సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆకాశవాణి 100.1 ఎఫ్ఎం గోల్డ్ ఛానల్ లో అక్టోబర్ 14 శుక్రవారం రాత్రి 7.25-7.40 గంటల సమయంలో ప్రసారం కానున్న ఓటరు అవగాహన కార్యక్రమం రెండవ ఎపిసోడ్ "మాటదాట జంక్షన్" ఒక ఓటు- ఒక ఓటు బలం ఇతివృత్తంతో కార్యక్రమం ప్రసారం


దేశంలో 23 భాషల్లో ప్రసారం కానున్న "మాటదాట జంక్షన్" కార్యక్రమం

ఎఫ్ఎం గోల్డ్, ఎఫ్ఎం రెయిన్‌బో, వివిధ భారతి కేంద్రాలు, మరియు ఆకాశవాణి ఛానెల్‌లలో ఒక్కొక్కటి 15 నిమిషాల నిడివి గల 52 ఎపిసోడ్‌లను ప్రసారం చేయడానికి భారత ఎన్నికల సంఘం తో కలిసి ప్రసారం చేయనున్న ఆకాశవాణి

Posted On: 14 OCT 2022 10:05AM by PIB Hyderabad

ఓటర్లను చైతన్యవంతుల్ని చేసేందుకు భారత ఎన్నికల సంఘం రూపొందించిన "మాటదాట జంక్షన్" కార్యక్రమాన్ని వారానికి ఒకసారి ఆకాశవాణిలో ప్రసారం అవుతోంది. కార్యక్రమం రెండవ ఎపిసోడ్ ఆకాశవాణి  100.1 ఎఫ్ఎం  గోల్డ్ ఛానల్ లో అక్టోబర్ 14 శుక్రవారం రాత్రి 7.25-7.40 గంటల సమయంలో ప్రసారం అవుతుంది. ఢిల్లీ, ముంబై, కలకత్తా, చెన్నై హైదరాబాద్ కేంద్రాలు  ఒక ఓటు- ఒక ఓటు బలం ఇతివృత్తంతో రూపొందిన కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. 

ఒక్కొక్కటి 15 నిమిషాల నిడివి గల కార్యక్రమం  వారానికి ఒకసారి అస్సామీస్, బెంగాలీ, ఆంగ్లం, గుజరాతి, హిందీ, కన్నడ, కాశ్మీరీ, కొంకణి, మలయాళం,మణిపురి, మరాఠి, నేపాలీ, ఒరియా,పంజాబీ,సంస్కృతం,సింది, తమిళం,తెలుగు,ఉర్దూ,బోడో,సంతాలి, మైథిలి, డోగ్రి  భాషల్లో ప్రతి శుక్రవారం ప్రసారం అవుతుంది. 

దేశవ్యాప్తంగా ఎఫ్ఎం   రెయిన్‌బో, వివివిధ భారతి స్టేషన్‌లు మరియు ఆకాశవాణి   ప్రైమరీ ఛానెల్‌లలో రాత్రి 7-9  టైమ్ బ్యాండ్ మధ్య ప్రసారం చేయబడుతుంది. పౌరులు 'ట్విట్టర్ ఆన్ @airnewsalerts, News On AIR' యాప్ మరియు ఆల్ ఇండియా రేడియో యు ట్యూబ్  ఛానెల్‌లలో  కూడా కార్యక్రమాన్ని వినవచ్చు.

వారానికి ఒకసారి ప్రసారం అయ్యే  కార్యక్రమం ఎన్నికల  వ్యవస్థ అన్ని అంశాలను కవర్ చేస్తుంది. ప్రతి ఎపిసోడ్ ఎన్నికల ప్రక్రియపై నిర్దిష్ట అంశం ఆధారంగా రూపొందుతోంది.  ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ మొదటిసారి ఓటు వేసేందుకు హక్కు పొందిన  యువకులు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చేయాలనే లక్ష్యంతో కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది. ఓటర్లలో అవగాహన కల్పించి వారిని చైతన్యవంతుల్ని చేసి   ఎన్నికల సమయంలో ఓటు వేయడానికి అవసరమైన  సమాచారం అందించి సరైన నిర్ణయం తీసుకోవడానికి వారికి సహకరించే విధంగా కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నారు.  ప్రతి ఎపిసోడ్‌లో భారత ఎన్నికల సంఘం  SVEEP (సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్) బృందం  రూపొందించిన క్విజ్, నిపుణుల ఇంటర్వ్యూ మరియు పాటలు ఉంటాయి. ప్రజల సందేహాలను నివృత్తి కోసం కార్యక్రమంలో వీలు కల్పించారు.  ఇక్కడ ఏ పౌరుడైనా ఒక ప్రశ్న అడగవచ్చు లేదా ఓటింగ్‌కు సంబంధించిన  అంశాలపై సూచనలు అందించవచ్చు. మొత్తం 52 భిన్న అంశాలతో ప్రతి వారం కార్యక్రమం ప్రసారం అవుతుంది. 

***


(Release ID: 1867917) Visitor Counter : 176