ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బాలి లో జి-20 శిఖర సమ్మేళనం జరుగుతున్న క్రమం లో ఫ్రాన్స్ అధ్యక్షుని తోసమావేశమైన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 16 NOV 2022 1:42PM by PIB Hyderabad

బాలి లో జి-20 శిఖర సమ్మేళనం జరుగుతున్న క్రమం లో ఫ్రాన్స్ గణతంత్రం అధ్యక్షుడు శ్రీ ఇమేన్యుయల్ మేక్రోన్ తో మధ్యాహ్న భోజనం వేళ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ అయ్యారు.

రక్షణ, పరమాణు శక్తి ని పౌర ప్రయోజనాల కు వినియోగించుకోవడం, వ్యాపారం మరియు పెట్టుబడి వంటి విభిన్న రంగాల లో ప్రస్తుతం కొనసాగుతున్న సహకారాన్ని గురించి నేతలు ఇద్దరు సమీక్షించారు. ఆర్థిక సంబంధాల తాలూకు కొత్త రంగాల లో సహకారాన్ని గాఢతరం గా మలచుకోవడాన్ని సైతం వారు స్వాగతించారు.

పరస్పర హితం ముడిపడిన ప్రాంతీయ అంశాల ను గురించి మరియు ప్రపంచ స్థాయి అంశాల ను గురించి కూడా చర్చించడం జరిగింది.

 

***


(रिलीज़ आईडी: 1876548) आगंतुक पटल : 125
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam