ప్రధాన మంత్రి కార్యాలయం

పిఎస్ఎల్ వి సి54 మిశన్ ను విజయవంతంగా ప్రయోగించినందుకు ఇస్ రో కు మరియు ఎన్ఎస్ఐఎల్ కు అభినందనల ను తెలిపిన ప్రధానమంత్రి

Posted On: 26 NOV 2022 6:07PM by PIB Hyderabad

పిఎస్ఎల్ వి సి54 మిశన్ ను ఫలప్రదం గా ప్రయోగించినందుకు గాను ఇస్ రో కు మరియు ఎన్ఎస్ఐఎల్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను వ్యక్తం చేశారు. ఈ ప్రయోగ ప్రక్రియ ల పాలుపంచుకొన్నటువంటి అన్ని కంపెనీల కు కూడా శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు.

 

ప్రధాన మంత్రి అనేక ట్వీట్ ల లో -

‘‘పిఎస్ఎల్ వి సి54 మిశన్ ను ఫలప్రదం గా ప్రయోగించినందుకు గాను @ISRO కు మరియు ఎన్ఎస్ఐఎల్ కు ఇవే అభినందన లు. ఇఒఎస్-06 ఉపగ్రహం మన సముద్ర సంబంధి వనరుల ను ఉపయోగించుకొనే తీరు లో మెరుగులు పెట్టడం లో సహాయకారి కాగలదు.’’

 

భారతదేశానికి చెందిన కంపెనీ లు అయినటువంటి @PixxelSpace మరియు @DhruvaSpace ల యొక్క మూడు ఉపగ్రహాల ప్రయోగం ఒక కొత్త యుగం ఆరంభానికి నాంది పలుకుతున్నది. అంతరిక్ష సంబంధి సాంకేతిక విజ్ఞ‌ానం లో భారతీయ ప్రతిభ ను సంపూర్ణం గా సద్వినియోగం చేసుకోవడం జరుగుతుంది. ఈ ప్రయోగ ప్రక్రియ లో పాలుపంచుకొన్నటువంటి అన్ని కంపెనీల తో పాటు గా అందరి కి కూడాను అభినందనల ను తెలియజేస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

***

DS/SH



(Release ID: 1879461) Visitor Counter : 114