ప్రధాన మంత్రి కార్యాలయం

జి20శిఖర సమ్మేళనం కోసం ఇండొనేశియా ను సందర్శించనున్న ప్రధాన మంత్రి

Posted On: 10 NOV 2022 7:34PM by PIB Hyderabad

ఇండొనేశియా అధ్యక్షుడు శ్రీ జోకో విడోడో ఆహ్వానించిన మీదట, పదిహేడో జి20 శిఖర సమ్మేళనం లో పాలుపంచుకోవడం కోసం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవంబరు 14 వ తేదీ మొదలుకొని 16వ తేదీ వరకు ఇండొనేశియా లోని బాలి ని సందర్శించనున్నారు.

బాలి సమిట్ క్రమం లో, జి20 సభ్యత్వ దేశాల కు చెందిన నేత లు ‘‘రికవర్ టుగెదర్, రికవర్ స్ట్రాంగర్’’ అనే ఇతివృత్తం తో సాగే శిఖర సమ్మేళనం లో ప్రపంచానికి ఆందోళనకరంగా ఉన్నటువంటి కీలకమైన అంశాల ను గురించి విస్తృత చర్చోపచర్చల లో పాల్గొంటారు. జి20 కార్యక్రమ పట్టిక లో భాగం గా ఆహారం మరియు శక్తి పరమైనటువంటి భద్రత; ఆరోగ్యం; మరియు డిజిటల్ పరిణామం అనే మూడు విషయాల కు సంబంధించిన వర్కింగ్ సెశన్ లను నిర్వహించడం జరుగుతుంది.

శిఖర సమ్మేళనం ముగింపు సమావేశం లో అధ్యక్షుడు శ్రీ విడోడో జి20 అధ్యక్ష బాధ్యతల ను ప్రతీకాత్మకం గా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి అప్పగిస్తారు. భారతదేశం 2022వ సంవత్సరం డిసెంబర్ ఒకటో తేదీ న జి20 అధ్యక్ష బాధ్యత ను నియమం ప్రకారం తీసుకోనుంది.

శిఖర సమ్మేళనం క్రమం లోనే మరో వైపు, ప్రధాన మంత్రి కొన్ని ఇతర సభ్యత్వ దేశాల ప్రధానుల తో ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహిస్తారు. ప్రధాన మంత్రి బాలి లో భారతీయ సముదాయం తో భేటీ కావడం తో పాటు గా వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు కూడాను.

 

***

 



(Release ID: 1875655) Visitor Counter : 86