జౌళి మంత్రిత్వ శాఖ

మన హస్తకళాకారులు ప్రపంచానికి భారత వారసత్వ రాయబారులు, , మన సంస్కృతికి వెలుగు దీపికలు: గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ జగదీప్ ధన్ కర్


పెట్టుబడులు, అవకాశాలకు ప్రపంచవ్యాప్తంగా మనది అత్యంత అనుకూలమైన గమ్యస్థానం: ఉపరాష్ట్రపతి

ప్రపంచంతో భాగస్వామ్యం నెరపడంలో స్వావలంబన, ఆత్మవిశ్వాసం కలిగిన భారతదేశానికి హస్తకళలు , చేనేత మూలస్తంభం: కేంద్ర మంత్రి శ్రీ గోయల్

మన చేతివృత్తులవారు తమ కాలానికి చాలా ముందుగానే శాస్త్రీయ , ఇంజనీరింగ్ ప్రక్రియలను పరిపూర్ణం చేశారు: శ్రీ గోయల్

మాస్టర్ హస్తకళాకారులకు శిల్ప్ గురు, జాతీయ అవార్డుల ప్రదానం

Posted On: 28 NOV 2022 2:56PM by PIB Hyderabad

మన హస్తకళాకారులు ప్రపంచానికి భార త దేశ వారసత్వ సంపదకు రాయబారులు అని ఉప రాష్ట్రపతి శ్రీ జగదీప్ ధన్ కర్ అన్నారు. జౌళి మంత్రిత్వ శాఖ నిర్వహించిన శిల్ప గురు, జాతీయ అవార్డుల ప్రదానోత్సవంలో ఉప రాష్ట్రపతి

ప్రసంగించారు.

 

మునుపెన్నడూ లేని విధంగా భారతదేశం ఎదుగుతుందని శ్రీ ధన్ కర్

అన్నారు. "పెట్టుబడులు , అవకాశాలకు ప్రపంచవ్యాప్తంగా భారత్ అత్యంత అనుకూలమైన గమ్యస్థానం. హస్తకళలు, చేనేత రంగంతో సంబంధం ఉన్న హస్తకళాకారులు ఈ అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించారు‘‘ అని ఆయన అన్నారు. చేతి వృత్తుల వారి పనితనం, నైపుణ్యాల గురించి మాట్లాడుతూ, అటువంటి సహజ నైపుణ్యాలు భారతదేశం గర్వపడేలా చేస్తాయని గౌరవ ఉప రాష్ట్రపతి అన్నారు.

 

"హస్తకళాకారులు మన సంస్కృతికి దిక్సూచి. మీరు మన సంస్కృతి సృజనాత్మకతల అత్యంత శక్తివంతమైన,  ప్రభావవంతమైన వెలుగు అని సూచించే అదృష్టం నాకు లభించింది. భారతదేశం కలిగి ఉన్న అపారమైన నైపుణ్యాలను మీరు ప్రపంచానికి సూచిస్తున్నారు" అనిఆయన అన్నారు.

2017, 2018 , 2019 సంవత్సరాలకు గాను ఉత్తమ హస్త కళాకారులకు శిల్ప్ గురు , జాతీయ అవార్డులను పంపిణీ చేశారు. మహమ్మారి కారణంగా, ఈ కార్యక్రమాన్ని భౌతికంగా నిర్వహించలేకపోయారు.

 

మహమ్మారి కాలాన్ని ప్రస్తావిస్తూ, మన ప్రజలకు మూడు బిలియన్ల వ్యాక్సిన్లను అందించడం ద్వారా భారతదేశం ప్రపంచాన్ని అధిగమించిందని, వ్యాక్సినేషన్ కార్యక్రమం డిజిటల్ మ్యాపింగ్ ద్వారా దీనికి మద్దతు లభించిందని, ప్రపంచంలోని ఏ దేశం కూడా ఇలాంటి చొరవ గురించి ఎన్నడూ ఆలోచించలేదని ఆయన అన్నారు.మొదటి లాక్ డౌన్ నుండి 80 కోట్లకు పైగా లబ్ధిదారులకు రేషన్ కూడా అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

జి 20 అధ్యక్ష హోదా లభించడం ప్రపంచం గౌరవ ప్రధాన మంత్రి మాటను, ఆయన దార్శనికతను విశ్వసిస్తున్నట్టు స్పష్టమవుతోందని  శ్రీ ధన్ కర్ అన్నారు. దశాబ్దం ముగిసేనాటికి భారతదేశం మూడవ అతిపెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని తాను విశ్వసిస్తున్నానని ఆయన అన్నారు.

