ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ఆధార్‌ను గుర్తింపు ధ్రువీకరణగా ఆమోదించే ముందు దానిని ప్రమాణీకరించండిః యుఐడిఎఐ
సరైన గుర్తింపు, ఏదైనా దుర్వినియోగాన్ని నివారించేందుకు ఆధార్‌ను ధ్రువీకరించండి
Posted On:
24 NOV 2022 3:28PM by PIB Hyderabad
వ్యక్తి గుర్తింపును నిర్ధారించేందుకు భౌతికంగా లేదా ఎలక్ట్రానిక రూపంలోఆధార్‌ను ఆమోదించే ముందు వ్యక్తి ఆధార్‌ను ధృవీకరించాలి.
వ్యక్తి సమర్పించిన ఏ రూపంలో ఉన్న ఆధార్ (ఆధార్ లెటర్, ఇ-ఆధార్, ఆధార్ పివిసి కార్డ్, ఎం- ఆధార్) యధార్ధతను అయినా నిర్ధారించడానికి ఆధార్ హక్కుదారు సమ్మతి అనుసరించి ఆధార్ సంఖ్య ధృవీకరించడమన్నది సరైన చర్య అని యునీక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ- భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ) పేర్కొంది.
ఇది మోసగాళ్ళు, సామాజిక వ్యతిరేక శక్తులు దుర్వినియోగం చేసే అవకాశాన్ని నిరోధిస్తుంది. ఇది ఆరోగ్యవంతమైన వినియోగాన్ని ప్రోత్సహించడమే కాక ప్రతి 12 అంకెల సంఖ్య ఆధార్ కాదన్న యుఐడిఎఐ వైఖరిని పునరుద్ఘాటిస్తుంది. ఆధార్ పత్రాలను మార్చడాన్ని ఆఫ్‌లైన్ ధ్రువీకరణ ద్వారా కనుగొనవచ్చు, అలా మార్చడమన్నది ఆధార్ చట్టంలోని సెక్షన్ 35 కింద శిక్షార్హమైన నేరం, జరిమానాలను విధించవచ్చు.
ఆధార్‌ను ఉపయోగించేముందు ధృవీకరించవలసిన అవసరాన్ని నొక్కి చెప్తూ, ఆధార్‌ను గుర్తింపు రుజువుగా సమర్పించినప్పుడు, ఆ వ్యక్తి గుర్తింపు ప్రామాణీకరణ/ ధృవీకరణను సంబంధిత సంస్థ ఆధార్‌ను గుర్తింపు పత్రంగా చేసుకొని చేయాలనే నిర్దేశాలను ఇవ్వవలసిందిగా యుఐడిఎఐ రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్క్షప్తి చేసింది.
ప్రామాణీకరణ/ ధృవీకరణ ఆవశ్యకతను నొక్కి చెప్తూ, ఆ పని చేసేందుకు అధికారం కలిగిన సంస్థలను, ఇతర సంస్థలకు అభ్యర్ధిస్తూ, అనుసరించవలసిన ప్రోటోకాల్‌ను పేర్కొంటూ యుఐడిఎఐ సర్క్యులర్లను జారీ చేసింది.
అన్ని రూపాలలోని ఆధార్‌ను (ఆధార్ లెటర్, ఇ-ఆధార్, ఆధార్ పివిసి కార్డ్, ఎం- ఆధార్) ఎం ఆధార్ ఆప్ లేదా ఆధార్ క్యూఆర్ కోడ్ స్కానర్ ద్వారా ఏ ఆధార్‌నైనా దానిపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను ఉపయోగించి ధృవీకరించవచ్చు. క్యూఆర్ కోడ్ స్కానర్ అన్నది ఆడ్రాయిడ్, ఐఒఎస్ ఆధారిత మొబైల్ ఫోన్లలోనూ, విండోస్ ఆధారిత అప్లికేషన్లలోనూ ఉచితంగా అందుబాటులో ఉంది.
స్థానికులు తమ ఆధార్‌ను పేపర్ రూపంలో లేదా ఎలక్ట్రానిక్ రూపంలో సమర్పించడం ద్వారా తమ గుర్తింపును నిర్ధారించుకునేందుకు తమ ఆధార్ సంఖ్యను ఉపయోగించవచ్చు. స్థానికులకు చేయవలసిన పనులు, చేయకూడని పనులను యుఐడిఎఐ ఇప్పటికే జారీ చేసి ఉంది కనుక వారు తమ ఆధార్‌ను ధైర్యంగా ఉపయోగించవచ్చు.
***
(Release ID: 1878690)
Visitor Counter : 244