ప్రధాన మంత్రి కార్యాలయం
గురు సాహిబ్ ల దార్శనికత ను సాకారం చేయడం కోసం మనం పాటుపడుతూనే ఉందాం: ప్రధాన మంత్రి
Posted On:
22 OCT 2022 5:37PM by PIB Hyderabad
హేమ్ కుండ్ సాహిబ్ రోప్ వే విషయం లో జథేదార్ శ్రీ అకాల్ తఖ్త్ సాహిబ్, ఆధ్యాత్మిక ప్రముఖులు సహా సిఖ్కు సముదాయాని కి చెందిన గౌరవనీయ సభ్యులు వ్యక్తం చేసిన ఆనందోత్సాహాల కు మరియు దయాపూరిత పలుకుల కు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ధన్యవాదాల ను తెలియజేశారు. గురు సాహిబ్ ల యొక్క దార్శనికత కు సాకారం కల్పించడం కోసం పాలుపడడాన్ని కొనసాగించనున్నట్లు సంగత్ కు ఆయన హామీ ఇచ్చారు. పత్రికా సమాచార కార్యాలయం చేసిన ఒక ట్వీట్ ల మాలిక కు ప్రతిస్పందన గా ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘హేమ్ కుండ్ సాహిబ్ రోప్ వే విషయం లో జథేదార్ శ్రీ అకాల్ తఖ్త్ సాహిబ్, ఆధ్యాత్మిక ప్రముఖులు సహా సిఖ్కు సముదాయానికి చెందిన గౌరవనీయ సభ్యులు ఆనందాన్ని, ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. వారి యొక్క దయాపూరిత పలుకుల కు గాను వారికి నేను ధన్యవాదాల ను తెలియజేస్తూ గురు సాహిబ్ ల దార్శనికత ను సాకారం చేసేందుకు మనం పాటుపడుతూనే ఉంటామని సంగత్ కు హామీ ఇస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.
(Release ID: 1870310)
Visitor Counter : 166
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam