పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఈజిప్టులో కాప్ 27సమావేశాల సందర్భంగా వాతావరణం కోసం మడ అడవుల కూటమి ప్రారంభోత్సవం సందర్భంగా ప్రసంగించిన కేంద్ర పర్యావరణం, అడవుల శాఖ మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్

Posted On: 08 NOV 2022 5:33PM by PIB Hyderabad

ముఖ్యాంశాలు :
–అంతర్జాతీయంగా మడ అడవుల రక్షణకు  సంబంధించి ప్రపంచదేశాలను దగ్గర చేసేందుకు ఎంఎసి ఉపకరిస్తుంది.
–మడ అడవుల పునరుద్ధరణలో ఇండియాకు గల అపార అనుభవం ప్రపంచ దేశాలకు పనికిరానుంది
– మడ అడవుల కార్యక్రమాన్ని జాతీయ ఆర్ఇడిడి ప్లస్ కార్యక్రమంతో అనుసంధానించడం ప్రస్తుత అవసరం
‌‌– కేంద్ర పర్యావరణం, అడవులు వాతావరణ శాఖ మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్ వాతావరణం కోసం మడ అడవుల కూటమి
ప్రారంభోత్సవంలో ప్రసంగించారు. ఈ కూట మి ప్రారంభోత్సవం ఈజిప్ట్లోని షామ్ ఎల్ ‌‌షేక్లో జరుగుతున్న కాప్ 27
సందర్భంగా జరిగింది.

 

ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ శ్రీ భూపేంద్ర యాదవ్, “
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యుఎఇ) వాతావరణమార్పు, పర్యావరణ శాఖ మంత్రి మరియం బింట్ మహ్మద్ అల్మెరికి, ఇండొనేసియా అడవులు, పర్యావరణ శాఖ మంత్రి సిటి నుర్బయ బకర్ కు  ఈ ఈవెంట్ను ఏర్పాటు చేసినందుకు  కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.  ఈ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా గల దేశాలను మడ అడవుల అభివృద్ధికి ఒక గొడుగుకిందికి తీసుకువస్తుండడం సంతోషదాయకం. మడ అడవులు ప్రకృతి వరప్రసాదం. మడ అడవులు ప్రపంచంలోని అత్యంత ఉత్పాదకతతో కూడిన పర్యావరణ వ్యవస్థలుగా  చెప్పుకోవచ్చు.ఈ మడఅడవులు, పలు జీవరాశులకు ఆలవాలంగా నిలుస్తాయి. ఇది కోస్తా తీర ప్రాంతం కోతకు గురికాకుండా ఉపయోగపడుతుంది.  కార్బన్ ను గ్రహించి లక్షలాది మందికి జీవనోపాధి కల్పిస్తుంది. జీవజంతుజాలానికి ఆవాసంగా ఉంటుంది. 

మడ అడవులు ఉష్ణమండల ప్రాంతంలో, ఉప ఉష్ణమండల ప్రాంతలో ప్రపంచంలోని  123 దేశాలలో విస్తరించి ఉన్నాయి. మడ అడవులు అత్యంత కార్బన్ అధికంగా ఉండే అడవులలో ఒకటి ప్రపంచంలోని ఉష్ణమండల అడవులచే విస్తరింపబడి 3 శాతం కార్బన్ ను అవి కలిగి ఉంటాయి. మడ అడవులు పలు ఉష్ణమండల కోస్తా ప్రాంతాలలో అక్కడి ఆర్ధిక వ్యవస్థకు అవి పునాదులుగా ఉన్నాయి. నీలి ఆర్థిక వ్యవస్థ సుస్థిరంగా కొనసాగడానికి కోస్తా లో మడ అడవుల ప్రాధాన్యత ఎంతో ఉంది. ప్రత్యేకించి ఉష్ణమండల ద
దేశాల విషయంలో ఇవి స్థానికంగా, జాతీయంగా , అంతర్జాతీయంగా ఎంతో అవసరం .మడ అడవులు ప్రకృతిసిద్ధమైన సైనిక బలగాల వంటివి. ఇవి ఎక్కడైనా సర్దుకుపోగలవు. ఉష్ణమండలమైనా, ఉప ఉష్ణ మండలమైనా ఇవి కొనసాగుతాయి.  మడ అడవులు ఉష్ణమండల, ఉప ఉష్ణమండల దేశాలకు సహజసిద్ధమైన రక్షణ కవచాలుగా,  ఉపయోగపడతాయి.సముద్ర మట్టం పెరుగుదల, ప్రకృతి వైపరీత్యాల తరచూ సంభవించడం, తుపాన్లు, అలల ఉధృతి వంటి వాటినుంచి తీర ప్రాంతాలను కాపాడడానికి వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.