 

జౌళి, వినియోగదారుల వ్యవహారాలు, ఆహార , ప్రజాపంపిణీ , వాణిజ్యం,  పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్ ప్రసంగిస్తూ, హస్తకళ , చేనేత అనేది స్వావలంబన, ఆత్మవిశ్వాసం కలిగిన భారతదేశానికి ప్రపంచం తో భాగస్వామ్యం నెరపడం లో ఒక మూలస్తంభం అని అన్నారు.

 

శతాబ్దాలుగా మన శిల్పులు రాతి, లోహం, చందనం , బంకమట్టిలోకి జీవాన్ని తీసుకురావడానికి తమ స్వంత - తరచుగా ప్రత్యేకమైన - పద్ధతులను అభివృద్ధి చేశారని ఆయన అన్నారు. వారు చాలా కాలం క్రితం, వారి కాలానికి చాలా ముందుగానే శాస్త్రీయ , ఇంజనీరింగ్ ప్రక్రియలను పరిపూర్ణం చేశారు. వారి సృజనలు వారి అధునాతన జ్ఞానాన్ని , అత్యంత అభివృద్ధి చెందిన సౌందర్య జ్ఞానాన్ని బహిర్గతం చేశాయి.హస్తకళల వస్తువుల ఉత్పత్తి గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న లక్షలాది మందికి తక్కువ మూలధన పెట్టుబడితో జీవనోపాధి అవకాశాలను అందిస్తుంది, ఇంకా మంచి దేశీయ ,అంతర్జాతీయ మార్కెట్ ను కలిగి ఉంది, ఇది భారతీయ వారసత్వం, సంస్కృతి ,సంప్రదాయంలో భాగంగా ఉంది.

 

గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న మహిళల ఆర్థిక సాధికారతలో హస్తకళల ఉత్పత్తికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని, ఇతర ఇంటి పనులతో పాటు ఇంటిలోపల ఉత్పత్తి చేయవచ్చని ఆయన అన్నారు. మహిళలు శ్రామిక శక్తిలో పెద్ద భాగం . చేతివృత్తుల రంగంలో 50% పైగా ఉన్నారు.

 

గ్రామీణ జనాభాలోని విస్తారమైన విభాగం సామాజిక-ఆర్థిక జీవనోపాధిలో హస్తకళల ప్రాముఖ్యతను తక్కువ చేసి చెప్పలేమని ఆయన అన్నారు. అద్భుతమైన హస్తకళకు గుర్తింపుగా సాంప్రదాయ వారసత్వంలో కీలకమైన క్రాఫ్ట్‌ను కొనసాగించడంలో వారు పోషించిన ప్రధాన పాత్రకు గుర్తింపుగా ఈ అవార్డు ఇస్తున్నప్పటికీ ప్రపంచ మార్కెట్ పోకడలను దృష్టిలో ఉంచుకుని ఉత్పత్తి నైపుణ్యాన్ని గుర్తించడం కూడా అవసరం అని అన్నారు.

 

 

హస్తకళల ప్రోత్సాహం ఒక దేశం  సంప్రదాయ విలువలు , సమకాలీన దృక్పథం మధ్య సమతుల్యతను నిర్ధారించడమే కాకుండా, ఆ దేశ నైపుణ్యం కలిగిన చేతులకు ఆశ్రయం ఇస్తుందని శ్రీ గోయల్ అన్నారు.

 

"చేనేత , హస్తకళలు భారతదేశ వైవిధ్యాన్ని , అసంఖ్యాకమైన నేత కార్మికులు , చేతివృత్తుల వారి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాయి" అని గౌరవ  ప్రధాన మంత్రి చెప్పిన మాటలను ఆయన ఉటంకించారు. భారత దేశ హస్తకళలు/చేనేత ఎగుమతులు పెరుగుతున్నాయని , lఅలాగే, మన ఉత్పత్తులు ఇతరుల కంటే నాణ్యంగా ఉంటాయని కేంద్ర మంత్రి అన్నారు.

ప్రధాన మంత్రి నాయకత్వంలో భారత దేశం 2047లో స్వాతంత్ర్యం వచ్చిన 100 సంవత్సరాల నాటికి అభివృద్ధి చెందిన దేశంగా, సౌభాగ్యవంతమైన దేశంగా ఆవిర్భవించేందుకు కృషి చేస్తోందని ఆయన అన్నారు.

 

జౌళి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీమతి రచనా షా, హస్తకళల అభివృద్ధి కమీషనర్ శ్రీ శాంత్మాను , హస్తకళల అదనపు అభివృద్ధి కమీషనర్ (హస్తకళలు) శ్రీమతి ముదితా మిశ్రా సమక్షంలో కేంద్ర మంత్రి శ్రీ గోయల్ తో కలిసి ఉప రాష్ట్రపతి అవార్డు గ్రహీతల జాబితాను విడుదల చేశారు.

