హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

'టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ అండ్ టెర్రరిజం లో గ్లోబల్ ట్రెండ్స్' అనే అంశంపై న్యూఢిల్లీ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన మూడవ 'నో మనీ ఫర్ టెర్రర్' మినిస్టీరియల్ సమావేశం తొలి సెషన్


“ఉగ్రవాదానికి డబ్బు సాయం లేదు ‘‘ అనే లక్ష్యాన్ని సాధించడానికి ఒకే సంకల్పం- ఒకే దృక్పథం‘‘ అనే సూత్రాన్ని అవలంబించాలి.

ఉగ్రవాదం మద్దతు వ్యవస్థ కూడా ఉగ్రవాదం మాదిరి ప్రపంచానికి ముప్పుగా ఉంది, మనం సమిష్టిగా దానిని బహిర్గతం చేయాలి

డార్క్ నెట్ ఉగ్రవాదం , రాడికల్ మెటీరియల్ ను వ్యాప్తి చేయడానికి డార్క్ నెట్ ఒక కొత్త మాధ్యమంగా మారుతోంది, దీనిని ఆపడానికి మనం బలమైన ఉమ్మడి కార్యాచరణ వ్యవస్థ కోసం పనిచేయాలి

నార్కో టెర్రర్ ఈ రోజు టెర్రర్ ఫైనాన్సింగ్ ప్రధాన మాధ్యమంగా మారింది, దీనిని పూర్తిగా నాశనం చేయడానికి మనం ఉమ్మడి ప్రయత్నాలు చేయాలి

ఉగ్రవాదిని రక్షించడం ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంతో సమానం

Posted On: 18 NOV 2022 12:24PM by PIB Hyderabad

'టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ అండ్ టెర్రరిజం లో గ్లోబల్ ట్రెండ్స్' అనే అంశంపై 'నో మనీ ఫర్ టెర్రర్' మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ 3వ సమావేశం తొలి సెషన్ ఈరోజు ఢిల్లీ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షత న జరిగింది. కేంద్ర హోం మంత్రి తన ప్రారంభోపన్యాసంలో, ఉగ్రవాదం నిస్సందేహంగా, ప్రపంచ శాంతి భద్రతకు అత్యంత తీవ్రమైన ముప్పు అని, కానీ, ఉగ్రవాదం కంటే ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం చాలా ప్రమాదకరమని, ఉగ్రవాదం 'మార్గాలు,  పద్ధతులు' అటువంటి నిధుల నుండి వ్యాపిస్తాయని, ఇంకా, ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థను బలహీనపరుస్తుందని అన్నారు.

 

శ్రీ అమిత్ షా మాట్లాడుతూ, భారతదేశం అన్ని రూపాలలో ఉన్న ఉగ్రవాదాన్ని,  వ్యక్తీకరణలను ఖండిస్తుందని , అమాయకుల ప్రాణాలను తీయడం వంటి చర్యను ఎట్టి పరిస్థితి లోనూ సమర్థించదని శ్రీ అమిత్ షా స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద దాడుల బాధితుల పట్ల తన సానుభూతిని వ్యక్తం చేస్తూ, ఈ దుర్మార్గం తో మనం ఎన్నడూ రాజీపడకూడదని ఆయన అన్నారు.

 

భారతదేశం అనేక దశాబ్దాలుగా ఉగ్రవాదానికి బలైపోయిందని, ఇది సరిహద్దు వెంబడి నడిపించబడిందని కేంద్ర హోం మంత్రి అన్నారు. భారత

భద్రతా దళాలు, పౌరులు తీవ్రమైన

ఉగ్రవాద హింసా ఘటనలను సుస్థిర మైన, సమన్వయమైన రీతిలో ఎదుర్కోవలసి వచ్చిందని ఆయన అన్నారు. ఉగ్రవాదాన్ని దాని అన్ని రూపాలలో ఖండించాలని అంతర్జాతీయ సమాజం ఒక సమిష్టి విధానాన్ని కలిగి ఉందని, కానీ, సాంకేతిక విప్లవం కారణంగా ఉగ్రవాదం రూపాలు,  వ్యక్తీకరణలు నిరంతరం అభివృద్ధి చెందుతున్నాయని శ్రీ షా అన్నారు.

ప్రస్తుతం ఉగ్రవాదులు, ఉగ్రవాద బృందాలు అత్యాధునిక ఆయుధాలు,

సమాచార సాంకేతిక పరిజ్ఞానం సూక్ష్మ నైపుణ్యాలను , సైబర్ , ఆర్థిక రంగానికి సంబంధించిన మెళకువలను బాగా అర్థం చేసుకున్నాయని , వాటిని ఉపయోగిస్తున్నారని ఆయన అన్నారు.

