ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
రబీ మార్కెటింగ్ సీజన్ 2023-24 లో రబీ పంటలకు కనీస మద్దతు ధరకు ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రివర్గం ఖర్చుకు మించి ఆవాలు, రాప్సీడ్ పై 104 శాతం రాబడి
గోధుమకు 100%, కందులు కు 85%, పప్పులకు 65%, బార్లీ కి 60%, కుసుమ గింజలకు 50% మేరకు ఖర్చుకు మించి రాబడి
Posted On:
18 OCT 2022 1:34PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు సమావేశం అయిన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ 2023-24 మార్కెటింగ్ సీజన్ లో రబీ పంటలకు పెంచిన కనీస మద్దతు ధరలకు ఆమోదం తెలిపింది.
రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చూడాలన్న ఉద్దేశంతో రబీ పంటలకు చెల్లిస్తున్న కనీస మద్దతు ధరలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అత్యధికంగా కందులు ధర పెరిగింది. క్వింటాల్ కందులు (మసూర్) మద్దతు ధర 500 రూపాయలు పెరిగింది. ఆవాలు, రాప్సీడ్ మద్దతు ధర క్వింటాలుకు 400 రూపాయలు పెరిగింది. కుసుమకు క్వింటాలుకు 209 రూపాయల ఎక్కువ ధర చెల్లించేందుకు మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.
గోధుమలు, శనగలు మరియు బార్లీలకు వరుసగా క్వింటాల్‌కు 110 రూపాయలు, 100 రూపాయల చొప్పున పెంచడానికి మంత్రివర్గం ఆమోదం లభించింది.
మార్కెటింగ్ సీజన్ 2023-24 లో రబీ పంటలకు నిర్ణయించిన కనీస మద్దతు ధరలు
(క్వింటాల్‌కు రూ.లలో )
స.నెం.
|
పంటలు
|
కనీస మద్దతు ధర
రబీ మార్కెటింగ్ సీజన్
2022-23
|
కనీస మద్దతు ధర
రబీ మార్కెటింగ్ సీజన్
2023-24
|
ఉత్పత్తి ఖర్చు* రబీ మార్కెటింగ్ సీజన్
2023-24
|
కనీస మద్దతు ధర (సంపూర్ణ) పెరుగుదల
|
ఖర్చుతో పోలిస్తే రాబడి (శాతంలో)
|
1
|
గోధుమలు
|
2015
|
2125
|
1065
|
110
|
100
|
2
|
బార్లీ
|
1635
|
1735
|
1082
|
100
|
60
|
3
|
గ్రాము
|
5230
|
5335
|
3206
|
105
|
66
|
4
|
పప్పు (మసూర్)
|
5500
|
6000
|
3239
|
500
|
85
|
5
|
రాప్సీడ్ , ఆవాలు
|
5050
|
5450
|
2670
|
400
|
104
|
6
|
కుసుమ పువ్వు
|
5441
|
5650
|
3765
|
209
|
50
|
* కూలీలు,, ఎద్దులు /యంత్రాలకు చెలించే కిరాయి , లీజుకు తీసుకున్నందుకుభూమికి చెల్లించిన కౌలు , విత్తనాలు, ఎరువులు, పోషకాలు , నీటిపారుదల ఛార్జీల వంటి పదార్థాల వినియోగం కోసం జరిగే వ్యయం పనిముట్లు మరియు వ్యవసాయ భవనాలపై తరుగుదల, మూలధనం పై వడ్డీ, పంపు సెట్ల నిర్వహణ కోసం ఉపయోగించే డీజిల్/విద్యుత్ ధర కుటుంబ శ్రమ ఖర్చులు మరియు లెక్కింపబడిన విలువ అయ్యే ఖర్చులు వంటి అన్ని చెల్లించిన ఖర్చులను సూచిస్తుంది.
జాతీయ స్థాయిలో నిర్ణయించిన సరాసరి ఉత్పత్తి వ్యయం రబీ పంటలకు చెల్లించే కనీస మద్దతు ధర కంటే 1.5 రెట్లు ఎక్కువగా నిర్ణయించాలని 2018-19 కేంద్ర బడ్జెట్ సమయంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా 2023-24 రబీ పంటలకు కనీస మద్దతు ధర నిర్ణయించడం జరిగింది. దీనివల్ల రైతులకు సరైన గిట్టుబాటు ధర లభిస్తుంది. గరిష్ట రాబడి రేటు రాప్‌సీడ్ మరియు ఆవాలకు 104 శాతం, ఆ తర్వాత గోధుమలకు 100 శాతం, కాయ ధాన్యాలకు 85 శాతం, పప్పు ధాన్యాలకు 66 శాతం, బార్లీ పై 60 శాతం, కుసుమకు 50 శాతం గరిష్ట రాబడి రేటు ఉంటుంది.
