ప్రధాన మంత్రి కార్యాలయం
భారతదేశం లో అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుని అధికారిక పర్యటన సందర్భంలో ప్రధాన మంత్రి జారీ చేసిన పత్రికా ప్రకటన పాఠం
Posted On:
25 FEB 2020 1:47PM by PIB Hyderabad
నా మిత్రుడు, యుఎస్ అధ్యక్షుడు శ్రీ డొనాల్డ్ ట్రంప్,
అమెరికా ప్రతినిధి వర్గం లోని మాననీయ సభ్యులు,
మహిళలు మరియు సజ్జనులారా,
నమస్కారం
అధ్యక్షుడు శ్రీ ట్రంప్ కు మరియు ఆయన వెంట విచ్చేసిన ప్రతినిధి వర్గాని కి మరొక్కమారు భారతదేశాని కి ఆప్యాయం గా ఆహ్వానం పలుకుతున్నాను. ఆయన కుటుంబ సమేతం గా ఈ పర్యటన కు విచ్చేయడం నాకు విశేషమైనటువంటి సంతోషాన్ని ఇచ్చింది. గడచిన 8 నెలల కాలం లో అధ్యక్షుడు శ్రీ ట్రంప్ కు మరియు నాకు మధ్య జరిగిన అయిదో సమావేశం ఇది.
మోటేరా లో నిన్నటి రోజు న అధ్యక్షుడు శ్రీ ట్రంప్ కు చరిత్రాత్మకమైనటువంటి మరియు అపూర్వమైనటువంటి స్థాయి లో లభించిన స్వాగతం సదా గుర్తుంచుకోదగ్గది గా ఉంటుంది. భారతదేశాని కి మరియు అమెరికా కు మధ్య గల సంబంధం రెండు ప్రభుత్వాల మధ్య ఉన్న సంబంధం ఒక్కటే కాదని, అది ప్రజల ద్వారా, ప్రజా కేంద్రితమైనటువంటి సంబంధం అని నిన్నటి రోజు న మరొక్కసారి స్పష్టం అయింది. ఈ సంబంధం 21వ శతాబ్దం లో అత్యంత ముఖ్యమైన భాగస్వామ్యాల సరసన నిలుస్తుంది. మరి ఈ కారణం గా ఈ రోజు న అధ్యక్షుడు శ్రీ ట్రంప్ మరియు నేను మా యొక్క సంబంధాన్ని కోమ్ ప్రిహెన్సివ్ గ్లోబల్ స్ట్రటీజిక్ పార్ట్ నర్ శిప్ స్థాయి కి తీసుకుపోవాలని నిర్ణయించాము. సంబంధాల ను ఈ స్థాయి కి తీసుకు రావడం లో అధ్యక్షుడు శ్రీ ట్రంప్ ఒక అమూల్యమైనటువంటి తోడ్పాటు ను అందించారు.
మిత్రులారా,
నేటి మా చర్చ లో భాగం గా మేము ఈ భాగస్వామ్యం తాలూకు ప్రతి ఒక్క ముఖ్య అంశాన్ని- అది రక్షణ, లేదా భద్రత కావచ్చు, శక్తి రంగం లో వ్యూహాత్మక భాగస్వామ్యం కావచ్చు, సాంకేతిక విజ్ఞాన సంబంధిత సహకారం కావచ్చు, గ్లోబల్ కనెక్టివిటీ కావచ్చు, వ్యాపార సంబంధాలు కావచ్చు లేదా ప్రజా సంబంధాలు కావచ్చు- వాటిని మేము సకారాత్మకం గా పరిశీలించాం. రక్షణ పరమైన మరియు భద్రత పరమైన సహకారాన్ని భారతదేశం, యుఎస్ ల మధ్య పెంపొందించుకోవాలనేది మా వ్యూహాత్మక భాగస్వామ్యం లో అతి ముఖ్యమైనటువంటి భాగం గా ఉన్నది. అత్యధునాతన రక్షణ రంగ ఉపకరణాలు మరియు ప్లాట్ ఫార్మ్ లలో సహకారం ద్వారా భారతదేశ రక్షణ సామర్ధ్యం వృద్ధి చెందింది. మన రక్షణ రంగ తయారీ సంస్థ లు ఒకదాని కి మరొకటి సరఫరా శృంఖలాల లో భాగస్వాములు అవుతున్నాయి. భారతీయ బలగాలు చాలా వరకు శిక్షణ సంబంధ విన్యాసాల లో ప్రస్తుతం యుఎస్ఎ కు చెందిన బలగాల తో కలసి పాల్గొంటున్నాయి. గడచిన కొన్ని సంవత్సరాల లో మన బలగాల మధ్య కలసి పని చేసే ధోరణి ఇది వరకు ఎన్నడూ లేనంత గా పెరిగింది.
