మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ

బాలికలకు సాంప్రదాయేతర జీవనోపాధి రంగంలో నైపుణ్యం కల్పించేందుకు రేపు “బెటియన్ బనే కుశాల్” జాతీయ సదస్సు నిర్వహించనున్న మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ


బాలికలకు సాంప్రదాయేతర జీవనోపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధి కల్పన లక్ష్యంగా సదస్సు నిర్వహణ
కార్మిక రంగంలో బాలికలకు సమానత, సాధికారత కల్పించేందుకు సదస్సులో అవగాహన ఒప్పందంపై సంతకం చేయనున్న నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మరియు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
ప్రత్యక్ష ప్రసారం కానున్న “బెటియన్ బనే కుశాల్”

ఎన్ టీ ఎల్ లో దేశవ్యాప్త గుర్తింపు పొందిన కౌమారదశలో ఉన్న బాలికల బృందంతో సంబాషించనున్న కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి

సదస్సులో పథకం అమలుకు సంబంధించి రాష్ట్రాలు/ జిల్లాలకు రూపొందించిన మార్గదర్శకాల విడుదల

Posted On: 10 OCT 2022 10:54AM by PIB Hyderabad

అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా రేపు 2022 అక్టోబర్ 11న బాలికలకు సాంప్రదాయేతర జీవనోపాధి రంగంలో నైపుణ్యం కల్పించేందుకు మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ   “బెటియన్ బనే కుశాల్” జాతీయ సదస్సును నిర్వహించనున్నది  బాలికలకు వివిధ రంగాలలో నైపుణ్యం కల్పించి వారు శాస్త్ర, సాంకేతిక, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ (STEM) వంటి విభిన్న వృత్తులలో ప్రవేశించేలా చూసి  సమానత్వం, సాధికారత సాధించేందుకు వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల మధ్య సమన్వయంతో పథకాలు అమలు చేసేందుకు కార్యాచరణ పథకాన్ని రూపొందించాలన్న లక్ష్యంతో సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ రంగాల్లో బాలికలకు ఇంతవరకు తగిన గుర్తింపు, ప్రాధాన్యత లభించలేదు.  శాస్త్ర, సాంకేతిక, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ రంగాల్లో ప్రవేశించేందుకు బాలికలకు అవసరమైన శిక్షణ ఇచ్చి వారికి అవసరమైన నైపుణ్యం కల్పించేందుకు సదస్సులో భాగంగా నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మరియు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు  అవగాహన ఒప్పందంపై  సంతకం చేస్తాయి.  పథకం అమలుకు సంబంధించి రాష్ట్రాలు/ జిల్లాలకు రూపొందించిన మార్గదర్శకాలను సదస్సులో  విడుదల చేయడం జరుగుతుంది. మిషన్ శక్తి పథకం అమలులో చేసిన మార్పులకు అనుగుణంగా నూతన మార్గదర్శకాలు రూపొందాయి. 

దేశ ప్రజల కోసం “బెటియన్ బనే కుశాల్” జాతీయ సదస్సు ప్రత్యక్ష ప్రసారం (www.youtube.com/c/MinistryofWomenChildDevelopmentGovtofIndia) జరుగుతుంది. సదస్సులో నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మరియు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ , మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, క్రీడల మంత్రిత్వ శాఖ కు చెందిన ప్రతినిధుల తో సహా  నేషనల్ కౌన్సిల్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ వంటి చట్టబద్ధమైన సంస్థల ప్రతినిధులు,దేశం వివిధ ప్రాంతాలకు చెందిన  బాలికలు మరియు యువతులు పాల్గొంటారు.

సదస్సు ముఖ్య అంశాలు: 

 •  సాంప్రదాయేతర జీవనోపాధి రంగంలో   లో దేశంలో   తమదైన ముద్ర వేసిన కౌమార బాలికల బృందం సభ్యులతో  కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ మాట్లాడతారు. 

• పథకం అమలుకు సంబంధించి రూపొందిన కార్యాచరణ మార్గదర్శకాలు సదస్సులో విడుదల అవుతాయి. వివిధ శాఖలు, విభాగాల మధ్య సమన్వయం సాధించేందుకు మార్గదర్శకాలు రూపొందాయి. 
• జీవితం మరియు ఉపాధి నైపుణ్యాలు, వ్యవస్థాపక నైపుణ్యాలు, డిజిటల్ అక్షరాస్యత మరియు ఆర్థిక అక్షరాస్యత నైపుణ్యాలపై దృష్టి సారించే 21వ శతాబ్దపు నైపుణ్యాలపై నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ,   మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లక్ష్యాలను సదస్సులో ప్రకటిస్తారు. MoSDE మరియు MoMAతో కమిట్‌మెంట్‌ల ప్రకటన.
• ఎంపిక చేసిన  జిల్లాల్లో నైపుణ్యాభివృద్ధి కోసం  అమలు జరుగుతున్న ఉత్తమ విధానాలను సదస్సులో చర్చిస్తారు. 
• సాంప్రదాయేతర జీవనోపాధి రంగంలో  బాలికలు, మహిళలకు సముచిత స్థానం కల్పించే అంశంపై    పరిశ్రమ, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంస్థలు నిర్వహించిన అధ్యయనాల ఫలితాలను సదస్సులో చర్చిస్తారు. 

***



(Release ID: 1866608) Visitor Counter : 176