ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మహాపరినిర్వాణ్ దివస్ నాడు డాక్టర్ శ్రీ బాబాసాహెబ్ ఆంబేడ్ కర్  కు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 06 DEC 2022 9:44AM by PIB Hyderabad

మహాపరినిర్వాణ్ దివస్ నాడు డాక్టర్ శ్రీ బాబాసాహెబ్ ఆంబేడ్ కర్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని ఘటించడం తో పాటు గా మన దేశ ప్రజల కు శ్రీ బాబాసాహెబ్ అందించినటువంటి మార్గదర్శక ప్రాయమైన సేవ ను కూడా స్మరించుకొన్నారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘మహాపరినిర్వాణ్ దివస్ సందర్భం లో డాక్టర్ శ్రీ బాబాసాహెబ్ ఆంబేడ్ కర్ కు నేను శ్రద్ధాంజలి ని ఘటించడం తో పాటు గా మన దేశ ప్రజల కు ఆయన అందించినటువంటి మార్గదర్శక ప్రాయమైన సేవ ను కూడా గుర్తు కు తెచ్చుకొంటున్నాను. ఆయన సలిపినటువంటి సంఘర్షణ లు లక్షల కొద్దీ ప్రజల లో ఆశ ను రేకెత్తించాయి; అంతేకాదు, భారతదేశాని కి అత్యంత విస్తృత రాజ్యాంగాన్ని ఇవ్వడం కోసం ఆయన పూనుకొని చేసినటువంటి ప్రయాసల ను ఎన్నటికీ మరపురానటువంటివి.’’ అని పేర్కొన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 1881105) సందర్శకుల సూచీ సంఖ్య : : 279