ప్రధాన మంత్రి కార్యాలయం
‘గంధదగుడి’ ప్రకటన చిత్రం విడుదలపై ప్రధానమంత్రి శుభాకాంక్షలు
Posted On:
09 OCT 2022 12:38PM by PIB Hyderabad
కర్ణాటక ప్రకృతి సౌందర్యం, పర్యావరణ పరిరక్షణకు నివాళిగా నిర్మించిన డాక్యుమెంటరీ చిత్రం ‘గంధదగుడి’ ప్రకటన చిత్రం ఆవిష్కరణ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. కీర్తిశేషులైన కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ చిట్టచివరగా నటించిన చిత్రమిది. కాగా, ప్రపంచవ్యాప్త కోట్లాది అభిమానుల హృదయాల్లో పునీత్ రాజ్‌కుమార్ చిరస్థాయిగా నిలిచిపోయారని ప్రధాని వ్యాఖ్యానించారు.
ఈ మేరకు పునీత్ సతీమణి అశ్వనీ పునీత్ రాజ్‌కుమార్ తనను ఉద్దేశించిన చేసిన ట్వీట్‌పై స్పందిస్తూ ప్రధాని పంపిన సందేశంలో:
“అప్పు (పునీత్) ప్రపంచవ్యాప్త కోట్లాది అభిమానుల హృదయాల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారు. ప్రకృతి ఆరాధకుడైనా ఆయన- ఉత్సాహం పొంగిపొర్లే అద్భుతమైన వ్యక్తిత్వం, అసమాన ప్రతిభ మూర్తీభవించిన నటుడు. ఈ నేపథ్యంలో కర్ణాటక సహజ సౌందర్యం, పర్యావరణ పరిరక్షణ ఇతివృత్తంతో ప్రకృతి మాతకు నివాళిగా ‘గంధదగుడి’ ద్వారా చేసిన చిత్ర బృందం కృషికి నా శుభాకాంక్షలు” అని పేర్కొన్నారు.
*****
DS/TS
(Release ID: 1866279)
Visitor Counter : 147
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam