సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ఐ.ఎఫ్.ఎఫ్.ఐ 53 లో ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ పీకాక్ కోసం 15 సినిమాలు పోటీ
ఐ.ఎఫ్.ఎఫ్.ఐ 53 ఇంటర్నేషనల్ కాంపిటీషన్ సెగ్మెంట్ లో 12 ఇంటర్నేషనల్ 3 ఇండియన్ సినిమాలు
నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలో జరగనున్న 53 వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 53వ ఎడిషన్) లో బంగారు నెమలి (గోల్డెన్ పీకాక్) కోసం 15 చిత్రాలు పోటీపడనున్నాయి. ఉవ్విళ్ళూరించే వరసలో 12 అంతర్జాతీయ, 3 భారతీయ చిత్రాలు ఉన్నాయి, ఇవి కళలు, రాజకీయాలలో అభివృద్ధి చెందుతున్న ధోరణులకు అద్దం పడతాయి.
మొట్ట మొదటిసారిగా ఐ.ఎఫ్.ఎఫ్.ఐ 3వ ఎడిషన్ నుండి ఇస్తున్న గోల్డెన్ పీకాక్ అవార్డు ఆసియాలో అత్యంత డిమాండ్ ఉన్న చలనచిత్ర పురస్కారాలలో ఒకటిగా నిలిచింది. విజేతను ఎంపిక చేసే క్లిష్టమైన బాధ్యత ను నిర్వర్తించే జ్యూరీలో ఈ సారి ఇజ్రాయెల్ రచయిత, చిత్ర దర్శకుడు నడవ్ లాపిడ్, అమెరికన్ నిర్మాత జింకో గోటోహ్, ఫ్రెంచ్ ఫిల్మ్ ఎడిటర్ పాస్కేల్ చవాన్సే, ఫ్రెంచ్ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్, ఫిల్మ్ క్రిటిక్, జర్నలిస్ట్ జేవియర్ అంగులో బార్టురెన్, భారతదేశానికి చెందిన ప్రముఖ సొంత చిత్రాల దర్శకుడు సుదీప్తో సేన్ లను చేర్చారు.
ఈ సంవత్సరం పోటీలో ఉన్న చిత్రాలు ఇవి:
1.పర్ ఫెక్ట్ నెంబర్ (2022)
పోలిష్ ఫిల్మ్ మేకర్ క్రిస్జ్టోఫ్ జానుస్సి పర్ ఫెక్ట్ నెంబర్ చిత్రం నైతికత , మరణంపై ఆలోచనలను రేకెత్తిస్టుంది. ఇటలీ ఇజ్రాయిల్ లతో కలిసి నిర్మించిన ఈ చిత్రం, ఈ చిత్రం ఒక యువ గణిత శాస్త్రజ్ఞుడు అతని దూరపు బంధువు మధ్య సంబంధాన్ని విశ్లేషిస్తుంది . వారి ఇద్దరి మధ్య ఒక సమావేశం ఎలా రహస్యమైన ప్రపంచ క్రమం, జీవితం , దాని గమనం ఎటు దారి తీసిందో వివరిస్తుంది.
2. రెడ్ షూస్(2022)
మెక్సికన్ చలనచిత్ర నిర్మాత కార్లోస్ ఐచెల్మాన్ కైజర్ తన చిత్రం రెడ్ షూస్ ను అన్నింటికన్నా ఎక్కువగా భావోద్వేగ ప్రతిబింబంగా మలిచాడు. ఒంటరి జీవితాన్ని గడుపుతున్న ఒక రైతు కు తన కుమార్తె మరణ వార్త తెలుస్తుంది. మృతదేహాన్ని తనకు తెలియని దారిలో ఇంటికి తీసుకురావడానికి ఆ రైతు చేసిన ప్రయత్నాన్ని హృద్యంగా ఆవిష్కరిస్తుంది.
అనేక అవార్డ్ లకు నామినేట్ కావడంతో పాటు ఈ చిత్రం వెనిస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఆడియెన్స్ అవార్డ్ కు పోటీగా నిలిచింది.
