ప్రధాన మంత్రి కార్యాలయం

జాతీయక్రీడలు 2022 ముగిసినసందర్భం లో క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 13 OCT 2022 8:54PM by PIB Hyderabad

జాతీయ క్రీడలు 2022 లో పాలుపంచుకొన్న క్రీడాకారులు అందరికీ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు పతకాల ను గెలుచుకొన్న వారందరికీ అభినందనల ను వ్యక్తం చేశారు. జాతీయ క్రీడలు 2022 గొప్ప గా సఫలం కావడం పట్ల ప్రధాన మంత్రి వ్యాఖ్యానిస్తూ, క్రీడల రంగాని కి సంబంధించిన మౌలిక సదుపాయాల ను క్రీడాకారులంతా మెచ్చుకోవడం జరిగిందని, మరి ఈ క్రీడల ను రీసైక్లింగ్ పై చైతన్యాన్ని విస్తరింపచేయడం, ప్లాస్టిక్ వ్యర్థాల ను తగ్గించడం మరియు స్వచ్ఛత ను పెంపొందింపచేయడం సహా స్థిర అభివృద్ధి పై ప్రత్యేక శ్రద్ధ ను వహించినందుకు గుర్తు కు తెచ్చుకోవడం జరుగుతుందన్నారు. ఆతిధేయ సత్కారాల కు గాను గుజరాత్ ప్రజల ను మరియు ప్రభుత్వాన్ని ప్రధాన మంత్రి కొనియాడారు.

 

ప్రధాన మంత్రి అనేక ట్వీట్ లలో -

‘‘జాతీయ క్రీడలు 2022 నిన్న ముగిశాయి. ఈ క్రీడల లో పాలుపంచుకొన్న ప్రతి ఒక్క క్రీడాకారుని కి మరియు క్రీడాకారిణి కి ఇదే నా వందనం. ఈ క్రీడల లో పతకాల ను గెలుచుకొన్న క్రీడాకారులు అందరికి అభినందన లు. వారి కార్యసిద్ధుల ను చూస్తే గర్వం గా అనిపిస్తోంది. క్రీడాకారులు అందరూ వారి భావి ప్రయాసల లో రాణించాలని నేను కోరుకుంటున్నాను.’’

‘‘ఈ సంవత్సరం లో జరిగిన జాతీయ క్రీడలు వివిధ కారణాల వల్ల విశిష్టమైనవి. క్రీడల కు సంబంధించి సమకూర్చిన మౌలిక సదుపాయాలు క్రీడాకారుల ద్వారా వేనోళ్ల ప్రశంసల కు నోచుకొన్నాయి. సాంప్రదాయిక క్రీడల లో విస్తృత భాగస్వామ్యం సైతం ముఖ్యమైన ఆకర్షణల లో ఒకటి గా ఉండింది.’’

 

‘‘రీసైక్లింగు ను గురించిన చైతన్యాన్ని పెంచడం, ప్లాస్టిక్ వ్యర్థాల ను తగ్గించడం మరియు స్వచ్ఛత ను వృద్ధి చెందింపచేయడం సహా స్థిర అభివృద్ధి పై ప్రత్యేకమైన శ్రద్ధ ను వహించినందుకు గాను జాతీయ క్రీడలు 2022 ను గుర్తు పెట్టుకోవడం జరుగుతుంది. క్రీడ ల మాధ్యమం ద్వారా ఆతిథ్య సత్కారాల ను అందించినందుకు గాను గుజరాత్ ప్రజానీకాన్ని మరియు ప్రభుత్వాన్ని కూడాను నేను ప్రశంసించదలచుకొన్నాను.’’ అని పేర్కొన్నారు.




(Release ID: 1867630) Visitor Counter : 176