ఉగ్రవాదం డైనమైట్‌ నుంచి మెటావర్స్‌గా, ఏకే-47 నుంచి వర్చువల్‌ అసెట్స్‌గా మారడం కచ్చితంగా ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగించే అంశమని, దీనికి వ్యతిరేకంగా ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించేందుకు మనమందరం కలిసి పనిచేయాలని ఆయన అన్నారు.

ఉగ్రవాద ముప్పును ఏ మతం, జాతీయత లేదా సమూహంతో ముడిపెట్టలేమని, కూడా గుర్తించామని శ్రీ షా తెలిపారు.

ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం కోసం,

భద్రతా వలయాన్ని, అలాగే న్యాయ, ఆర్థిక వ్యవస్థ లను బలోపేతం చేయడంలో

మనం గణనీయమైన పురోగతి సాధించామని అన్నారు. అయినా మరోవైపు ఉగ్రవాదులు నిరంతరం హింసను చేపట్టడానికి, యువతను ఉగ్రవాదం వైపు మళ్లించడానికి , ఆర్థిక వనరులను సమకూర్చు కోవడానికి కొత్త మార్గాలను కనుగొంటున్నారని ఆయన పేర్కొన్నారు. తీవ్రవాద సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి , వారి గుర్తింపులను దాచడానికి ఉగ్రవాదులు 'డార్క్ నెట్'ను ఉపయోగిస్తున్నారని శ్రీ షా పేర్కొన్నారు. అదనంగా, క్రిప్టోకరెన్సీ వంటి వర్చువల్ ఆస్తుల వినియోగం పెరిగింది. ఈ డార్క్ నెట్ కార్యకలాపాల నమూనాలను మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని,  వాటి పరిష్కారాలను కనుగొనాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

 

దురదృష్టవశాత్తు, ఉగ్రవాదంపై పోరాడాలనే మన సమిష్టి సంకల్పాన్ని బలహీనపరచడానికి లేదా అడ్డుకోవడానికి ప్రయత్నించే దేశాలు ఉన్నాయని కేంద్ర హోం మంత్రి అన్నారు.కొన్ని దేశాలు టెర్రరిస్టులకు రక్షణ కల్పించడం, ఆశ్రయం ఇవ్వడం మనం చూశామని, ఉగ్రవాదిని రక్షించడం ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంతో సమానమని ఆయన అన్నారు. అటువంటి శక్తులు తమ ఉద్దేశ్యాలలో ఎన్నడూ విజయం సాధించకుండా చూడటం మన సమిష్టి బాధ్యత అని ఆయన అన్నారు.2021 ఆగస్టు తరువాత దక్షిణాసియా ప్రాంతంలో పరిస్థితి మారిందని, పాలన లో మార్పు, అల్ ఖైదా, ఐసిస్ ల ప్రభావం ప్రాంతీయ

భద్రతకు ఒక గణనీయ సవాలుగా నిలుస్తున్నాయని శ్రీ షా అన్నారు. ఈ కొత్త సమీకరణాలు ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం (టెర్రర్ ఫైనాన్సింగ్ ) సమస్యను మరింత తీవ్రతరం చేశాయని ఆయన పేర్కొన్నారు. మూడు దశాబ్దాల క్రితం,

ప్రపంచం మొత్తం అటువంటి ఒక పాలన మార్పు తీవ్ర పరిణామాలను భరించాల్సి వచ్చింద ని, దీని ఫలితాలను మనం అందరూ 9/11 నాటి భీభత్సమైన దాడిలో చూశాం అని శ్రీ షా అన్నారు. ఈ

నేపథ్యంలో గత సంవత్సరం దక్షిణాసియా ప్రాంతంలో జరిగిన మార్పులు మన

అందరికీ ఆందోళనకరమైన విషయం అని ఆయన అన్నారు. అల్ ఖైదాతో పాటు, దక్షిణాసియాలోని లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి సంస్థలు ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేస్తూనే ఉన్నాయని ఆయన అన్నారు.

 

ఉగ్రవాదుల సురక్షిత స్వర్గధామాలను లేదా వారి వనరులను మనం ఎన్నడూ విస్మరించరాదని శ్రీ అమిత్ షా అన్నారు. వాటిని స్పాన్సర్ చేసి, మద్ధతు ఇచ్చే అటువంటి శక్తుల ద్వంద్వ ప్రసంగాలను కూడా మనం బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందని, అందువల్ల, ఈ సదస్సు, పాల్గొనే దేశాలు, సంస్థలు ఎంపిక చేసుకున్న ఈ ప్రాంతపు సవాళ్ల గురించి మాత్రమే చర్చిస్తే సరిపోదని ఆయన అన్నారు.

 

ఉగ్రవాదానికి నిధులు సమకూర్చే సమస్య విస్తృతంగా మారిందని కేంద్ర హోం మంత్రి తెలిపారు. గత కొన్ని సంవత్సరాలలో

భారత దేశం ఉగ్రవాదులకు ఆర్థిక

 సహాయం అందకుండా నిరోధించడంలో విజయ వంతం అయిందని ఆయన అన్నారు. ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం చేయడానికి వ్యతిరేకంగా భారతదేశం వ్యూహం ఆరు స్తంభాలపై ఆధారపడి

ఉందన్నారు.

 

*లెజిస్లేటివ్ ,టెక్నలాజికల్ ఫ్రేమ్ వర్క్ ని బలోపేతం చేయడం

*సమగ్ర మానిటరింగ్ ఫ్రేమ్ వర్క్ సృష్టించడం

*చర్య తీసుకోదగిన ఇంటెలిజెన్స్ భాగస్వామ్య యంత్రాంగం , దర్యాప్తు, పోలీసు కార్యకలాపాలను బలోపేతం చేయడం

*ఆస్తిని జప్తు చేయడానికి ఏర్పాట్లు

*చట్టపరమైన సంస్థలు , కొత్త టెక్నాలజీల దుర్వినియోగాన్ని నిరోధించడం,

*అంతర్జాతీయ సహకారం , సమన్వయాన్ని నెలకొల్పడం

 

ఈ దిశగా భారత దేశం చట్టవ్యతిరేక

కార్య కలాపాల నిరోధ చట్టం (యుఎపిఎ) కు సవరణ చేయడం, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ ఐఎ)ను బలోపేతం

చేయడం, ఫైనాన్సియల్ ఇంటెలిజెన్స్ కు ఒక కొత్త దిశను ఇవ్వడం వల్ల

ఉగ్రవాదానికి, దానికి ఆర్థిక సాయం అందించడానికి వ్యతిరేకంగా పోరాటాన్ని బలోపేతం చేసిందని శ్రీ షా అన్నారు. మన నిరంతర ప్రయత్నాల ఫలితంగా భారత దేశంలో ఉగ్రవాద ఘటనల సంఖ్య భారీగా తగ్గిందని, ఫలితంగా ఉగ్రవాదం వల్ల ఆర్థిక నష్టాలు కూడా గణనీయంగా తగ్గాయని ఆయన పేర్కొన్నారు.

 

ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి అత్యంత సమర్థవంతమైన వ్యూహం అంతర్జాతీయ సమన్వయం, దేశాల మధ్య రియల్ టైమ్, పారదర్శక సహకారం అని భారత్ విశ్వసిస్తోందని కేంద్ర హోం మంత్రి తెలిపారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటంలో అప్పగింత, ప్రాసిక్యూషన్, ఇంటెలిజెన్స్ షేరింగ్, కెపాసిటీ బిల్డింగ్, కాంబాటింగ్ ది ఫైనాన్సింగ్ ఆఫ్ టెర్రరిజం (సీఎఫ్టీ) వంటి అంశాల్లో దేశాల మధ్య సహకారం ఎంతో ముఖ్యమైనదని ఆయన అభిప్రాయపడ్డారు.ఉగ్రవాదులు , తీవ్రవాద గ్రూపులు సులభంగా సమన్వయం చేసుకోవడం , సరిహద్దుల గుండా తమ వనరులను సమీకరించడం వల్ల మన పరస్పర సహకారం మరింత ముఖ్యమైనదని శ్రీ షా అన్నారు.

 

మాదకద్రవ్యాల అక్రమ వాణిజ్యం, నార్కో-టెర్రర్ సవాలు వంటి అభివృద్ధి చెందుతున్న ధోరణులు టెర్రర్ ఫైనాన్సింగ్ కు కొత్త కోణాన్ని ఇచ్చాయని శ్రీ అమిత్ షా అన్నారు. ఈ నేపథ్యంలో అన్ని దేశాల

మధ్య మరింత సన్నిహిత సహకారం

అవసరం ఆని ఆయన అన్నారు. ఐక్యరాజ్యసమితి వంటి బహుపాక్షిక సంస్థలు, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) వంటి వేదికల ఉనికి "టెర్రరిజం ఫైనాన్సింగ్ ఆఫ్ టెర్రరిజం (సిఎఫ్టి)" అనే రంగంలో ఉగ్రవాదాన్ని నిరోధించడంలో అత్యంత ప్రభావవంతంగా ఉన్నాయని శ్రీ షా అన్నారు.మనీలాండరింగ్, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ ను నిరోధించడానికి , ఎదుర్కోవడానికి , పోరాడటానికి అంతర్జాతీయ ప్రమాణాలను రూపొందించడం , అమలు చేయడంలో ఎఫ్ఎటిఎఫ్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని ఆయన అన్నారు.