3. ఎ మైనర్(2022)
1970 దశకం లో ఇరానియన్ న్యూ వేవ్ వ్యవస్థాపక సభ్యుడు, దరియూష్ మెహర్జుయి ఇరానియన్ సినిమా ప్రేమికులలో బాగా ప్రసిద్ధి చెందాడు. ఈ మాస్ట్రో తన తాజా చిత్రం ఎ మైనర్ తో ఐఎఫ్ ఎఫ్ ఐకి తిరిగి వచ్చాడు. ఈ చిత్రం తన తండ్రి నుండి వ్యతిరేకత ఉన్నప్పటికీ సంగీతకారిణి కావాలని కోరుకునే ఒక అమ్మాయి గురించి. ఒకే కుటుంబ సభ్యుల మధ్య సంక్లిష్ట సమీకరణాలు, తల్లిదండ్రులు - పిల్లల మధ్య భిన్నమైన ఆకాంక్షలు , సంగీతం శక్తి కోణాలను ఈ చిత్రం చూపుతుంది.
4. నో ఎండ్ (2021)
ఇరానియన్ డ్రామా, నో ఎండ్ ఇరాన్ లోని రహస్య పోలీసుల ఎత్తులు, కుయుక్తులను చిత్రీకరిస్తుంది. ఒక వ్యక్తి, తన ఇంటిని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నంలో రహస్య పోలీసుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటాడు. నిజమైన రహస్య పోలీసు ప్రవేశించినప్పుడు విషయాలు సంక్లిష్టంగా ఉంటాయి. జాఫర్ పనాహి సహచరుడు నాదర్ సైవర్ తీసిన ఈ రెండవ చిత్రం బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో న్యూ కరెంట్స్ అవార్డుకు నామినేట్ అయింది. జాఫర్ పనాహి సలహాదారుగా , సంపాదకుడిగా ఘనత పేరు గాంచారు.
5. మెడిటరేనియన్ ఫీవర్ (2022)
పాలస్తీనా-ఇజ్రాయిల్ రచయిత-దర్శకుడు మహా హజ్ నిర్మించిన మెడిటరేనియన్ ఫేవర్ ఇద్దరు మధ్య వయస్కుల 'ఫ్రెనెమీస్' గురించిన ఒక బ్లాక్ కామెడీ.
కేన్స్ అన్ సెర్టైన్ రిగార్డ్ పోటీలో ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు పొందిన ఈ చిత్రం ఔత్సాహిక రచయిత , ఒక చిన్న టైమ్ క్రూక్ మధ్య అవకాశం లేని భాగస్వామ్యం చుట్టూ ఈ చిత్రం అల్లబడింది.
6. వెన్ ది వేవ్స్ ఆర్ గాన్ (2022)
ఫిలిప్పినో చలనచిత్ర నిర్మాత లవ్ డియాజ్ నిర్మించిన చిత్రం వెన్ ది వేవ్స్ ఆర్ గాన్ ఫిలిప్పీన్స్ లో తీవ్రమైన నైతిక సంకటం లో ఉన్న ఒక పరిశోధకుని కథ. తీవ్రమైన ఆందోళన , అపరాధం నుండి బయట పడేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ అతనిని వెంటాడుతున్న అతని చీకటి గతాన్ని ఈ చిత్రం చర్చిస్తుంది. తన స్వంత శైలి నీ అభివృద్ధి చేయడంలో ప్రసిద్ధి చెందిన లవ్ డియాజ్, (ఆయన 2004 చిత్రం, ఎవల్యూషన్ ఆఫ్ ఎ ఫిలిప్పినో ఫ్యామిలీ, దాదాపు 11 గంటల రన్ టైమ్ ను కలిగి ఉంది) ఈ చిత్రం గురించి బాగా చెప్పడానికి కేవలం 3 గంటల కంటే ఎక్కువ సమయం పడుతుందని నిర్ణయించుకున్నాడు.
