ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

10 లక్షల మంది సిబ్బంది ని నియమించడానికి ఉద్దేశించిన రోజ్ గార్ మేళా ను అక్టోబర్ 22 న ప్రారంభించనున్న ప్రధాన మంత్రి


ఒకటో విడత లో 75, 000 మంది ని కొత్త గా నియమించడం జరుగుతుంది

కొత్తగాచేర్చుకొన్న వారికి నియామక పత్రాల ను అందించడం జరుగుతుంది

భర్తీప్రక్రియ ను వేగిరపరచడం కోసం ఎంపిక ప్రక్రియ ను సులభతరం చేయడంతో పాటు గా సాంకేతికతను  ఆలంబన గా తీసుకోవడమైంది

యువత కుఉద్యోగ అవకాశాల ను కల్పించడం మరియు పౌరుల సంక్షేమానికి పూచీ పడడం అనే దిశ లో ప్రభుత్వం యొక్క నిరంతర నిబద్దత ను చాటుతున్న కార్యక్రమం ఇది

Posted On: 20 OCT 2022 1:50PM by PIB Hyderabad

పది లక్ష ల మంది సిబ్బంది ని నియమించేందుకు ఉద్దేశించిన కార్యక్రమం అయినటువంటి ‘‘రోజ్ గార్ మేళా’’ను ప్రధాన మంత్రి అక్టోబరు 22 తేదీ న ఉదయం 11 గంటల కు వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యమం ద్వారా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం లో భాగం గా కొత్త గా చేర్చుకొనే 75,000 మంది కి పైగా వ్యక్తుల కు నియామక లేఖల ను అందించడం జరుగుతుంది. ఈ సందర్భం లో నియామకం జరిగిన ఈ వ్యక్తులను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగించనున్నారు.

 

యువతీ యువకుల కు ఉద్యోగ అవకాశాల ను కల్పించడం తో పాటు గా పౌరుల సంక్షేమాని కి పూచీ పడాలి అనే విషయం లో ప్రధాన మంత్రి యొక్క నిరంతర నిబద్ధత ను నెరవేర్చే దిశ లో ఇది ఒక మహత్తరమయిన ముందడుగు కానున్నది. ప్రధాన మంత్రి ఆదేశాల కు అనుగుణం గా, మంజూరైన ఉద్యోగాల కు ప్రతి గా ఇప్పటికే ఉన్న ఖాళీల ను ఉద్యమం తరహా లో నింపే దిశ లో అన్ని మంత్రిత్వ శాఖ లు మరియు విభాగాలు శ్రమిస్తున్నాయి.

 

దేశం నలుమూల ల నుండి ఎంపికైన నూతన నియమితులు భారత ప్రభుత్వం లో 38 మంత్రిత్వ శాఖల లో/విభాగాల లో చేరనున్నారు. వీరు ప్రభుత్వం లో వివిధ స్థాయిల లో చేరుతారు. ఆ స్థాయి లు ఏవేవి అంటే అవి గ్రూప్-ఎ, గ్రూప్-బి (గజిటెడ్), గ్రూప్ -బి (నాన్-గజిటెడ్) మరియు గ్రూప్-సి అనేవే. నియామకాలు జరుపుతున్న ఉద్యోగాల లో కేంద్ర సాయుధ దళ సిబ్బంది, సబ్ ఇన్ స్పెక్టర్, కానిస్టేబుల్, ఎల్ డిసి, స్టెనో, పిఎ, ఇన్ కమ్ టాక్స్ ఇన్ స్పెక్టర్ లు, ఎంటిఎస్, తదితరాలు భాగం గా ఉన్నాయి.

 

ఈ నియామకాల ను మంత్రిత్వ శాఖ లు మరియు విభాగాలు అయితే తమంతట తాము గాని, లేదా యుపిఎస్ సి, ఎస్ఎస్ సి , రైల్ వే రిక్రూట్ మెంట్ బోర్డు వంటి నియామక సంస్థ ల ద్వారా గాని మిశన్ మోడ్ లో చేపట్టడం జరుగుతున్నది. త్వరిత గతిన భర్తీ కై ఎంపిక ప్రక్రియల ను సులభతరం చేయడం తో పాటు గా ఈ ప్రక్రియ లో సాంకేతిక విజ్ఞాన సహాయాన్ని కూడా తీసుకోవడం జరిగింది.

 

**

 


(Release ID: 1869545) Visitor Counter : 1508