యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గౌరవనీయ కేంద్ర క్రీడా శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ మూడు రోజుల ప్రపంచ డోపింగ్ వ్యతిరేక సంస్థ (WADA) అథ్లెట్ బయోలాజికల్ పాస్ పోర్ట్ సింపోసియం-2022 యొక్క ప్రారంభ ఉపన్యాసం చేశారు.


ఈ సింపోసియం భారతదేశంలో క్రీడలలో మాదకద్రవ్యాల వినియోగానికి అడ్డుకట్ట వేసే సమరంలో మన అందరి సామూహిక ప్రయత్నంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని తెలియజేశారు.

అంతేకాక స్వచ్ఛమైన క్రీడలను, క్రీడా స్ఫూర్తిని చాటేలా ఒక కలికి తురాయిగా నిలుస్తుంది అని అన్నారు.

ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక చట్టం-2022 ద్వారా క్రీడలను స్వచ్ఛంగా నిర్వహించడంలో మరింత పురోగతి సాధించగలమని తెలియజేశారు.

Posted On: 12 OCT 2022 2:48PM by PIB Hyderabad

కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రపంచ డోపింగ్ వ్యతిరేక సంస్థ (WADA) అథ్లెట్ బయోలాజికల్ పాస్ పోర్ట్  సింపోసియం-2022  లో ప్రారంభ ఉపన్యాసం చేశారు. ఈ కార్యక్రమం జాతీయ డొపింగ్ వ్యతిరేక సంస్థ మరియు జాతీయ డోప్ పరీక్ష ప్రయోగశాలల సంయుక్త ఆధ్వర్యంలో జరిగింది. కేంద్ర క్రీడా శాఖ కార్యదర్శి శ్రీమతి సుజాత చతుర్వేది, డైరెక్టర్ జనరల్- జాతీయ డొపింగ్ వ్యతిరేక సంస్థ కుమారి రీతు సేన్, అసోసియేట్  డైరెక్టర్, ప్రపంచ డొపింగ్ వ్యతిరేక సంస్థ  శ్రీ డా.రీడ్ ఐకిన్, ఆసియా ఓషియానా కార్యాలయం సంచాలకులు, ప్రపంచ డొపింగ్ వ్యతిరేక సంస్థ- శ్రీ కాజుగిరో హయాషి మరియు సీనియర్ మేనేజర్ ప్రపంచ డొపింగ్ వ్యతిరేక సంస్థ- డా. నోబర్ట్ బౌమే తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్ మహోత్సవం జరుపుకుంటున్న సందర్భంలో ఈ ABP సింపోసియమ్ దేశం లోనే మొదటిసారిగా నిర్వహించుకోవడం చాలా ప్రత్యేకత సంతరించుకుంటుందని తెలిపారు. 

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతదేశం క్రీడా జగతిలో అనేక గొప్ప విజయాలను సాధిస్తుందని కూడా తెలిపారు. 

ఈ అథ్లెట్ బయోలాజికల్ పాస్ పోర్ట్ (ABP) ఒక అత్యంత ముఖ్యమైన సాంకేతిక విజయం అని, దీని ద్వారా క్రీడాకారుల మాదకద్రవ్య వినియోగాన్ని గుర్తించడమే కాక, ఈ పరిశోధనలో ప్రపంచవ్యాప్తంగా డోపింగ్ ని అరికట్టడానికి ఉపయోగపడుతుందని తెలిపారు.

 

అథ్లెట్ బయోలాజికల్ పాస్పోర్ట్ (ABP) ను బలోపేతం చేయడంతో పాటు ఈ సింపోసియం మన సామూహిక డోపింగ్ వ్యతిరేక ఉద్యమంలో ఒక మైలురాయిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

 

డోపింగ్ నుండి తమను తాము రక్షించుకోవడంతో పాటు, క్రీడా లోకాన్ని కూడా కాపాడేందుకు అందరూ ఇందులోని విజ్ఞానం, విధానాలు, పరిశోధన మరియు విశేష అనుభవాన్ని ఉపయోగించుకుని మరింత సాధికారికంగా ముందుకు సాగాలని సూచించారు. ఈ సింపోసియం ద్వారా భారతదేశం డోపింగ్ ని అరికట్టే కార్యక్రమంలో ఒక పెద్ద అడుగు వేసిందని తెలిపారు.