మిత్రులారా,
అదే మాదిరి గా మన స్వదేశాల ను పరిరక్షించుకోవడం కోసం మరియు అంతర్జాతీయ నేరాల తో పోరాడటం లోను మనం సహకారాన్ని పెంపు చేసుకొంటున్నాము. ఈ రోజు న హోం-లాండ్ సెక్యూరిటీ కి సంబంధించి తీసుకొన్న నిర్ణయం ఈ సహకారాని కి మరింత అండదండల ను అందించగలుగుతుంది. ఇవాళ, మేము ఉగ్రవాద మద్ధతుదారుల ను జవాబుదారు గా నిలబెట్టాలని చేసే ప్రయత్నాల ను పెంచుకోవాలని నిర్ణయించాము. డ్రగ్స్ పై, నార్ కటిక్ సంబంధిత సంక్షోభం (opioid crisis)పై పోరాడటాన్ని అధ్యక్షుడు శ్రీ ట్రంప్ ఒక ప్రాథమ్యం గా ఎంచుకొన్నారు. డ్రగ్ ట్రాఫికింగ్, నార్ కో-టెరరిజమ్ మరియు వ్యవస్థీకృత నేరాల వంటి గంభీర సమస్య ల విషయం లో ఒక క్రొత్త యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కూడా మేము ఈ రోజు న అంగీకరించాము.
మిత్రులారా,
కొద్దిసేపటి క్రితమే మన వ్యూహాత్మక శక్తి భాగస్వామ్యం పురుడుపోసుకొని, వెనువెంటనే బలాన్ని పుంజుకొంటున్నది. ఈ రంగం లో పరస్పర పెట్టుబడి కూడా పెరిగింది. చమురు మరియు గ్యాస్ ల విషయాని కి వస్తే, అమెరికా భారతదేశాని కి ఒక అతి ముఖ్యమైన వనరు లా మారింది. గడచిన నాలుగు సంవత్సరాల కాలం లో మన మొత్తం శక్తి రంగ వ్యాపారం దాదాపు గా 20 బిలియన్ డాలర్స్ గా ఉంది. అది అక్షయ శక్తి కావచ్చు, లేదా పరమాణు శక్తి కావచ్చు, మన సహకారం ఒక క్రొత్త సత్తువ ను అందిపుచ్చుకొంటున్నది.
మిత్రులారా,
ఇదే విధం గా 21వ శతాబ్దం లో ఇండస్ట్రీ 4.0 మరియు ఇతర వర్ధమాన సాంకేతిక పరిజ్ఞానాల విషయాల లో సైతం భారతదేశం-యుఎస్ భాగస్వామ్యం నూతన ఆవిష్కరణల లోను, వ్యాపారాల లోను నూతన అధ్యాయాలను లిఖిస్తున్నాయి. భారతదేశాని కి చెందిన వృత్తి నిపుణుల ప్రతిభ అమెరికా కంపెనీల కు సాంకేతిక విజ్ఞాన సంబంధిత నాయకత్వాన్ని పటిష్టపరచింది.
మిత్రులారా,
భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్ ఆర్థిక రంగం లో ఆంక్షల కు తావు లేనటువంటి, న్యాయమైనటువంటి మరియు సమతుల్యమైనటువంటి వ్యాపారం కోసం కట్టుబడి ఉన్నాయి. గడచిన మూడు సంవత్సరాల కాలం లో మన ద్వైపాక్షిక వ్యాపారం రెండు అంకె ల వృద్ధి ని నమోదు చేయడం తో పాటు, మరింత సంతులితం గా కూడా మారింది. గత నాలుగైదు సంవత్సరాల లో గమనిస్తే, ఒక్క శక్తి, పౌర విమానాలు, రక్షణ, ఇంకా ఉన్నత విద్య.. ఈ నాలుగు రంగాలే భారతదేశం-యుఎస్ ఆర్థిక సంబంధాల కు దాదాపు గా 70 బిలియన్ డాలర్స్ ను సమకూర్చాయి. దీనిలో చాలావరకు అధ్యక్షుడు శ్రీ ట్రంప్ యొక్క విధానాలు మరియు నిర్ణయాల ఫలితం గా సాధ్యపడింది. రాబోయే కాలాల లో ఈ సంఖ్య గణనీయం గా పెరుగుతుందన్న విశ్వాసం నాలో ఉంది. ద్వైపాక్షిక వ్యాపార విషయాని కి వస్తే, మన వాణిజ్య మంత్రుల మధ్య సానుకూల ధోరణి లో చర్చ లు జరిగాయి. మన వాణిజ్య మంత్రుల నడుమ చోటు చేసుకొన్న అవగాహన కు మన జట్లు న్యాయబద్ధత ను సంతరించాలి అని అధ్యక్షుడు శ్రీ ట్రంప్ మరియు నేను ఈ రోజు న సమ్మతించాము. ఒక ప్రధానమైనటువంటి వ్యాపార ఒప్పందం కోసం సంప్రదింపుల ను మొదలుపెట్టాలని కూడాను మేము అంగీకరించాము. ఇది ఉభయ పక్షాల కు మేలు చేసే సత్ఫలితాల ను అందిస్తుందని మేము ఆశపడుతున్నాము.
