ప్రధాన మంత్రి కార్యాలయం

బాలి లో జి-20 శిఖర సమ్మేళనం జరుగుతున్న క్రమం లో సింగపూర్ ప్రధాని తోసమావేశమైన ప్రధాన మంత్రి

Posted On: 16 NOV 2022 1:45PM by PIB Hyderabad

బాలి లో జి-20 శిఖర సమ్మేళనం జరుగుతూ ఉన్న క్రమం లో సింగపూర్ ప్రధాని శ్రీ లీ సియెన్ లూంగ్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న సమావేశమయ్యారు. కిందటి సంవత్సరం లో జి-20 శిఖర సమ్మేళనాన్ని రోమ్ లో ఏర్పాటు చేసినప్పుడు ప్రధాని శ్రీ లీ తో తాను సమావేశమైన సంగతి ని శ్రీ నరేంద్ర మోదీ గుర్తు కు తెచ్చుకొన్నారు.

ప్రధానమంత్రులు ఇరువురు భారతదేశాని కి మరియు సింగపూర్ కు మధ్య గల బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని గమనించడం తో పాటు గా ఈ సంవత్సరం సెప్టెంబర్ లో న్యూ ఢిల్లీ లో జరిగిన ఇండియా-సింగపూర్ మినిస్టీరియల్ రౌండ్ టేబుల్ ప్రారంభిక సమావేశం సహా రెండు పక్షాల మధ్య ఉన్నత స్థాయి మంత్రుల చర్చలు మరియు సంస్థాగత చర్చలు క్రమం తప్పక చోటు చేసుకొంటుండడాన్ని కూడా లెక్క లోకి తీసుకొన్నారు

ఉభయ దేశాల మధ్య వ్యాపారాన్ని మరియు పెట్టుబడి సంబంధాల ను, ప్రత్యేకించి ఫిన్ టెక్, నవీకరణ యోగ్య శక్తి, నైపుణ్యాల అభివృద్ధి, ఆరోగ్యం మరియు ఔషధ నిర్మాణ రంగాల లో సంబంధాల ను, మరింత గా విస్తరింప చేసుకోవాలన్న అంశాలలో వారి వచనబద్ధత ను నేతలు ఇరువురు పునరుద్ఘాటించారు. గ్రీన్ ఇకానమి, మౌలిక సదుపాయాల కల్పన మరియు డిజిటలైజేశన్ సహా వివిధ రంగాల లో పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావలసిందంటూ సింగపూర్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం పలికారు. దీనికి అదనం గా, భారతదేశం యొక్క నేశనల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్, గతి శక్తి ప్లాను మరియు ఎసెట్ మానిటైజేశన్ ప్లాను ల తాలూకు ప్రయోజనాల ను స్వీకరించాలంటూ కూడా సింగపూర్ కు ఆయన సూచన చేశారు.

ప్రాంతీయ స్థాయి లో మరియు ప్రపంచ స్థాయి లో ఇటీవలి ఘటన క్రమాల పై ఇద్దరు నేత లు వారి వారి అభిప్రాయాల ను ఒకరి కి మరొకరు వెల్లడించుకొన్నారు. భారతదేశం అనుసరిస్తున్న ‘యాక్ట్ ఈస్ట్ పాలిసి’ లో సింగపూర్ యొక్క భూమిక ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. అంతేకాక, 2021-2024 మధ్య కాలం లో ఆసియాన్-భారతదేశం సంబంధాల విషయం లో సింగపూర్ నిర్వహించిన సమన్వయకారి భూమిక ను సైతం శ్రీ నరేంద్ర మోదీ మెచ్చుకొన్నారు. భారతదేశం-ఆసియాన్ బహుముఖీన సహకారాన్ని మరింత గా విస్తరించేందుకు కలసి పని చేయాలని ఉందని ఇరువురు నేతలు వారి అభిలాష ను పునరుద్ఘాటించారు.

రాబోయే కాలానికి గాను శ్రీ లీ కి ప్రధాన మంత్రి శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు. ఆయన ను రాబోయే సంవత్సరం లో జి-20 శిఖర సమ్మేళనం లో పాలుపంచుకోవడం కోసం భారతదేశానికి విచ్చేయవలసిందంటూ శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానించారు.

 

 

***

 



(Release ID: 1876516) Visitor Counter : 134