 

ఆర్థిక లావాదేవీల కోసం ఉగ్రవాదులు వర్చువల్ ఆస్తుల కొత్త పద్ధతులను ఉపయోగిస్తున్నందున వర్చువల్ అసెట్స్ రూపంలో మన ముందు కొత్త సవాలు ఉందని కేంద్ర హోం మంత్రి అన్నారు. వర్చువల్ అసెట్ ఛానల్స్, ఫండింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ,డార్క్ నెట్ ఉపయోగం అరికట్టేందుకు "బలమైన , సమర్థవంతమైన కార్యాచరణ వ్యవస్థను" అభివృద్ధి చేయడానికి మనం సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఐక్య రాజ్య

lమితి, ఐ ఎమ్ ఎఫ్ , ఇంటర్ పోల్

లా ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీలు, ఆర్థిక

పరిశోధకులు ,వివిధ దేశాల నియంత్రణ సంస్థలు వంటి ఇతర భాగస్వాములు ఈ విషయంలో మరింత సానుకూల

ప్రభావం చూపగలరని శ్రీ షా అన్నారు.

ఈ సవాళ్ళను మనం లోతుగా అర్థం చేసుకోవాలని, ఇటీవల న్యూఢిల్లీలో ముగిసిన ఇంటర్ పోల్ సర్వసభ్య సమావేశంలో చేసిన విధంగానే ఉగ్రవాదానికి నిధులు సమకూర్చే కొత్త పద్ధతులను అరికట్టడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు చేయాలని ఆయన అన్నారు.

 

ఇంటెలిజెన్స్ ను పంచుకోవడం ద్వారా, సమర్థవంతమైన సరిహద్దు నియంత్రణ కోసం సామర్థ్యాన్ని పెంపొందించడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల దుర్వినియోగాన్ని నిరోధించడం, అక్రమ ఆర్థిక ప్రవాహాలను పర్యవేక్షించడం, నిరోధించడం ,పరిశోధనాత్మక , న్యాయ ప్రక్రియల్లో సహకరించడం ద్వారా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి భారతదేశం అన్ని ప్రయత్నాలకు కట్టుబడి ఉందని శ్రీ అమిత్ షా అన్నారు. " ఉగ్రవాదానికి డబ్బు లేదు" అనే లక్ష్యాన్ని సాధించడానికి, ప్రపంచ సమాజం టెర్రర్ ఫైనాన్సింగ్ "మోడ్ - మీడియం - మెథడ్" ను అర్థం చేసుకోవాలని , వాటిని నిర్మూలించడంలో 'వన్ మైండ్, వన్ అప్రోచ్' అనే సూత్రాన్ని అవలంబించాలని ఆయన అన్నారు.

 

భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

ప్రసంగంతో ఈ రోజు ఈ సమావేశాన్ని ప్రారంభించామని, ఈ రెండు రోజుల్లో

ఉగ్రవాదానికి సంబంధించిన వివిధ కోణాలపై అర్ధవంతంగా చర్చ జరిగిందని, ప్రస్తుత,  భవిష్యత్తు సవాళ్లకు అర్ధవంతమైన పరిష్కారాలు , అవగాహన కల్పిస్తామని కేంద్ర హోం మంత్రి అన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మీ ఉత్సాహం ఎంత బలంగా ఉందో, 'ఉగ్రవాదానికి డబ్బు లేదు' లక్ష్యం పట్ల మన నిబద్ధత అంత బలంగా ఉందని భారత హోం మంత్రిగా తాను సమావేశానికి హామీ ఇస్తున్నానని శ్రీ షా చెప్పారు.  తోటి ప్యానలిస్ట్ స్పీకర్ల నుండి అభిప్రాయాలు వినడం చాలా బాగుంది అని శ్రీ షా అన్నారు.  రేపు ముగింపు సెషన్‌లో, శ్రీ అమిత్ షా కొన్ని సంబంధిత అంశాలపై తన అభిప్రాయాలను తెలియ చేస్తారు.

 

*****


(Release ID: 1877022) Visitor Counter : 390