పప్పుధాన్యాలు, నూనె గింజల దిగుబడి ఎక్కువ చేయడానికి 2014-15 నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యల వల్ల పప్పుధాన్యాలు, నూనె గింజల దిగుబడి పెరిగింది. 2014-15లో 27.51 మిలియన్ టన్నులుగా ఉన్న నూనె గింజల దిగుబడి 2021-22 నాటికి (4 వ ముందస్తు అంచనాల ప్రకారం ) 37.70 మిలియన్ టన్నులకు చేరింది. పప్పు ధాన్యాల దిగుబడి కూడా ఇదే తరహాలో పెరిగింది. ప్రభుత్వం ప్రారంభించిన విత్తన మినీ కిట్స్ కార్యక్రమం వల్ల రైతులకు నూతన వంగడాలు అందుబాటులోకి వచ్చాయి. పొలాల్లో కొత్త రకాల విత్తనాలు వేయడం, విత్తన మార్పిడి వల్ల పంట దిగుబడి పెరిగింది.
2014-15 నుంచి పప్పు ధాన్యాలు,నూనె గింజల దిగుబడి గణనీయంగా పెరిగింది. పప్పుధాన్యాల ఉత్పాదకత హెక్టారుకు 728 కిలోల (2014-15) నుండి 892 కిలోల / హెక్టారుకు (4 వ ముందస్తు అంచనా 2021-22) పెరిగింది. పప్పుధాన్యాల ఉత్పాదకత 22.53% పెరుగుదల నమోదు చేసింది. అదేవిధంగా, నూనెగింజల పంటల ఉత్పాదకత హెక్టారుకు 1075 కిలోల (2014-15) నుండి 1292 కిలోల / హెక్టారుకు పెరిగింది (4 వ ముందస్తు అంచనా, 2021-22).
ఆత్మ నిర్భర్ భారత్ సాధన కోసం పప్పుధాన్యాలు, నూనె గింజల దిగుబడి పెంచేందుకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నది. పంట విస్తీర్ణం పెంచడం, ఎక్కువ దిగుబడి ఇచ్చే విత్తనాలు ఉపయోగించడం,కనీస మద్దతు ధర ద్వారా రైతులకు సహకారం అందించి పంట సేకరణ ద్వారా ఉత్పత్తి పెంచడానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించి అమలు చేస్తుంది.
దేశంలో వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం మరియు ఆవిష్కరణల వినియోగం ద్వారా ఆధునిక వ్యవసాయ పద్ధతులను అనుసరించడాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వం డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ (DAM)ను అమలు చేస్తోంది. డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ లో భాగంగా ఇండియా డిజిటల్ ఎకో సిస్టమ్ ఆఫ్ అగ్రికల్చర్ (IDEA), రైతుల సమగ్ర సమాచారం, యూనిఫైడ్ ఫార్మర్స్ సర్వీస్ ఇంటర్‌ఫేస్ (UFSI), నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగానికి రాష్ట్రాలకు నిధులు అందజేయడం, మహలనోబిస్ నేషనల్ క్రాప్ ఫోర్ కాస్ట్ సెంటర్ (MNCFC) ఆధునీకరణ, భూసారం, పంట దిగుబడి పెంచడం లాంటి కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి. నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగానికి రాష్ట్రాలకు నిధులు అందజేయడం (NeGPA) కార్యక్రమం కింద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెషిన్ లెర్నింగ్ (AI/ML), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IOT), బ్లాక్ చైన్ మొదలైన అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను ఉపయోగించి డిజిటల్ వ్యవసాయ పథకాల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులు ఇవ్వబడతాయి. డ్రోన్ సాంకేతికతను వినియోగించడం జరుగుతోంది. స్మార్ట్ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం వ్యవసాయ ఆధారిత అంకుర సంస్థలకు సహకారం అందిస్తూ వ్యవసాయ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందిస్తోంది. .
***
(Release ID: 1868872)
Visitor Counter : 2477
Read this release in:
Tamil
,
Malayalam
,
Kannada
,
Assamese
,
Bengali
,
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Punjabi
,
Gujarati