7. ఐ హేవ్ ఎలెక్ట్రిక్ డ్రీమ్స్ (2022)
కోస్టా రికన్ ఫిల్మ్ మేకర్ వాలెంటినా మౌరెల్ చిత్రం ఐ హావ్ ఎలక్ట్రిక్ డ్రీమ్స్ 2022 లోకార్నో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమ దర్శకుడి అవార్డును గెలుచుకుంది. విడాకులు తీసుకున్న తల్లిదండ్రులతో ఉన్న ఇవా అనే 16 ఏళ్ల అమ్మాయి, తన తండ్రిని అంటిపెట్టుకుని ఉన్న కథను ఈ నాటకం చెబుతుంది.
తల్లి అతనితో తిరిగి కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, తన తండ్రి , తన గురించి ఆశ్చర్యకరమైన లక్షణాలను ఆమె కనుగొంటుంది. లోకార్నో ఇంటర్నాటోనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో రీనాల్డో అమియన్ ఉత్తమ నటుడు , డానియేలా మారిన్ నవరో ఉత్తమ నటిగా గెలుపొందడంతో ఈ చిత్రం మరింత గుర్తింపు తెచ్చుకుంది.
8. కోల్డ్ యాజ్ మార్బుల్ (2022)
అజర్ బైజాన్ దర్శకుడు అసిఫ్ రుస్తమోవ్ చిత్రం కోల్డ్ యాజ్ మార్బుల్ క్రైమ్-డ్రామా/సైకో-థ్రిల్లర్. తన భార్యను హత్య చేసినందుకు జైలు శిక్ష అనుభవించిన ఒక తండ్రి ఊహించని విధంగా తిరిగి రావడం గురించి చెబుతుంది. మారుతున్న సమాజానికి యాంటీ హీరో అని దర్శకుడు అభివర్ణించిన ఓ యువకుడిపై ఈ సినిమా ఫోకస్ ఉంది. సున్నితమైన చిత్రకారుడు సమాధి చెక్కిన కథానాయకుడు చివరికి తన తండ్రి తన తల్లిని ఎందుకు చంపాడో తెలుసుకున్నప్పుడు అతని జీవితంలో షాక్ కు గురవుతాడు.
9. ది లైన్(2022)
బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో గోల్డెన్ బేర్ కు నామినేట్ చేయబడిన ఉర్సులా మీయర్ ది లైన్ చిత్రం అంగీకారం , సున్నితమైన కుటుంబ బంధాల అధ్యయనం. ఫ్రెంచ్-స్విస్ నిర్మాత తీసిన ఈ చిత్రం తల్లీకూతుళ్ల మధ్య కల్లోలమైన సంబంధాన్ని అన్వేషిస్తుంది. స్విట్జర్లాండ్ లో చిత్రీకరించిన ఈ నాటకం, మాతృత్వం హింస రెండింటి సాధారణ కలయికను కలిగి ఉంది
10. సెవెన్ డాగ్స్ (2021)
కైరో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 43 వ ఎడిషన్ లో ప్రీమియర్ అయిన సెవెన్ డాగ్స్ చిత్రం తీవ్రమైన డబ్బు సమస్యలతో బాధపడుతున్నప్పటికీ తన ఏడు కుక్కలను పెంచడానికి ఒంటరి మనిషి చేసిన పోరాటాల గురించి వివరిస్తుంది.
అర్జెంటీనా దర్శకుడు రోడ్రిగో గుయెర్రెరో నాల్గవ చిత్రం ఇది. కేవలం 80 నిమిషాల రన్ టైమ్ తో, ఈ చిత్రం ఒక మనిషి , అతని పెంపుడు జంతువుల మధ్య బంధాన్ని ఆసక్తికరంగా చూపుతుంది.
