సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ఐజ్వాల్ లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ అఫ్ మాస్ కమ్యూనికేషన్ ఈశాన్య ప్రాంత రీజినల్ క్యాంపస్ ని ప్రారంభించిన రాష్ట్రపతి
Posted On:
04 NOV 2022 1:39PM by PIB Hyderabad
మిజోరం పర్యటనలో ఉన్న రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఈరోజు ఐజ్వాల్‌లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ శాశ్వత ఈశాన్య ప్రాంత క్యాంపస్‌ను ప్రారంభించారు. క్యాంపస్ స్వల్ప వ్యవధి మీడియా, కమ్యూనికేషన్ కోర్సులతో పాటు ఇంగ్లీష్ జర్నలిజం, డిజిటల్ మీడియాలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులను నిర్వహిస్తుంది.
భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కింద నడుస్తున్న స్వయంప్రతిపత్త సంస్థఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ (ఐఐఎంసి), దేశంలోనే జర్నలిజంలో ఒక ప్రీమియర్ ఇన్‌స్టిట్యూట్. న్యూఢిల్లీలోని ప్రధాన క్యాంపస్‌తో, ఐఐఎంసి ఒడిషాలోని దెంకనల్, మిజోరంలోని ఐజ్వాల్, జమ్మూ కాశ్మీర్లో లోని జమ్ము, కేరళలోని కొట్టాయం,మహారాష్ట్రలోని అమరావతిలో ఐదు ప్రాంతీయ క్యాంపస్‌లను కలిగి ఉంది. ప్రాంతీయ క్యాంపస్‌లను దేశవ్యాప్తంగా మీడియా విద్య అవసరాన్ని తీర్చడం లక్ష్యంగా ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, “ఐజ్వాల్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ శాశ్వత క్యాంపస్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉంది, ఇది మొత్తం ఈశాన్య రాష్ట్రాలలో మీడియా, మాస్ కమ్యూనికేషన్ అధ్యయనాలకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఐఐఎంసి అనేది మీడియా, మాస్ కమ్యూనికేషన్ డొమైన్‌లో కొత్త ఆలోచనలు, సృజనాత్మకత, పరిశోధన, ఆవిష్కర్తలను అభివృద్ధి చేసే డైనమిక్ లెర్నింగ్, అభ్యాస వాతావరణాన్ని అందించే ఒక గౌరవప్రదమైన సంస్థ" అని అన్నారు.
ఐఐఎంసి నార్త్ ఈస్ట్ క్యాంపస్ 2011లో మిజోరాం విశ్వవిద్యాలయం అందుబాటులో ఉంచిన తాత్కాలిక భవనం నుండి పని చేయడం ప్రారంభించింది. క్యాంపస్ నిర్మాణ పనులు 2015లో ప్రారంభమై 2019లో పూర్తయ్యాయి. మొత్తం వ్యయం రూ. 25 కోట్లు. మిజోరాం విశ్వవిద్యాలయం ఇచ్చిన 8 ఎకరాల స్థలంలో ఐఐఎంసి శాశ్వత క్యాంపస్‌లో హాస్టళ్లు మరియు స్టాఫ్ క్వార్టర్‌లతో పాటు ప్రత్యేక అడ్మినిస్ట్రేటివ్, అకడమిక్ భవనాలు ఉన్నాయి.
దాని ప్రారంభం నుండి, క్యాంపస్ ఇంగ్లీష్ జర్నలిజంలో పీజీ డిప్లొమా కోర్సును అందిస్తోంది, దీని కోసం చాలా మంది విద్యార్థులు భారతదేశంలోని ఇతర ప్రాంతాల నుండి,కొంతమంది ఈశాన్య రాష్ట్రాల నుండి వచ్చారు. ఈ సంవత్సరం, అన్ని ఐఐఎంసి క్యాంపస్‌లలో ఇంగ్లీష్ జర్నలిజంలో రెండవసారి టాపర్‌గా నిలిచినందుకు ఇన్‌స్టిట్యూట్ గర్విస్తుంది.
క్యాంపస్ తన విద్యార్థులను క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లు, వారి స్వంత ప్రయత్నాల ద్వారా దేశవ్యాప్తంగా ప్రసిద్ధ మీడియా సంస్థల్లో ఉద్యోగాలు పొందేలా చేస్తుంది. ప్రతి సంవత్సరం విద్యార్థులు, దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో, పిటిఐ, ఇతర ప్రముఖ ప్రైవేట్ మీడియా సంస్థలలో తమ స్వంతగానే సముచితమైన ఉద్యోగాలను పొందుతున్నారు.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ (ఐఐఎంసీ), న్యూఢిల్లీ 1965లో దేశంలో, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలలో మీడియా నిపుణుల శిక్షణ అవసరాలను తీర్చడానికి ప్రారంభం అయింది. అప్పటి నుండి ఇది ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ కోసం శిక్షణా సంస్థగా కూడా పనిచేసింది
***
(Release ID: 1873970)
Visitor Counter : 109