మిత్రులారా,
భారతదేశం మరియు అమెరికా ల సహకారం మన ఉమ్మడి ప్రజాస్వామిక విలువలపైన మరియు లక్ష్యాల పైన ఆధారపడి ఉంది. ఈ సహకారం మరీ ముఖ్యం గా నియమాల పై ఆధారపడ్డ అంతర్జాతీయ క్రమం యొక్క మనుగడ కు, ప్రత్యేకించి ఇండో-పసిఫిక్, ఇంకా గ్లోబల్ కామన్స్ విషయం లో, ఎంతో ముఖ్యమైంది గా ఉంటుంది. ప్రపంచం లో సంధాన సంబంధ మౌలిక సదుపాయాల ను అభివృద్ధి పరచడానికి స్థిరమైన మరియు పారదర్శకమైన ఆర్థిక సహాయం యొక్క ప్రాముఖ్యం ఎంతైనా ఉందని మేము ఇరువురమూ అంగీకరించాము. మా ఈ పరస్పర అవగాహన ప్రపంచాని కి మేలు చేసేటటువంటిదే.
మిత్రులారా,
భారతదేశాని కి మరియు అమెరికా కు మధ్య నెలకొన్న ఈ ప్రత్యేకమైన స్నేహం తాలూకు అత్యంత ప్రధానమైన పునాదులు ఏమిటంటే అవి మన రెండు దేశాలకు చెందిన ప్రజల మధ్య గల సంబంధాలే. వారు వృత్తి నిపుణులు కావచ్చు, లేదా విద్యార్థులు కావచ్చు, భారతదేశపు మూలాల ను కలిగివుండి యుఎస్ కు వలసపోయిన వారు కావచ్చు.. దీని లో అతి పెద్ద తోడ్పాటు ను అందించారు. భారతదేశ రాయబారులు అయిన వీరు కేవలం వారి యొక్క ప్రతిభ తో, కఠోర పరిశ్రమ తో ఒక్క యుఎస్ఎ ఆర్థిక వ్యవస్థ కు తోడ్పటమే కాక వారి యొక్క ప్రజాస్వామిక విలువల తోను, సంపన్నమైనటువంటి సంస్కృతి తోను అమెరికన్ సమాజాన్ని కూడాను సమృద్ధం చేస్తున్నారు. మా వృత్తి నిపుణుల కు సామాజిక భద్రత సంబంధిత తోడ్పాటు అనేటటువంటి అంశం పైన టోటలైజేశన్ అగ్రిమెంటు విషయం లో ఉభయ పక్షాల ను కలుపుకొని చర్చను ముందుకు పోవలసింది గా అధ్యక్షుడు శ్రీ ట్రంప్ ను నేను అభ్యర్ధించాను. ఇలా చేయడం పరస్పర హితాన్ని చేకూర్చేదే అవుతుంది.
మిత్రులారా,
అధ్యక్షుడు శ్రీ ట్రంప్ యొక్క పర్యటన ఈ అన్ని పార్శ్వాల లో మన సంబంధాల ను మరింత బలోపేతం చేయడం లో ఒక చరిత్రాత్మకమైనటువంటి పాత్ర ను పోషించింది. భారతదేశాని కి విచ్చేసినందుకు, మరి అలాగే ఇండో-యుఎస్ సంబంధాల ను ఒక కొత్త ఎత్తు కు తీసుకు పోయినందుకు అధ్యక్షుడు శ్రీ ట్రంప్ కు నేను మరొక్కమారు హృదయపూర్వకంగా ధన్యవాదాల ను తెలియ జేస్తున్నాను.
మీకు అందరికీ ఇవే ధన్యవాదాలు.
అస్వీకరణ: ప్రధాన మంత్రి హిందీ భాష లో ప్రసంగించారు. ఇది ఆయన ఉపన్యాసాని కి స్థూల అనువాదం.
(Release ID: 1871145)
Visitor Counter : 90