11. మారియా: ది ఓషన్ యాంజెల్
(2022)
శ్రీలంక చలనచిత్ర నిర్మాత అరుణ జయవర్ధన తీసిన మారియా: ది ఓషన్ ఏంజెల్ గోల్డెన్ పీకాక్ ను గెలుచుకున్న రెండవ శ్రీలంక చిత్రంగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది, ఇది లెస్టర్ జేమ్స్ పెరిస్ గాంపెరలియా తరువాత పూర్తి 50 ఐ.ఎఫ్.ఎఫ్.ఐ ఎడిషన్లను గెలుచుకుంది, ఇది మొదటిసారి ఐఎఫ్ఎఫ్ఐ పోటీ పండుగగా నిర్వహించబడింది. మారియా: ది ఓషన్ ఏంజెల్, సముద్రంలో మునిగిపోయిన ఒక సెక్స్ డాల్ ను కనుగొన్న తరువాత జీవితాలు చెదిరిపోయిన మత్స్యకారుల సమూహం గురించిన చిత్రం. ఈ చిత్ర దర్శకుడు తన 2011 చిత్రం ఆగస్టు డ్రిజిల్ తో మంచి గుర్తింపు పొందాడు.
12. ది కశ్మీర్ ఫైల్స్ (2022)
ది కాశ్మీర్ ఫైల్స్ 1990 లో కాశ్మీర్ నుండి వలస వచ్చిన కాశ్మీరీ పండిట్ల చుట్టూ కేంద్రీకృతమైన హిందీ చిత్రం. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ కథ, తన తల్లిదండ్రుల అకాల మరణం గురించి నిజం తెలుసుకోవడానికి బయలుదేరిన యువ కళాశాల విద్యార్థి కృష్ణ చుట్టూ తిరుగుతుంది.
13. నెజౌహ్ (2022)
2022 వెనిస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఆడియెన్స్ అవార్డ్ గెలుచుకున్న నెజౌహ్, యుద్ధంతో అతలాకుతలమైన సిరియాలోని ఒక కుటుంబం గురించిన డ్రామా. అరబ్బీ చిత్రం. సిరియాలోని ముట్టడి చేయబడిన ప్రాంతం వెనుక ఉండాలని నిర్ణయించుకునే కుటుంబం గురించి. వారి పొరుగు ప్రాంతంపై బాంబు దాడి జరిగినప్పుడు మొదటిసారిగా ఆమె తన ఇంటి వెలుపల జీవితాన్ని అనుభవించడాన్నీ తన సినిమా చెబుతుందని దర్శకుడు సౌదాడే కాదన్ తెలిపారు.
14. ది స్టోరీ టెల్లర్ (2022)
అనంత్ మహదేవన్ చిత్రం ది స్టోరీ టెల్లర్ లెజెండరీ రచయిత సత్యజిత్ రే పాత్ర తరిణి ఖురో ఆధారంగా తీసిన చిత్రం. స్టోరీ టెల్లర్ గా మారడానికి తన ఉద్యోగం నుండి రిటైర్ అయిన తరువాత తరిణి ఖురో ఒక విచిత్రమైన పరిస్థితిలో తనను తాను ఎలా కనుగొంటాడు అనేదే ఈ కథ. ఈ చిత్రం 2022 బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కిమ్ జి-సియోక్ అవార్డుకు నామినేట్ చేయబడింది, అక్కడ ఇది ప్రదర్శించబడింది.
15. కురాంగు పెడల్ (2022)
రాశి అలగప్పన్ రాసిన 'సైకిల్' అనే చిన్న కథ ఆధారంగా దర్శకుడు కమలాకన్నన్ రూపొందించిన చిత్రం కురంగు పెడల్. తన తండ్రి తనకు నేర్పించ లేకపోయినప్పటికీ సైకిల్ తొక్కడం నేర్చుకోవాలని కోరుకునే ఒక స్కూల్ కుర్రాడు గురించిన కథ. గ్రామీణ నేపథ్యం కలిగిన ఈ చిత్రం ఐదుగురు పిల్లలపై ఆధారపడి ఉంటుంది. ఈ చిత్ర దర్శకుడు 2012లో వచ్చిన మధుబానకడై సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
****
(Release ID: 1874280)
Visitor Counter : 312
Read this release in:
Kannada
,
Assamese
,
English
,
Marathi
,
Hindi
,
Punjabi
,
Tamil
,
Gujarati
,
Urdu
,
Bengali
,
Manipuri
,
Malayalam