం ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన విషయాన్ని ప్రధానమంత్రి గుర్తుచేశారు. సంప్రదాయ
వైద్యవిధానాన్ని ఇండియా ప్రోత్సహిస్తుండడం పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసలు కురిపించిందని ఆయన అన్నారు.అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచం అంతర్జాతీయ ఆరోగ్య, స్వస్థత ఉత్సవంగా జరుపుకుంటున్నదని ప్రధానమంత్రి తెలిపారు. ఒకప్పుడు యోగాను చిన్నచూపు చూశారని, కానీ ఇప్పుడు ఇది , ప్రపంచ మానవాళికి ఆశా కిరణంగా మారిందని అన్నారు.
ప్రస్తుత ప్రపంచంలో ఆయుర్వేదకు అంగీకారం, దానిని క్రమంగా ముందుకు తీసుకుపోవడం విషయంలో అంతర్జాతీయ ఒప్పందాలలో జరుగుతున్న జాప్యాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు.
ఆధునిక విజ్ఞానం , సాక్ష్యాధారాల ను కోరుకుంటుందని, అందువల్ల ఆయుర్వేదానికి సంబంధించి డాటా ఆధారిత సాక్ష్యాలను రూపొందించేందుకు నిరంతర కృషి జరగాలన్నారు. ఆయుర్వేద ఫలితాలు , దాని ప్రభావం సానుకూలంగా ఉందని అయితే ఇందుకు సంబంధించిన ఆధారాలను మనం రికార్డు చేయడలో వెనుకబడుతున్నామని ఆయన అన్నారు.మన వైద్య సమాచారం, ఫలితాలు, పరిశోధనలు, వైద్య పత్రికలను ఆధునిక వైద్య విజ్ఞాన ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించాల్సి ఉందని ఆయన అన్నారు.
ఈ దిశగా జరుగుతున్న ప్రయత్నాలను ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, పరిశోధన సాక్ష్యాధారిత సమాచారం కోసం ఆయుష్ రిసెర్చ్ పోర్టల్ను రూపొందించినట్టు చెప్పారు.ఇప్పటివరకు సుమారు 40 వేల పరిశోధన అధ్యయనాలకు సంబంధించిన సమాచారం ఇందులో నిక్షిప్తమై ఉందని ఆయన అన్నారు. కరోనా సమయంలో మనం ఆయుష్ కు సంబంధించి 150 పరిశోధన, అధ్యయనాలను చేశామని తెలిపారు. మనం ఇప్పుడు నేషనల్ ఆయుష్ రిసెర్చ్ కాన్సార్టియం ఏర్పాటు దిశగా ముందుకు వెళుతున్నామని ప్రధానమంత్రి తెలిపారు. ఆయుర్వేద ఒక జీవన విధానం కూడా అని చెబుతూ ప్రధానమంత్రి ఒక యంత్రాన్నిగాని, కంప్యూటర్ ను గానీ ఉపయోగించడం తెలియనివ్యక్తివల్ల ఆయంత్రం లేదా పరికరం సక్రమంగా పనిచేయదని అంటూ, శరీరము, మనసు రెండూ ఆరోగ్యవంతంగా ఉండాలని ఆయుర్వేద మనకు బోధిస్తుందని ఆయన అన్నారు. ఆయుర్వేద ప్రత్యేకత గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, తగినంత నిద్ర ఉండాలన్నది వైద్‌య విజ్ఞానంలో ఇప్పుడు చర్చగా మారిందని అన్నారు.
భారతదేశానికి చెందిన ఆయుర్వేద నిపుణులు ఈ విషయం గురించి శతాబ్దాల క్రితమే సవివరంగా రాశారని ప్రధానమంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు.ఆయుర్వేద రంగంలో ఇప్పుడు ఎన్నో అవకాశాలున్నాయని ప్రధానమంత్రి చెప్పారు. మూలికలను పెంచడం, ఆయుర్వేద ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్, డిజిటల్ సేవలు తదితరాలు ఇందులో ఉన్నాయన్నారు. ఆయుష్ స్టార్టప్లకు అద్భుత అవకాశాలు ఉన్నాయన్నారు. ఆయుర్వేద రంగంలో అవకాశాల గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ,ఆయుష్ రంగంలో సుమారు 40,000 ఎంఎస్ఎంఇ లు క్రియాశీలంగా పనిచేస్తున్నాయన్నారు. 8 సంవత్సరాల క్రితం 20 వేల కోట్ల రూపాయలున్న ఆయుష్ పరిశ్రమ ప్రస్తుతం 1.5 లక్షల కోట్ల రూపాయలకు ఎదగిందన్నారు. అంటే ఏడు నుంచి 8 సంవత్సరాలలో ఆయుర్వేద రంగం 7 రెట్లు పెరిగినట్టు అని ఆయన అన్నారు. అంతర్జాతీయంగా ఈ రంగం వృద్ధి గురించి కూడా ప్రధానమంత్రి ప్రస్తావించారు. హెర్బల్ మెడిసిన్, సుగంధద్రవ్యాలకు సంబంధించి ప్రస్తుతం ప్రపంచ మార్కెట్ సుమారు 120 బిలియన్ డాలర్లుల లేదా 10 లక్షల కోట్ల రూపాయలుగా ఉందని చెప్పారు. ఈ సంప్రదాయ వైద్యం నిరంతరం విస్తరిస్తుననదని ప్రధానమంత్రి చెప్పారు. ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి, రైతులకు నూతన వ్యవసాయ అవకాశాలు లభిస్తున్నాయని, ఈ రంగంలో వారు మంచి ధర పొందేందుకు అవకాశం ఉందన్నారు. ఈ రంగంలో వేలు, లక్షలాది ఉద్యోగాలు యువతకు సృష్టించనున్నట్టు తెలిపారు.