 

2017, 2018 , 2019 సంవత్సరాలకు గాను 30  శిల్ప్ గురు అవార్డులు , 78 జాతీయ అవార్డులను మాస్టర్ క్రాఫ్ట్ పర్సన్ లకు ప్రదానం చేశారు, వీరిలో 36 మంది మహిళలు ఉన్నారు. భారతీయ హస్తకళలు ,జౌళి రంగానికి హస్తకళా నైపుణ్యం విలువైన తోడ్పాటుకు గుర్తింపు ఇవ్వడమే ఈ అవార్డుల ప్రధాన ఉద్దేశ్యం.

 

శిల్ప గురు అవార్డు lలను అద్భుతమైన నైపుణ్యం, ఉత్పత్తి నైపుణ్యం , సాంప్రదాయ వారసత్వంలో కీలకమైన భాగంగా కళాకారులకు చేతిపనుల కొనసాగింపులో శిక్షణ ఇచ్చిన గురువులుగా పోషించిన పాత్రకు గుర్తింపుగా ఉద్దండ మాస్టర్ క్రాఫ్ట్‌పర్సన్‌లకు ఇస్తారు. భారతదేశంలో హస్తకళల పునరుజ్జీవనానికి స్వర్ణోత్సవాన్ని పురస్కరించుకొని 2002లో ఈ అవార్డులను ప్రారంభించారు. ఈ అవార్డులో ఒక బంగారు నాణెం, రెండు లక్షల రూపాయల నగదు, తామ్ర పత్రం,  శాలువా, సర్టిఫికేట్ ఉంటాయి. 2017, 2018 , 2019 సంవత్సరాలకు 30 మంది శిల్ప గురువులు ఎంపిక కాగా, వీరిలో 24 మంది పురుషులు , ఆరుగురు మహిళలు ఉన్నారు.

 

వివిధ క్రాఫ్ట్ కేటగిరీల్లో అత్యుత్తమ కళానైపుణ్యానికి గాను 1965 నుంచి జాతీయ అవార్డులు ప్రదానం చేస్తున్నారు. లోహాన్ని చెక్కడం, చికాన్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ, ఖుర్జా బ్లూ పాటరీ, మాతా ని పచేడి కలంకారీ, బంధానీ, టై అండ్ డై, హ్యాండ్ బ్లాక్ బాగ్ ప్రింట్, వార్లీ ఆర్ట్, స్టోన్ డస్ట్ పెయింటింగ్, సోజ్ని హ్యాండ్ ఎంబ్రాయిడరీ, టెర్రకోట, తంజావూరు పెయింటింగ్, షోలాపిత్, కంఠా హ్యాండ్ ఎంబ్రాయిడరీ, తాటి ఆకు చెక్కడం , చెక్కపై ఇత్తడి వైర్ ఇన్ లే, వుడ్ టార్కాషి, , మధుబని పెయింటింగ్,  గోల్డ్ లీఫ్ పెయింటింగ్, స్ట్రా క్రాఫ్ట్ మొదలైనవి అవార్డులకు ఎంపిక చేసే వాటిలో ప్రధానమైనవి. ఈ అవార్డు కింద లక్ష రూపయల  ప్రైజ్ మనీ, తామ్రపత్ర, శాలువా సర్టిఫికేట్ ఇస్తారు. 2017, 2018 ,2019 సంవత్సరాలకు గాను 78 మంది హస్తకళాకారులు జాతీయ అవార్డులకు ఎంపికయ్యారు, ఇందులో రెండు డిజైన్ ఇన్నోవేషన్ అవార్డులు ఉన్నాయి, ఇందులో ఒక డిజైనర్ , హస్తకళాకారిణి ఒక ప్రత్యేకమైన ఉత్పత్తిని సృష్టించారు. .

 

2022 నవంబర్ 29 నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు నేషనల్ క్రాఫ్ట్స్ మ్యూజియం అండ్ హస్తకళా అకాడమీ, ప్రగతి మైదాన్, భైరాన్ మార్గ్ లో శిల్ప గురువులు , జాతీయ అవార్డు గ్రహీతల అద్భుతమైన ఉత్పత్తులను ప్రజల కోసం ప్రదర్శించనున్నారు.

 

హస్తకళల రంగాన్ని ప్రోత్సహించడం ,అభివృద్ధి చేయడం కోసం  "జాతీయ హస్తకళల అభివృద్ధి కార్యక్రమం (ఎన్ హెచ్ డిపి)" , సమగ్ర హస్తకళల క్లస్టర్ డెవలప్ మెంట్ స్కీం (సిహెచ్ సిడిఎస్) కింద అభివృద్ధి కమిషనర్ (హస్తకళలు) కార్యాలయం ద్వారా ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేస్తోంది.

 

*****



(Release ID: 1879669) Visitor Counter : 272