గౌరవనీయ ప్రతినిధులారా,
2030 నాటికి భారతదేశం 2.5 నుంచి 3 బిలియన్ టన్నుల కార్బన్డయాక్సైడ్కు   సమానమైన స్థాయిలో కార్బన్డయాక్సైడ్ను గ్రహించి ఆక్సిజన్ ను విడుదల చేసే
అడవులను , చెట్లను పెద్ద ఎత్తున పెంచాలని ఇండియా తన ఎన్ డి సిలో స్పష్టంగా పేర్కొని దానికి కట్టుబడి ఉంది.
వాతావరణంలో జిహెచ్జి ఘాడతను తగ్గించడంలో మడ అడవులకు గొప్ప శక్తి ఉందని గమనించాం.
ఉష్ణమండల అడవుల కంటే ,మడ అడవులు నాలుగు నుంచి 5 రెట్లు కార్బన్ ఉద్గారాలను గ్రహించగలవని పరిశోధనలలో వెల్లడైంది.
అలాగే మడ అడవులు సముద్రాలు ఆమ్లీకరణం కాకుండా కాపాడడంలో ఇవి రక్షణ వలయంగా పనిచేస్తాయి. అలాగే మైక్రో ప్లాస్టిక్లను అడ్డుకుంటాయి.
మడ అడవుల పెంపకం ద్వారా కొత్తగా కార్బన్ డయాక్సైడ్ ను వాతావరణం నుంచి గ్రహించే శక్తి పెరుగుతుంది. అలాగే మడ అడవులు కొట్టివేయకుండా ఉండడంవల్ల
వీటి వ్యర్థాలనుంచి వచ్చే ఉద్గారాలూ తగ్గుతాయి. కార్బన్ సమతుల్యతను సాధించడానికి ఆయా దేశాలు తమ ఎన్డిసి లక్ష్యాలను సాధించడానికి
మడ అడవులను పెంచడం సరైన ప్రత్యామ్నాయం.

ఘనత వహించిన ప్రముఖులారా,
ఇండియా, సహజసిద్ధమైన పర్యావరణాన్ని పరిరక్షించడానికి, దానిని పునరుద్ధరించడానికి కట్టుబడి ఉంది. అలాగే మడ అడవుల పరిరక్షణ, సమర్ధ నిర్వహణకు ఇండియా గట్టిగా  కట్టుబడి ఉంది. ప్రపంచంలోనే అత్యంత విస్తారమైన మడఅడవులు సుందర్ బన్ అడవులు. ఇవి జీవవైవిద్యాన్ని కాపాడడంలో అద్భుతంగా ఉపయోగపడుతున్నాయి. భూతల,
సముద్ర తల పర్యావరణాన్ని కాపాడడంలో, వివిధ రకాల జీవ జంతుజాలాన్ని కాపాడడంలో, ఫల పుష్పాలను కాపాడడంలో ఇవి ఎంతో ఉపకరిస్తున్నాయి. బెంగాల్ టైగర్, ఇతర అంతరించిపోతున్న జీవ జంతుజాలాన్ని రక్షించడంలో, మొసళ్లు, కొండచిలువలను అంతరించి పోకుండా చూడడంలో వీటి పాత్ర ఎంతో ఉంది. ఇండియాలో అండమాన్ ప్రాంతంలో , సుందర్ బన్ , గుజరాత్ ప్రాంతంలో మడ అడవుల విస్తీర్ణం బాగా పెరిగింది.

కాప్ సదస్సులో పాల్గొంటున్న ప్రముఖులు, అతిథులు, గౌరవ ప్రతినిధులారా,
మడ అడవుల పునరుద్ధరణలో భారతదేశానికి ఐదు దశాబ్దాలకు పైగా ప్రత్యేక అనుభవం ఉంది.తూర్పు, పశ్చిమ తీర ప్రాంతంలో వివిధ రకాల మడ అడవులను పునరుద్ధరించి, వాటి పర్యావరణాన్ని కాపాడిన చరిత్ర ఉంది.ఘనత వహించిన ప్రతినిధులు, ప్రముఖులారా,  వాతావరణ పరిరక్షణకు మడ అడవుల కూటమి (ఎంఎసి) ప్రారంభోత్సవం
సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మడ అడవులను కాపాడడానికి వివిధ దేశాల మధ్య సహకారానికి,అంతర్జాతీయంగా పర్యావరణ లక్ష్యాలు నెరవేర్చడానికి ఇది ఉపకరిస్తుంది. మడ అడవుల పెంపకం, సంరక్షణను జాతీయఆర్.ఇ.డి.డి ప్లస్ లో భాగం చేయాలి., అడవుల నరికివేత, అడవుల క్షీణతనుంచి కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు వెలువడే పరిస్థితిని తగ్గించడం తక్షణావసరంగా చూడాలి.

మడ అడవుల పునరుద్ధరణలో ,పర్యావరణ అధ్యయనంలో, కర్బన ఉద్గారాలు తగ్గించడంలో భారతదేశానికి అపారమైన అనుభవం ఉంది. ఈ అనుభవం
అంతర్జాతీయంగా ఈ రంగం గురించిన విజ్ఞానాన్ని ప్రపంచానికి అందించడానికి ఎంతో ఉపకరిస్తుంది. తీరప్రాంతాన్ని సంరక్షించడంలో అద్భుతంగా ఉపయోగపడే మడ అడవుల సంరక్షణకు చేతులు కలుపుదాం రండి. ఇది వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి సుస్థిర పర్యారణానికి ఎంతో దోహదపడుతుంది.’’

మరిన్ని రెఫరెన్సులకు:
ఇండియాలో మడ అడవుల సంరక్షణకు సంబంధించి మరింత చదివేందుకు కింద క్లిక్ చేయండి
ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021ను ఇక్కడ చూడవచ్చు.
మమ్మల్ని సంప్రదించడానికి ఈ మెయిల్

    envforestpib[at]gmail[dot]com


(Release ID: 1874611) Visitor Counter : 370