ఆయుర్వేద, యోగా లలో పర్యాటక అవకాశాలను గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, ప్రత్యేకించి గోవా వంటి రాష్ట్రంలో ఇందుకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయన్నారు. ఆలిండియా ఇన్ స్టిట్టూట్ ఆఫ్ ఆయుర్వేద (ఎఐఐఎ)గోవా, ఈ దిశగా కీలక ప్రారంభం కాగలదని ప్రధానమంత్రి అన్నారు.
భారతదేశం ప్రపంచం ముందుకు తీసుకువచ్చిన ఒకే ధరిత్రి, ఒకే ఆరోగ్యం అనే భవిష్యత్ దార్శనికత గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, ఇది ప్రపంచ ఆరోగ్య దార్శనికత అని ఆయన అన్నారు. సముద్ర జంతుజాలమైనా, వన్యప్రాణులైనా, మానవులు, వృక్ష జీవజంతుజాలమైనా వీటి ఆరోగ్యం ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటుందని
ప్రధానమంత్రి చెప్పారు. వీటిని వేటికవి వేరు వేరుగా చూడడం కాక, వీటన్నింటినీ ఒకదానితో ఒకటి సంబంధం కలిగిన అంశాలుగా సంపూర్ణంగా చూడాలని అన్నారు. ఆయుర్వేద సంపూర్ణ దార్శనికత భారతీయ జీవన విధానంలో ఇమిడి ఉన్నదని చెప్పారు. ఆయుర్వేద కాంగ్రెస్ ఆయుష్ను ఆయుర్వేదాన్ని సమగ్రంగా ముందుకు తీసుకుపోవడంపై న అందుకు మార్గ సూచిపై న చర్చించాలని ప్రధానమంత్రి అన్నారు.
గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్, గోవా గవర్నర్ శ్రీ పి.ఎస్.శ్రీధరన్ పిళ్లై, కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి శ్రీ శర్వానంద్ సోనోవాల్, కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ముంజపార మహేంద్ర భాయ్, కేంద్ర సాంసృకతిక, పర్యాటకశాఖ సహాయమంత్రి శ్రీ శ్రీపాద యశో నాయక్, విజ్ఞాన భారత్ అధ్యక్షుడు డాక్టర్ శేఖర్ మండే తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
నేపథ్యం:
ప్రపంచ ఆయుర్వేద కాంగ్రెస్ 9 వ ఎడిషన్, ఆరోగ్య ఎక్స్పోలో 50 కిపైగా దేశాలనుంచి 400 మంది విదేశీ ప్రతినిధులు హాజరయ్యారు. ఇందులో అంతర్జాతీయ విద్యార్థులు,ఆయర్వేదానికి సంబంధించి వివిధ స్టేక్ హోల్డర్లు, ఉన్నారు. 9 వ ప్రపంచ ఆయుర్వేద కాంగ్రెస్ థీమ్ ఆయుర్వేద ఫర్ వన్ హెల్త్.
ఈ సమావేశాల సందర్భంగా మూడు ప్రముఖ సంస్థలు, ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (ఎఐఐఎ),గోవా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆప్ యునాని మెడిసిన్,ఘజియాబాద్, నేషనల్ ఇన్స్టిట్టూట్ ఆఫ్ హోమియో పతి,ఢిల్లీ పరిశోధన,అంతర్జాతీయ కొలాబరేషన్లు ప్రజలకు అందుబాటులో ఆయుష్ సేవలను అందిచేందుకు కృషి చేయనున్నాయి. వీటిని 970 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేయడం జరిగింది.
ఈ సంస్థల వల్ల మరో 400మంది విద్యార్థులు వీటిలో చేరేందుకు అవకాశం కలుగుతుంది. అలాగే మరో 500 హాస్పిటల్ బెడ్ లు అందుబాటులోకి వస్తాయి.
*****
DS/TS
(Release ID: 1883016)
Visitor Counter : 193
Read this release in:
Tamil
,
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Malayalam