ప్రధాన మంత్రి కార్యాలయం

బాలి లో జి-20 శిఖర సమ్మేళనం జరుగుతున్న సందర్భం లో యుఎస్ఎ అధ్యక్షుని తోమరియు ఇండొనేశియా అధ్యక్షుని తో సమావేశమైన ప్రధాన మంత్రి 

Posted On: 15 NOV 2022 9:59PM by PIB Hyderabad

జి-20 సభ్యత్వ దేశాల నేత ల శిఖర సమ్మేళనం బాలి లో కొనసాగుతూ ఉన్న క్రమం లో యుఎస్ఎ అధ్యక్షుడు శ్రీ జోసెఫ్ ఆర్. బైడెన్ తో మరియు ఇండొనేశియా అధ్యక్షుడు శ్రీ జోకో విడోడో తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న సమావేశమయ్యారు.

జి-20 అనేది అంతర్జాతీయ ఆర్థిక సహకారానికి ఒక ప్రధానమైన వేదిక గా ఉంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రపంచానికి ఎదురవుతున్నటువంటి సవాళ్ళ ను అధిగమించడం కోసం ప్రముఖ ఆర్థిక వ్యవస్థల ను ఏకతాటి మీదకు తీసుకురావలసిన జి-20 కూటమి తన సామర్థ్యాన్ని చాటుకోవడానికి పెద్ద పీట ను వేస్తూ ఉండాలి అని ఆయన అన్నారు. మన ఆర్థిక వ్యవస్థల లో నిలకడతనం కలిగినటువంటి మరియు అన్ని రంగాల లో వృద్ధి ని తిరిగి నమోదు చేయడానికి జి-20 కృషి చేస్తున్నదని, ప్రస్తుతం ఎదురైన జలవాయు పరమైన, శక్తి సంబంధి మరియు ఆహార పరమైన సంకటాల ను ఎదిరించి పోరాడడానికి, ప్రపంచ ఆరోగ్య వ్యవస్థ ను పటిష్ట పరచడానికి, అంతేకాకుండా సాంకేతిక విజ్ఞాన సంబంధి మార్పు ను ప్రోత్సహించడానికి కూడా జి-20 కలిసికట్టు గా పనిచేస్తోందని ఆయన అన్నారు.

భారతదేశం జి-20 కి అధ్యక్షత వహించే కాలం లో అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాల కు వాటి అభిప్రాయాల ను వ్యక్తం చేసేందుకు అవకాశాల ను కల్పిస్తుందని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. బలహీమైన దేశాల కు సాయపడడం లో, అన్ని దేశాల ను కలుపుకొని పోయేటటువంటి అభివృద్ధి ని సమర్థించడం లో, ఆర్థిక భద్రత ను మరియు ప్రపంచ సరఫరా వ్యవస్థల ను బలోపేతం చేయడం లో, బహుళ పక్ష విత్త సంస్థల కు కొత్త కొత్త తరహాలలో ఆర్థిక సహాయాన్ని అందించేందుకు మెరుగైన నమూనాల ను అభివృద్ధి పరచడం లో, జలవాయు పరివర్తన, మహమ్మారులు, ఆర్థిక నాజూకుతనం, పేదరికాన్ని తగ్గించడం, సుస్థిర వృద్ధి లక్ష్యాల (ఎస్ డిజి స్) ను సాధించుకోవడం లో మరియు సార్వజనిక రంగం, ఇంకా ప్రైవేటు రంగం యొక్క విత్త పోషణ తాలూకు అండదండల తో మౌలిక సదుపాయాల కల్పన పరం గా తలెత్తుతున్న అంతరాల ను పూడ్చడం లో జి-20 పోషించవలసి ఉన్న భూమిక ను గురించి కూడా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రముఖం గా ప్రస్తావించారు.

జి-20 కూటమి కి భారతదేశం అధ్యక్షత ను వహించే కాలం లో తత్సంబంధి కార్యాల కు సమర్థన ను అందించేందుకు అధ్యక్షుడు శ్రీ జోకో విడోడో మరియు అధ్యక్షుడు శ్రీ జోసెఫ్ బైడెన్ లు వారి వచనబద్ధత ను ప్రకటించినందుకు గాను వారికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాల ను వ్యక్తం చేశారు.

 

***

 

 



(Release ID: 1876449) Visitor Counter : 154