ప్రధాన మంత్రి కార్యాలయం

గోవా రోజ్ గార్ మేళా లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

Posted On: 24 NOV 2022 12:15PM by PIB Hyderabad

నమస్కారం.

యువత కు ఉపాధి ని కల్పించే దిశ లో గోవా ప్రభుత్వం ఈ రోజు న ఒక ముఖ్యమైన అడుగు ను వేసింది. అనేక మంది యువతీ యువకుల కు గోవా ప్రభుత్వానికి చెందిన వివిధ విభాగాల లో నియామక పత్రాల ను ఈ రోజు న ఇవ్వడం జరుగుతుంది. ఈ నియామక పత్రాల ను అందుకొంటున్న యువతీ యువకుల తో పాటు గా వారి తల్లితండ్రుల కు ఇవే నా హృదయపూర్వక అభినందన లు. రాబోయే కొన్ని మాసాల లో గోవా పోలీస్ సహా ఇతర విభాగాల లో నియామకాలు ఉంటాయని నాతో చెప్పారు. ఇది గోవా పోలీసు బలగాన్ని మరింత గా బలపరచడం తో పాటు గా పౌరుల కు, ప్రత్యేకించి పర్యటకుల కు మరింత మెరుగైనటువంటి భద్రత ను అందించేందుకు పూచీ పడనుంది.

 

మిత్రులారా,

గత కొన్ని వారాల లో దేశం లోని వివిధ రాష్ట్రాల లో ఒకదాని తరువాత మరొకటి గా రోజ్ గార్ మేళాలను నిర్వహించడం జరుగుతూ వస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా వేల కొద్దీ యువజనుల కు ప్రతి నెలా రోజ్ గార్ మేళాల ద్వారా కేంద్ర ప్రభుత్వ విభాగాల లో నౌకరీల ను కల్పిస్తున్నది. బిజెపి పాలిత ప్రభుత్వాలు అధికారం లో ఉన్న రాష్ట్రాల లో, అంటే ఎక్కడయితే డబల్ ఇంజిన్ ప్రభుత్వాలు ఉన్నాయో ఆయా రాష్ట్రాల లో ఈ తరహా రోజ్ గార్ మేళాల ను ఏర్పాటు చేస్తుండడం నాకు సంతోషాన్ని కలిగిస్తున్నది.

మిత్రులారా,

గడచిన 8 సంవత్సరాల లో గోవా అభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయల ను కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి గా పెట్టింది. దాదాపు గా 3,000 కోట్ల రూపాయల ఖర్చు తో మోపా లో నిర్మాణం అయిన కొత్త విమానాశ్రయం కూడా త్వరలో ప్రారంభం కానుంది. ఈ విమానాశ్రయం యొక్క నిర్మాణానికి సంబంధించిన రంగాల లో వేల కొద్దీ గోవా ప్రజలు కొలువుల ను దక్కించుకొన్నారు. అదే విధం గా ప్రస్తుతం గోవా లో అమలవుతున్న కనెక్టివిటీ ప్రాజెక్టు లు మరియు మౌలిక సదుపాయాల కల్పన కు సంబంధించిన ప్రాజెక్టులు సైతం గోవా యువత కు ఉపాధి అవకాశాల ను అందించడం జరిగింది. స్వయంపూర్ణ గోవాయొక్క దృష్టికోణం ఏమిటి అంటే అది గోవా లో కనీస వసతి ని, సదుపాయాల ను మెరుగు పరచడమూ, రాష్ట్రం లో మౌలిక సదుపాయాల ను మెరుగు పరచడమూ ను. గోవా టూరిజం మాస్టర్ ప్లాన్ ఎండ్ పాలిసీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం గోవా అభివృద్ధి కోసం ఒక కొత్త నమూనా ను కూడా రూపొందించింది. దీని ఫలితం గా, పర్యటన రంగం లో పెట్టుబడి కోసం నూతన సంభావ్యతల కు తోడు ఉపాధి అవకాశాల ను గణనీయం గా పెంచడం జరిగింది.


మిత్రులారా,


గోవా లోని గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ను బలపరచడానికి, అలాగే సాంప్రదాయిక వ్యవసాయం లో ఉపాధి అవకాశాల ను అధికం చేయడానికి కూడా చర్యల ను చేపట్టడం జరుగుతున్నది. వరి, కొబ్బరి, జనుము, మసాలా దినుసులు.. వీటిని ఉత్పత్తి చేస్తున్న రైతులు, వీరితో పాటు గా ఫ్రూట్ ప్రాసెసింగ్ లో నిమగ్నం అయివున్న వ్యక్తుల ను స్వయం సహాయ సమూహాల తో ముడిపెట్టడం జరుగుతున్నది. ఈ ప్రయాస లు అన్నీ కూడాను గోవా లో ఉపాధి కి మరియు స్వతంత్రోపాధి కల్పన కు ఎన్నో కొత్త కొత్త అవకాశాల ను కల్పిస్తున్నాయి.


మిత్రులారా,
గోవా లో నియామక లేఖల ను అందుకొన్నటువంటి యువతీ యువకుల కు మరొక విషయాన్ని నేను చెప్పదలచుకొన్నాను. మీ జీవనం లో అత్యంత ముఖ్యమైనటువంటి 25 సంవత్సరాలు ప్రస్తుతం మొదలవుతున్నాయి. ఈ కారణం గా, గోవా యొక్క అభివృద్ధి తో పాటు ఒక న్యూ ఇండియా-2047’ కు సంబంధించిన లక్ష్యం కూడా మీ ముందు ఉంది. మీరు ఇటు గోవా అభివృద్ధి కోసం, అటు దేశం అభివృద్ధి కోసం కృషి చేసి తీరవలసి ఉంది. మీరు మీ యొక్క కర్తవ్య పథాన్ని పూర్తి సమర్పణ భావం తో, ఉత్సుకత తో అనుసరిస్తూ ఉంటారని నాలో నమ్మకం ఉంది.


మీ అందరికీ మరొక్క సారి ఇవే నా హృదయపూర్వక అభినందన లు, శుభాకాంక్షలూ ను. మీకు ఇవే ధన్యవాదాలు.

 

అస్వీకరణ: ఇది ప్రధాన మంత్రి ప్రసంగాని కి భావానువాదం, మూల ఉపన్యాసం హిందీ భాష లో ఉంది.

 

**



(Release ID: 1879586) Visitor Counter : 108