కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నకిలీ ఎస్ఎంఎస్ పై సత్వర దర్యాప్తు చేపట్టి సంభావ్య ఆర్థిక మోసాన్ని నివారించిన ఎన్ఐసి నకిలీ ఎస్ఎంఎస్ల పట్ల అప్రమత్తంగా ఉండవలసిందిగా ప్రజలకు హెచ్చరిక

Posted On: 04 NOV 2022 9:16AM by PIB Hyderabad

ఉపాధి కల్పిస్తామంటూ ఎన్ఐసి ముసుగులో నకిలీ ఎస్ఎంఎస్ ను సాధారణ ప్రజలలో చెలామణి  చేయడం గురించిన సమాచారాన్ని  నేషనల్ ఇన్ఫార్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసి) అందుకుంది. నకిలీ ఎస్ఎంఎస్ గురించి సమాచారం అందుకున్న వెంటనే ఎన్ఐసి బృందం తక్షణమే అంతర్గత దర్యాప్తును నిర్వహించి, ఆ నకిలీ ఎస్ఎంఎస్ ఎన్ఐసి ప్రాథమిక సదుపాయాల నుంచి పంపలేదనే విషయాన్ని గుర్తించింది. ఎన్ఐసి బృందం వేగవంతంగా దర్యాప్త చేసేందుకు టెలికాం సర్వీస్ ప్రొవైడర్లతో సమన్వయం అయ్యి, ఆ నకిలీ ఎస్ఎంఎస్ ను ప్రైవేట్ సేవలను అందించే ప్రాథమిక సదుపాయాల నుంచి పంపినట్టు గుర్తించింది. ఆ నకిలీ ఎస్ఎంఎస్ అన్నది ఎన్ఐసి పేరును దుర్వినియోగం చేయడం సైబర్ ఘటనగా, ముఖ్యంగా  ఆర్థిక మోసం కలిగి  ఉండే సంభావ్యతను పరిగణనలోకి తీసుకుని, ఎన్ఐసి వెంటనే ఈ ఘటన గురించి సిఇఆర్టి-ఐఎన్ కు నివేదించడమే కాక, ఆ నకిలీ ఎస్ఎంఎస్ ను పంపిన నిందితులను గుర్తించి, శిక్షించేందుకు చట్ట అమలు సంస్థల వద్ద ఫిర్యాదును నమోదు చేసింది. తదుపరి దుర్వినియోగాన్ని నివారించేందుకు, సిఇఆర్టి-ఐఎన్ తక్షణమే సంబంధిత మధ్యవర్తితో సమన్వయం అయ్యి ఆ మోసపూరిత యుఆర్ఎల్ ను తొలగించేందుకు చర్యలు తీసుకుంది. 
అటువంటి నకిలీ ఎస్ఎంఎస్ గురించి అప్రమత్తంగా ఉండటమే కాక అటువంటి మోసపూరిత ఎస్ఎంఎస్ గురించి incident@cert-in.org.in మరియు https://cybercrime.gov.inకు ఫిర్యాదు చేయవలసిందిగా సాధారణ ప్రజలకు సూచించింది.

***


(Release ID: 1873743) Visitor Counter : 157