ప్రధాన మంత్రి కార్యాలయం
మహారాష్ట్రలోని నాసిక్‌లో బస్సు ప్రమాదంపై ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతి; ‘పీఎంఎన్‌ఆర్‌ఎఫ్’ నుంచి పరిహారం ప్రకటన
Posted On:
08 OCT 2022 9:43AM by PIB Hyderabad
మహారాష్ట్రలోని నాసిక్‌లో చోటుచేసుకున్న ఘోర బస్సు ప్రమాదంలో మరణించినవారికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఈ దుర్ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్‌ఆర్‌ఎఫ్) నుంచి రూ.2 లక్షల వంతున, క్షతగాత్రులకు తలా రూ.50,000 చొప్పున ప్రధానమంత్రి నష్టపరిహారం ప్రకటించినట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“నాసిక్‌లో జరిగిన బస్సు దుర్ఘటన తీవ్రంగా కలచివేసింది. ఈ ప్రమాదంలో ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. స్థానిక అధికార యంత్రాంగం బాధితులకు అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తోంది: PM @narendramodi”
“నాసిక్‌లో బస్సు అగ్నిప్రమాదానికి గురైన సంఘటనలో మృతుల కుటుంబాలకు ‘పీఎంఎన్‌ఆర్‌ఎఫ్’ నుంచి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 వంతున పరిహారం చెల్లించబడుతుంది PM @narendramodi” అని ప్రధాని ప్రకటించినట్లు పేర్కొంది.
******
DS/ST
(Release ID: 1866093)
Visitor Counter : 165
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam