ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఉత్తరకాశీ పర్వతారోహణ యాత్రలో హిమపాతంతో ‘ఎన్ఐఎం’ బృందం మృతిపై ప్రధానమంత్రి సంతాపం

Posted On: 04 OCT 2022 9:54PM by PIB Hyderabad

   త్తరకాశీ పర్వతారోహణ యాత్రలో హిమపాతం ఫలితంగా నెహ్రూ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మౌంటెనీరింగ్‌ (ఎన్‌ఐఎం) బృందం ప్రాణాలు కోల్పోవడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. అక్కడ రక్షణ-సహాయ చర్యలు కొనసాగుతున్నాయని, పరిస్థితిని అధికారులు జాగ్రత్తగా పరిశీలిస్తున్నారని ఆయన తెలిపారు.

ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో;

“ఎన్‌ఐఎం బృందం ఉత్తరకాశీ పర్వతారోహణ యాత్ర సందర్భంగా ప్రాణనష్టం సంభవించడం నన్నెంతో కలచివేసింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఆ ప్రాంతంలో రక్షణ-సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. పరిస్థితిని ఉన్నతాధికారులు జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు” అని ప్రధాని పేర్కొన్నట్లు తెలిపింది.


(Release ID: 1865431) Visitor Counter : 139