ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రెవెన్యూ లోటు గ్రాంట్ (ఆర్ డి జి) కింద 14 రాష్ట్రాలకు రూ.7,183.42 కోట్లు విడుదల


ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రాష్ట్రాలకు విడుదల చేసిన మొత్తం
రెవెన్యూ లోటు గ్రాంటు రూ.57,467.33 కోట్లకు చేరుకుంది

2022-23 లో రాష్ట్రాలకు అందే రెవిన్యూ లోటు గ్రాంటు రూ. 86,201 కోట్లు

Posted On: 07 NOV 2022 2:17PM by PIB Hyderabad

ఆర్థిక మంత్రిత్వ శాఖ వ్యయ విభాగం, ఈరోజు పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ లోటు (పిడిఆర్డి) గ్రాంట్ కింద 8వ నెలవారీ వాయిదా 14 రాష్ట్రాలకు రూ. 7,183.42 కోట్లు విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ఈ గ్రాంట్‌ విడుదలైంది. 

పదిహేనవ ఆర్థిక సంఘం మొత్తం డెవల్యూషన్ అనంతర రెవెన్యూ లోటు గ్రాంట్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి 14 రాష్ట్రాలకు రూ.86,201 కోట్లుగా  సిఫార్సు చేసింది. గ్రాంట్‌ను 12 సమానమైన నెలవారీ వాయిదాలలో సిఫార్సు అయిన  రాష్ట్రాలకు వ్యయ శాఖ విడుదల చేస్తుంది. 2022 నవంబర్ నెలలో 8వ విడత విడుదల చేయడంతో, 2022-23లో రాష్ట్రా లకు విడుదల చేసిన రెవెన్యూ లోటు గ్రాంట్ల మొత్తం రూ. 57,467.33 కోట్లుకి  చేరుకుంది 

 రాజ్యాంగంలోని ఆర్టికల్ 275 ప్రకారం డివల్యూషన్ తర్వాత రెవెన్యూ లోటు గ్రాంట్లు రాష్ట్రాలకు కేటాయిస్తారు. విభజన తర్వాత రాష్ట్రాల రెవెన్యూ ఖాతాలలోని అంతరాన్ని తీర్చడానికి వరుసగా ఆర్ధిక కమీషన్ల సిఫార్సుల మేరకు గ్రాంట్లు రాష్ట్రాలకు విడుదల అవుతాయి. 

2020-21 నుండి 2025-26 వరకు రాష్ట్రాలు ఈ గ్రాంట్‌ని స్వీకరించడానికి అర్హత, గ్రాంట్ పరిమాణాన్ని పదిహేనవ ఆర్థిక సంఘం అంచనా వేసిన తర్వాత రాష్ట్ర ఆదాయ, వ్యయాల మదింపు మధ్య అంతరం ఆధారంగా నిర్ణయించింది. 

2022-23లో పదిహేనవ ఆర్థిక సంఘం ద్వారా డెవల్యూషన్ అనంతర రెవెన్యూ లోటు గ్రాంట్‌ను సిఫార్సు చేసిన రాష్ట్రాలు: ఆంధ్రప్రదేశ్, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, కేరళ, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్, మరియు పశ్చిమ బెంగాల్.

2022-23కి సిఫార్సు చేసిన పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ లోటు గ్రాంట్, 8వ విడతగా రాష్ట్రాలకు విడుదల చేసిన మొత్తం వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

రాష్ట్రాల వారీగా  విడుదల అయిన  డెవల్యూషన్ అనంతర రెవెన్యూ లోటు గ్రాంట్ (పిడిఆర్డిజి)

(రూ. కోట్లలో )

క్రమ సంఖ్య 

రాష్ట్రం 

నవంబర్, 2022 నెలలో విడుదల అయిన 8వ వాయిదా 

2022-23లో రాష్ట్రాలకు విడుదల చేసిన మొత్తం పిడిఆర్డిజీ

1

ఆంధ్రప్రదేశ్

879.08

7032.67

2

అస్సాం

407.50

3260.00

3

కేరళ

1097.83

8782.67

4

మణిపూర్

192.50

1540.00

5

మేఘాలయ

86.08

688.67

6

మిజోరం

134.58

1076.67

7

నాగాలాండ్

377.50

3020.00

8

పంజాబ్

689.50

5516.00

9

రాజస్థాన్

405.17

3241.33

10

సిక్కిం

36.67

293.33

11

త్రిపుర

368.58

2948.67

12

ఉత్తరాఖండ్

594.75

4758.00

13

పశ్చిమ బెంగాల్

1132.25

9058.00

 

****


(Release ID: 1874581) Visitor Counter : 122