రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
బిహెచ్ సిరీస్ సవరణ కోసం ముసాయిదా నోటిఫికేషన్
Posted On:
07 OCT 2022 11:22AM by PIB Hyderabad
భారత్ (బిహెచ్) సిరీస్ నమోదు గుర్తును నియంత్రించే నిబంధనలలో సవరణలను నోటిఫై చేసేందుకు రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ (ఎంఒఆర్‌టిహెచ్) 04 అక్టోబర్ 2022న జి.ఎస్.ఆర్. 672 (ఇ) ముసాయిదా నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఎంఒఆర్‌టిహెచ్ 26 ఆగస్టు 2021న జి.ఎస్.ఆర్. 594 (ఇ) ద్వారా బిహెచ్ సిరీస్ నమోదు గుర్తును ప్రవేశపెట్టింది. కాగా, ఈ నిబంధనను అమలు చేసే క్రమంలో బిహెచ్ సిరీస్ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా పలు విజ్ఞాపనా పత్రాలను శాఖ అందుకుంది.
బిహెచ్ సిరీస్ అమలు పరిధిని మరింత మెరుగుపరిచి, విస్త్రతం చేసే కృషిలో భాగంగా ఎంఒఆర్‌టిహెచ్ దిగువన పేర్కొన్న కీలక అంశాలతో నూతన నిబంధనలను ప్రతిపాదించిందిః
1. బిహెచ్ సిరీస్ నమోదు గుర్తు ఉన్న వాహనాలను బిహెచ్ సిరీస్‌కు అర్హులైన లేదా అనర్హులైన ఇతర వ్యక్తులకు బదిలీ చేయడాన్ని సులభతరం చేశారు.
2. ప్రస్తుతం సాధారణ రిజిస్ట్రేషన్ గుర్తు ఉన్న వాహనాలను కూడా బిహెచ్ సిరీస్ నమోదు ముద్రకు మార్చుకోవచ్చు. అయితే, అవసరమైన పన్నును చెల్లించడం ద్వారా బిహెచ్ సిరీస్ రిజిస్ట్రేషన్ ముద్రను పొందేందుకు వ్యక్తులు అర్హులయ్యే సౌకర్యం కలిగించింది.
3. పౌరులకు మరింత సౌలభ్యాన్ని అందించడానికి, వారు తమ నివాస స్థలం లేదా పని ప్రదేశం నుంచి బిహెచ్ సిరీస్ కోసం దరఖాస్తును సమర్పించడాన్ని సులభతరం చేసందుకు 48 నిబంధనలో సవరణను ప్రతిపాదించారు.
4. దుర్వినియోగాన్ని నిరోధించేందుకకు ప్రైవేటు రంగ ఉద్యోగులు సమర్పించవలసిన వర్కింగ్ సర్టిఫికెట్ ను మరింత పటిష్టం చేశారు.
గెజెట్ నోటిఫికేషన్‌ను చూసేందుకు దిగువన క్లిక్ చేయండిః
(Release ID: 1865813)
Visitor Counter : 199