 

భారత ప్రభుత్వం ఇటీవల ఒక జాతీయ డొపింగ్ వ్యతిరేక చట్టం -  2022 తీసుకువచ్చి, డొపింగ్ అరికట్టడంలో  ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఒక గమ్యాన్ని చేరుకుందని, దీని ద్వారా క్రీడలలో మాదకద్రవ్యాల వినియోగం అరికట్టడానికి దృఢమైన నిర్ణయాన్ని నిరూపించుకుందని తెలిపారు. ఈ చట్టం, దేశంలో అన్ని స్థాయిలలో స్వచ్ఛమైన క్రీడలను అందించడంలో భారత ప్రభుత్వం యొక్క దృఢమైన సంకల్పం యొక్క ఫలితం అని తెలిపారు.

 

గత సంవత్సర కాలంగా భారతదేశ ప్రపంచ డొపింగ్ వ్యతిరేక సంస్థ (WADA) కి ఎంతో సహాయ సహకారాలను అందిస్తోందని, ఇది ఆసియాలోనే నాలుగవ స్థానంలో ఉందని తెలిపారు. అంతేకాక తెలుసుకో వారి స్వచ్ఛంద నిధికి భారతదేశం ఒక పెద్ద సహకారి అని తెలిపారు.

 

నిషేధించిన పోషణ పదార్థాలు తీసుకోవడం ద్వారా మన క్రీడాకారులు మత్తుమదార్థాల వినియోగం బారిన పడకుండా కాపాడటానికి, జాతీయ డోపింగ్ వ్యతిరేక సంస్థ మరియు జాతీయ ఫోరెన్సిక్ సైన్సెస్ విశ్వవిద్యాలయం వారి తోటి మరియు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా (Food Safety and Standards Authority of India) తోటి కలిసి పనిచేసే మరింత పురోగతి సాధిస్తుందని తెలిపారు.

 

ప్రత్యేకించి దివ్యాంగ క్రీడాకారుల విషయంలో సార్వత్రిక మరియు కలుపుగోలు విధానం ద్వారా సంజ్ఞా భాషలో డొపింగ్ వ్యతిరేక విద్యా మాడ్యూల్ రూపొందించామని, ఇది ప్రపంచంలో ఎక్కడ ఉన్న దివ్యంగ క్రీడాకారులకైనా ఉపయోగపడే విధంగా ఉంటుందని తెలియజేశారు. భారత జాతీయ డోపింగ్ వ్యతిరేక సంస్థ ఈ మాడ్యూల్ ను ఆసియా ఖండంలోని అన్ని దేశాల జాతీయ సంస్థల కు అందజేస్తుందని అన్నారు.

 

ఈ సింపోసియంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఎదురయ్యే సవాళ్లు వాటిని అధిగమించేందుకు ఉన్న అవకాశాలు వంటి అంశాలపై ప్రముఖంగా చర్చిస్తారని, తద్వారా ప్రపంచ డోపింగ్ వ్యతిరేక సంస్థ మరియు క్రీడాకారుల పాస్పోర్ట్ నిర్వహణ యూనిట్లు కలసికట్టుగా స్టెరాయిడ్ మరియు ఇతర పరీక్షల విధానాలను రూపొందించుకోగలుగుతాయని తెలియజేశారు.

 

గతంలో మొదటి ప్రపంచ డోపింగ్ వ్యతిరేక సంస్థ , ఈ అట్లెట్ బయోలాజికల్ పాస్పోర్ట్ సింపోసియం ను ఖతార్ దేశంలో 2015 నవంబర్ లో నిర్వహించగా, రెండవది ఇటాలియన్ ఫెడరేషన్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ వారు 2018లో రోమ్, ఇటలీ లో నిర్వహించారు. 

 

మూడవది, మొదటిసారిగా భారతదేశంలో నిర్వహిస్తున్న ఈ అథ్లెట్ బయోలాజికల్ పాస్పోర్ట్ సింపోసియం, 2022 లో 56 దేశాల నుండి 200 కు పైగా పాల్గొంటున్నారని, అలాగే ప్రపంచ డోపింగ్ వ్యతిరేక సంస్థ అధికారులు, అనేక దేశాల జాతీయ వ్యతిరేక సంస్థల ప్రతినిధులు, నిపుణులు మరియు ప్రపంచ డోపింగ్ వ్యతిరేక సంస్థ అధికృత ప్రయోగశాలలు, మరియు పాస్పోర్ట్ నిర్వహణ బృందాలు పాల్గొన్నారు.

***


(Release ID: 1867489) Visitor Counter : 191